Latest Updates
-
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన బాదం నూనె..ఈజీగా చేసుకోండిలా -
పండగకైనా, పార్టీకైనా స్పెషల్ స్వీట్ మాల్పువా..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
శ్రావణ శుక్రవారం స్పెషల్.. అమ్మవారికి నైవేద్యంగా కమ్మనైన ఆవ పులిహోర ఇలా చేయండి.! -
అయినవారితో ఏకీభవించలేకపోతున్నారా.. ఈ విషయాల్లో మాత్రం ‘కాదు’ అని చెప్పాల్సిందే.! -
కొత్తగా ఏదైనా తినాలని ఉందా? ఒక్కసారి ఈ రవ్వ రొట్టె చేసి చూడండి..చచ్చేదాకా ఇదే కావాలంటారు! -
ప్రపంచ అవయవదాన దినోత్సవం.. ఆర్గాన్ డొనేషన్‌పై ఇప్పటికీ వీడని అపోహలు.. వాస్తవాలివే.! -
ఈ పొడి వేసి పచ్చిమిరపకాయ వేపుడు చేస్తే.. అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు! -
చపాతీ పిండి ముద్ద మిగిలితే ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. వాడే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
బీపీ, కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టే నల్ల వెల్లుల్లి.. దీని ప్రయోజనాలు అదుర్స్! -
దాబా స్టైల్ వెజ్ కీమా కర్రీ.. గ్రేవీలో ఈ రెండూ కలిపారంటే టేస్ట్ అదిరిపోవాల్సిందే.!
ఆరోగ్యకరమైన శిశువు కోసం గర్భధారణ సమయంలో తినవలసిన 12 బెస్ట్ ఫుడ్స్
మీరు తల్లి కాబోతున్నారనే విషయం తెలియగానే ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేము. అయితే గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం మాత్రం మర్చిపోకూడదు. ఇప్పుడు ఇక్కడ చెప్పే చిట్కాలను ఫాలో అవ్వండి.
గర్భధారణ అనేది ప్రతి స్త్రీ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైన దశ. ఆ సమయంలో ప్రతి విషయం పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ సమయంలో ఆమె ఆరోగ్యం మరియు శిశువు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.
ఈ సమయంలో చిన్న తప్పు చేసిన ఆ ప్రభావం పరోక్షంగా మీ శిశువు యొక్క ఆరోగ్యం మీద చూపుతుంది. అంతేకాక మీ ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపవచ్చు.
మీరు మంచి పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వవచ్చు. ఇది ఆరోగ్యకరమైన గర్భధారణకు అతి ముఖ్యమైన కారకాలలో ఒకటి. ఎటువంటి సమస్యలు లేకుండా సహాయపడుతుంది.
గర్భిణీ తగినంత పోషకాలు తీసుకోకపోతే, అప్పుడు ఆమె శరీరం ఇంకా పుట్టని బిడ్డను పోషించటం కష్టం అవుతుంది. కాబట్టి గర్భవతిగా ఉన్న సమయంలో తగినంత పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలి.
ఇక్కడ ఆరోగ్యకరమైన బిడ్డను జన్మనివ్వటానికి అవసరమైన ఆహారాలు ఉన్నాయి. వీటి మీద ఒక లుక్ వేద్దాం.

గుడ్లు
గుడ్లలో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. అవి పుట్టబోయే బిడ్డ యొక్క కండరములు మరియు ఎముకల పోషణలో సహాయం చేస్తాయి.

చేపలు
గర్భధారణ సమయంలో చేపలను తినటం అనేది మంచి ఆహార చిట్కా అని చెప్పవచ్చు. ఎందుకంటే చేపలలో ఉండే విటమిన్ E శిశువు యొక్క నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

ఆపిల్ పండు
ఆపిల్ లో యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శిశువు ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే గర్భధారణ సమయంలో వచ్చే మలబద్దకం సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది.

బీన్స్
బీన్స్ లేదా రాజ్మా లో ప్రోటీన్స్ సమృద్ధిగా ఉండుట వలన ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఒక గొప్ప ఆహారం అని చెప్పవచ్చు.

చిలగడదుంప
గర్భధారణ సమయంలో చిలగడదుంప తీయటం అనేది ఉత్తమమైన ఆహార చిట్కా అని చెప్పవచ్చు. విటమిన్ సి మరియు ఫోలేట్ సమృద్ధిగా ఉండుట వలన మీ ఆరోగ్యం మరియు శిశువు ఆరోగ్యానికి చాలా మంచిది.

వాల్నట్స్
గర్భధారణ సమయంలో వాల్నట్స్ తినటం అనేది మంచి ఆరోగ్యకరమైన అలవాటు. వాల్నట్స్ లో ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు బాగా సహాయపడతాయి .

బాదం పప్పు
బాదంలో విటమిన్ E మరియు ప్రొటీన్స్ సమృద్ధిగా ఉండుట వలన పుట్టబోయే పిల్లల ఎముకల అభివృద్ధిలో సహాయపడుతుంది.

పాలు
పాలలో విటమిన్లు మరియు ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. గర్భధారణ సమయంలో పాలను తీసుకుంటే చాలా మంచిది.

బార్లీ
బార్లీ అనేది ఆరోగ్యవంతమైన ఆహారాలలో ఒకటిగా ఉంది. మీరు ఉత్తేజంగా ఉండటానికి మరియు బిడ్డ పోషణకు సహాయపడుతుంది.

శనగలు
శనగలలో ప్రోటీన్ సమృద్ధిగా ఉండుట వలన గర్భధారణ సమయంలో మంచి ఆహారం.

పాలకూర
పాలకూరలో ఇనుము కంటెంట్ సమృద్ధిగా ఉండుట వలన బిడ్డ రక్త కణాల అభివృద్ధిలో సహాయపడుతుంది.

అవకాడో
గర్భధారణ సమయంలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు చాలా అవసరం. ఈ ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అవకాడోలో సమృద్ధిగా ఉంటాయి.



Click it and Unblock the Notifications