Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
బేబీ తెలివితేటలతో పుట్టాలంటే ఖచ్చితంగా ఇవి తినాల్సిందే...
సాధారణంగా మహిళ గర్భం పొందిన తర్వాత తనకు పుట్టే బిడ్డ అందంగా ఆరోగ్యంగా మరియు తెలిగా ఉండాలని కోరుకుంటారు. అది కేవలం బిడ్డ గర్బంలో ఉన్నప్పుడు తల్లి తీసుకొనే జాగ్రత్తలు, ముఖ్యంగా డైట్ విషయంలో తీసుకొనే జాగ్రత్తలే కడుపులో పెరిగే బిడ్డ యొక్క ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. తల్లి సరైన పౌష్టికాహారం తీసుకోకపోతే కడుపులో పెరిగే బిడ్డ యొక్క ఆరోగ్యం మీద మరియు శిశువు ప్రవర్తనలో మార్పులు ఉంటాయి.
మహిళలు గర్భంతో ఉన్నప్పుడు వారు తీసుకొనే ఆహారాలు శిశువు యొక్క మానసిక మరియు శారీరక ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది . కాబట్టి, కొన్ని బ్రెయిన్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల పిల్లల్లో బ్రెయిన్ పవర్ ను మెరుగుపరుచుకోవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలోనే కాదు, గర్భం పొందిన ప్రారంభదశ నుండి లేదా గర్భధారణకు ప్లాన్ చేస్తున్నప్పుటి నుండి ఇలాంటి ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
READ MORE: గర్భిణీ స్త్రీలు ఎండు ద్రాక్ష తినడం వల్ల పొందే గొప్ప ప్రయోజనాలు
ఈ సప్లిమెంట్ ఫుడ్స్ కడుపులో పెరిగే శిశువు యొక్క ఐక్యు(ఇంటలిజెంట్ కోట్)పెంచుతుంది. అలాగే మీ బేబీ యొక్క బ్రెయిన్ పవర్ ను మెరుగుపరచుకోవచ్చు . కాబట్టి, పుట్టబోయే బేబీ కోసం..బ్రెయిన్ పవర్ పెంచడం కోసం కొన్ని అత్యవసర న్యూట్రీషియన్స్ అవసరం అవుతాయి.
సహజంగా బేబీ పుట్టినప్పుడు బేబీ బ్రెయిన్ 25శాతం సైజులో ఉంటుంది. ఇది అడల్ట్స్ యొక్క బ్రెయిన్ తో సమానంగా నార్మల్ గా ఉంటుంది. ఎప్పుడైతే బేబీ పెరుగుదల 2ఏళ్ళకు పెరుగుతారో, అప్పుడు బేబీలో బ్రెయిన్ పెరుగుదల 75శాతం పెరుగుతుంది. కాబట్టి, మొదటి రెండేళ్ళు బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్ మెంట్ కు చాలా ముఖ్యమైనది భావించాలి.
READ MORE:గర్భిణీస్త్రీలలో వ్యాధినిరోధకశక్తిని పెంచే జామకాయ..
కాబట్టి మంచి తెలివితేటలతో బేబీ పుట్టాలంటే తల్లి గర్భంతో ఉన్నప్పుడు తినాల్సిన స్మార్ట్ బేబీ ఫుడ్స్.....

ఫ్యాటీ ఫిష్:
చేపల్లో సాల్మన్, తున, మెకెరెల్ మొదలగునవాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఎవరైతే ఒక వారంలో రెండు సర్వింగ్స్ కంటే తక్కువ తినేవారిలో అలాంటి వారికి లోఐక్యు బేబీలు పుట్టే అవకాశం ఉంది . కాబట్టి, వారానికి కనీసం రెండు సర్వింగ్స్ లో ఫిష్ తినడం ఆరోగ్యకరం.

గుడ్లు:
గుడ్లలో అమినోయాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ మరియు మెమరీనీ మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కాబట్టి, గర్భిణీ స్త్రీలు ప్రతి రోజూ ఎగ్ వైట్ ను తీసుకోవడం మంచిది లేదా వారంలో రెండు గుడ్లను తప్పని సరిగా తింటే ప్రోటీన్స్ మరియు ఐరన్ పుష్కలంగా అందుతుంది. ఇది బ్రెయిన్ వెయిట్ ను పెంచుతుంది. దాంతో ఐక్యూ పెరుగుతుంది.

పెరుగు:
గర్భినీ పొట్టలో ఉండే శిశువు నాడీవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే, ఎక్స్ ట్రా ప్రోటీన్స్ ను తీసుకోవాలి . అందుకు పెరుగు వంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ను తీసుకోవాలి . గర్భధారణలో క్యాల్షియం కూడా ఎక్కువ అవసరం అవుతుంది.

ఆకుకూరలు, లీన్ చికెన్ మరియు బీన్స్:
ఆకుకూరల్లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల అది మిమ్మల్ని స్మార్ట్ గా మార్చుతుంది. గర్భధారణలో బేబీ బ్రెయిన్ కు ఐరన్ అంధించబడుతుంది.

బ్లూ బెర్రీస్:
ఫ్రూట్స్ బ్లూబెర్రీస్, ఆర్టిచోక్స్, టమోటోలు, మరియు రెడ్ బీన్స్ వంటివాటిలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల గర్భధారణలో ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ పండ్లు బేబీ బ్రెయిన్ డెవలప్ మెంట్ మరియు కణజాలవ్యవస్థకు సహాయపడుతుంది.

విటమిన్ డి:
ఇది బేబీ బ్రెయిన్ డెవలప్ మెంట్ కు చాలా సహాయపడుతుంది . గర్భిణీల్లో విటమిన్ డి నార్మల్ కంటే తక్కువగా ఉన్నప్పుడు ఎండలో కూర్చొమని చెబుతుంటారు. అలాగే గుడ్లు, చీజ్, బీఫ్, లివర్ వంటి విటమిన్ డి ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవాలి.

ఐయోడిన్:
గర్భధారణ సమయంలో ఐయోడిన్ లోపం ఉంటే పిల్లల్లో ఐక్యు తగ్గుతుంది. కాబట్టి ఐయోడిన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ను ముఖ్యంగా మొదటి 12 వారలు తీసుకోవాలి. గర్భధారణ సమయంలో అయోడైజ్డ్ సాల్ట్ ను తీసుకోవాలి. సీఫిష్, ఓయిస్ట్రెస్, గుడ్లు, పెరుగు వంటివాటిని ఎక్కువగా తీసుకోవాలి.

ఫోలిక్ యాసిడ్ ప్రీనేటల్ సప్లిమెంట్:
బేబీ బ్రెయిన్ సెల్స్ కు ప్రీనేటల్ సప్లిమెంట్ చాలా వసరం అవుతుంది. కాబట్టి ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే ఫుడ్స్ ను తీసుకోవాలి.



Click it and Unblock the Notifications
