Latest Updates
-
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
గర్భిణీలు డ్రైనట్స్ తినడం వల్ల పొందే 10 అమేజింగ్ బెనిఫిట్స్ ..!!
సాధారణంగా డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాల) లో ఉండే పోషకాల గురించి వినే ఉంటారు. అందుకే ఈ డ్రైఫ్రూట్స్ ను ప్రతి రోజూ తినమని చెబుతుంటారు. శరీరంలో ఒక బలమైన వ్యాధినిరోధక శక్తిని పొందడానికి మీ రెగ్యులర్ డైయట్ లిస్ట్ లో ఈ డ్రైఫ్రూట్స్ ను చేర్చుకోవడం మంచి పద్దతి. ఆరోగ్యానికి కాలవలసిన పోషకాలు పుష్కలంగా డ్రై ఫ్రూట్స్‌లో ఉన్నాయి. అవి చూడడానికి చిన్నవిగా ఉన్నా వాటికుండే శక్తి ఎక్కువ. ఇందులో ఖనిజలవణాలు, విటమిన్లు, ఎంజైములు స్రవించడానికి అవసరమైన వనరులు వీటిల్లో అధికం.
అయితే మనలో చాలా మందికి ఈ 'డ్రై ఫ్రూట్స్' గురించి మరియు వాటిలో ఉండే పోషక విలువలు శరీరానికి ఏవిధంగా పనిచేస్తాయో తెలియదు. తెలుసుకోరుకూడా.. అదే సమయంలో కొంతమంది స్వీట్స్ తినడానికి చాలా ఎక్కువగా ఇష్టంచూపుతుంటారు. బయట బేకరీల్లో, స్వీట్స్ స్టాల్స్ లో, మార్కెట్లో లభ్యమయ్యే కొన్ని రకాల స్వీట్స్ మీద ఈ డ్రైఫ్రూట్స్ తో గార్నిషింగ్ చేసి, క్యాండీలకు, చాక్లెట్లకు ప్రత్యామ్నాయాలుగా ఆకర్షిస్తుంటాయి.
ఇలాంటి వాటిని తినడానికి బదులు నేరుగా ఫ్రెష్ గా విడిగా తీనడం ఆరోగ్యానికి మంచిది. గర్భిణీలు డ్రై ఫ్రూట్స్ తినడం మంచిదేనా? కొంత మంది అలర్జికి గురౌతుంటారు. ముఖ్యంగా గర్భినీలు డ్రైఫ్రూట్స్ తినడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి . కానీ వీటిని తీసుకొనే విధానం, పరిమితంగా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. ఎందుకంటే వీటిలో అత్యధికంగా న్యూట్రీషియన్స్ మరియు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, గర్భిణీలు ఖచ్చితంగా తీసుకోవడం మంచిది.

1. విటమిన్స్ :
గర్భిణీ స్త్రీలకు గర్భధారణ సమయంలో కావల్సిన విటమిన్స్ మరియు మినిరల్స్ అందిస్తుంది.

2. మినిరల్స్ ఎక్కువ:
ఇందులో ఫాస్పరస్, పొటాషియం, జింక్, సెలీనియం, కాపర్ మరియు ఫీటస్ డెవలప్ మెంట్ కు అవసరమయ్యే పోషకాలు అత్యధికంగా ఉంటాయి .

3. మంచి ఫ్యాట్:
గర్భిణీలకు గర్భదారణ కాలంలో అవసరమయ్యే ఫ్యాట్ ఎక్కువగా ఉన్నాయి.

4. ఎనర్జీ ఫుడ్ :
డ్రై ఫ్రూట్స్ గ్రేట్ ఎనర్జీ ఫుడ్. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువ. వీటి పోషక విలువలు తెలిసిన వ్యక్తులు వీటిని వారి రెగ్యులర్ డైట్ లో ఒక బాగంగా చేసుకుంటారు. ముఖ్యంగా గర్భినీలు ఒంట్లో శక్తిలేనప్పుడు, 5,6డ్రై ఫ్రూట్ తింటే చాలు తక్షణ శక్తిని పుంజుకుంటుంది. కాబట్టి, రోజులో మీరు వీలున్నప్పుడు లేదా గుర్తొచ్చినప్పుడు రెండు, మూడు నోట్లో వేసుకొని నమలండి.

5. రక్తహీనత:
గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో బాధపడుతుంటారు. అలాంటి వారు డ్రై ఫ్రూట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల హీమోగ్లోబిన్ పెరుగుతుంది. హెల్తీ డ్రై ఫ్రూట్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి చేస్తుంది మరియు బ్లడ్ వెజల్స్ లో ఫ్లెక్సిబిలిటి ఉంటుంది. ఇది హీమోగ్లోబిన్ మెరుగుపరచడంలో గొప్ప పాత్ర పోషిస్తుంది. దాంతో రక్తహీనత సమస్య ఉండదు.

6. జీర్ణ శక్తిని పెంచుతుంది:
గర్భిణీలు 5 నెలల తర్వాత జీర్ణ సమస్యలను ఎదుర్కొంటుంటారు. డ్రై ఫ్రూట్స్ లోని హెల్త్ బెనిఫిట్స్ లో ముఖ్యమైనది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్దకం వంటి సమస్యలను నివారిస్తుంది. డ్రై ఫ్రూట్స్ లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అజీర్తిని నివారించే మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది.

7. కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ చేస్తుంది:
ఇది నమ్మడానికి కొంచెం కష్టం అనిపించినా, అవును ఇది నిజం, ఆరోగ్యప్రయోజనాల పరంగా డ్రై ఫ్రూట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ బ్యాలెన్స్ చేస్తుంది. డ్రై ఫ్రూట్స్ లో ఫ్యాట్స్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి అద్భుతంగా సహాయపడుతాయి. ముఖ్యంగా గర్భిణీలో కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతుంది.

8. కంటిచూపు:
గర్భిణీలు డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల తల్లి బిడ్డలో కంటి చూపును మెరుగుపరుస్తుంది. డ్రై ఫ్రూట్స్ హెల్త్ బినిఫిట్స్ లో ఇది ఒక గ్రేట్ హెల్త్ బెనిఫిట్. వృద్ధాప్యంలో వచ్చే కంటి సమస్యలను నివారిస్తుంది. డ్రై ఫ్రూట్స్ లో కెరోటినాయిడ్స్ మరియు విటమిన్ ఎ అధికంగా ఉండి కంటి ఆరోగ్యాన్నికి సహాయపడుతాయి.

9. ఎముకల ఆరోగ్యానికి :
గర్భిణీలో క్యాల్షియం లోపం ఉంటుంది. తల్లి బిడ్డకు తగినంత క్యాల్షియం అందిస్తుంది. హెల్తీ డ్రై ఫ్రూట్స్ లో క్యాల్షియం మరియు ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన తల్లి, బిడ్డలో ఎముకల బలానికి చాలా గొప్పగా సహాయపడుతాయి. డ్రైఫ్రూట్స్ దంతక్షయాన్ని మరియు చిగుళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

10. బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:
డ్రై ఫ్రూట్స్ లో ఉండే న్యూట్రిషినల్ యాసిడ్స్ రక్తంలో షోషణ చెంది, అసిడోసిస్ ను నివారిస్తుంది. కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ గర్భిణీలో బ్లడ్ ప్రెజర్ బ్యాలెన్స్ చేయడానికి మరియు శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతాయి.



Click it and Unblock the Notifications











