Latest Updates
-
ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కోసం భార్యాభర్తలు ఎలా కలవాలి.? -
తల్లిపాల వారోత్సవాలు.. బిడ్డే కాదు బాలింత కోసం కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.! -
బుధాదిత్య యోగం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ఇంటి ముంగిటే.! -
గంటల తరబడి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.! -
తెలంగాణలో వైభవోపేతంగా ఆషాఢ బోనాలు.. రంగంలో భవిష్యవాణి చెప్పిన సంగతులివే.! -
హస్తసాముద్రికం: మీ చేతిలో ఈ రేఖ ఉంటే కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ మసాలా దోశ ఇంట్లోనే.. ఈ రెండు సీక్రెట్స్ తెలిస్తే చాలు!
గర్భిణీల రెగ్యులర్ డైట్ లో అల్లం చేర్చుకోవడంతో పొందే అద్భుత ప్రయోజనాలు.!!
ప్రకృతిలో సహజసిద్దంగా పండే ఆహారపదార్థాల్లో అల్లం ఒకటి. అల్లంలో అల్లీసిన్ అనే కంటెంట్ అధికంగా ఉంటుంది. దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల గర్భిణీల పొట్టలో స్టొమక్ యాసిడ్స్ పెరుగుతాయి, గ్యాస్ ను
మహిళ జీవితంలో గర్భధారణ చాలా సున్నితమైన అంశం. మహిళ గర్భం పొందిన తర్వాత, ఆమె శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. హార్మోనుల ప్రభావం వల్ల గర్భిణీ శరీరంలో మార్పులు జరగడం సహజం . హార్మోనుల్లో మార్పుల కారణంగా గర్భిణీలో మార్నింగ్ సిక్ నెస్ లేదా బరువు పెరగడం జరుగుంది.
మార్నింగ్ సిక్ నెస్ తో పాటు చాలా మందిలో గ్యాస్ట్రో ఇంటెన్షినల్ డిజార్డర్స్, హార్ట్ బర్న్, బ్లోటింగ్, స్టొమక్ క్రాంప్స్, మలబద్దం, పొట్ట ఉదరంలో నొప్పి, లోయర్ బ్యాక్ పెయిన్, లెగ్ క్రాంప్స్ వంటి సమస్యలు సహజం. ఇలాంటి పరిస్థితిలో ఆహారాల పట్ల అనేక సందేహాలుంటాయి. గర్భిణీలు రెగ్యులర్ గా తీసుకునే ఆహారాల్లో అల్లం ఒకటి. అయితే చాలా మంది అల్లం తీసుకోవడం గర్భిణీలకు సురక్షితమా కాదా అని అపోహపడుతుంటారు. అయితే పోషకాహార నిపుణులు అభిప్రాయం ప్రకారం, అల్లం తినడంవల్ల గర్భధారణ సమయంలో వచ్చే జాయింట్ పెయిన్ తగ్గుతాయి మరియు జీర్ణ శక్తి పెరుగుతుంది.
అంతే కాదు గర్భిణీలు అల్లంను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల గర్భధారణ కాలంలో వచ్చే అన్ని రకాల ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఆ విషయం తెలుసుకోవాలి లేదా నిర్ధారించుకోవాలనుకుంటే ఈ క్రింది హెల్త్ బెనిపిట్స్ గురించి మీరు తప్పని సరిగా తెలుసుకోవాల్సిందే ....
గర్భిణీలు అల్లం తినడం వల్ల పొందే ప్రయోజనాలు !
ప్రకృతిలో సహజసిద్దంగా పండే ఆహారపదార్థాల్లో అల్లం ఒకటి. అల్లంలో అల్లీసిన్ అనే కంటెంట్ అధికంగా ఉంటుంది. దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల గర్భిణీల పొట్టలో స్టొమక్ యాసిడ్స్ పెరుగుతాయి, గ్యాస్ ను ఉత్పత్తి అవుతుంది. కడుపుబ్బరంను తగ్గిస్తుంది. జీర్ణ సమస్యలుండవు. గర్భిణీల రెగ్యులర్ డైట్ లో అల్లం చేర్చుకోవడం వల్ల పొందే అత్యంత సాధారణమైన ప్రయోజనాలు ఈ క్రింది విధంగా :

బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది:
అల్లంను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల తల్లిలో మాత్రమేకాదు, బిడ్డలో కూడా రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దాంతో తల్లిబిడ్డ ఆరోగ్యంగా ఉంటారు .

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:
గర్భిణీల రెగ్యులర్ డైట్ లో అల్లం చేర్చుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు. గర్భధారణ సమయంలో హై కొలెస్ట్రాల్ లెవల్స్ ఆరోగ్యానికి హానికలిగిస్తాయి

మార్నింగ్ సిక్నెస్ తగ్గిస్తుంది:
గర్భిణీల రెగ్యులర్ డైట్ లో అల్లం చేర్చుకోవడం వల్ల మార్నింగ్ సిక్నెస్, వికారం నుండి ఉపశమనం కలిగిస్తుందని, నిపుణులు సూచిస్తున్నారు .

దగ్గు, జలుబు తగ్గిస్తుంది:
గర్భినీల రెగ్యులర్ డైట్ లో అల్లం చేర్చుకోవడం వల్ల గర్భిణీల్లో వచ్చే సాధారణ జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.

యాంటీఇన్ఫ్లమేటరీ:
అల్లంలో ఉండే 12 రకాల యాంటీఆక్సిడెంట్స్ గ్రేట్ యాంటీ ఇన్ఫ్లమేటీరీగా పనిచేస్తుంది. ఫ్రీరాడికల్స్ ను న్యూట్రలైజ్ చేస్తుంది.గర్భిణీ మహిళలల్లో వచ్చే వాపులు, నొప్పులను తగ్గించడంలో అల్లం గ్రేట్ గా సహాయపడుతుంది.

వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది :
రెగ్యులర్ డైట్ లో ఫ్రెష్ గా ఉండే అల్లం చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే ఐరన్, విటమిన్ సి అందిస్తుంది. ఇది బిడ్డ పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. తల్లి, బిడ్డలో వ్యాధినిరోధక శక్తిపిని పెంచడంతో పాటు బర్త్ డిఫెక్ట్స్ ను నివారిస్తుంది.

గ్లూకోజ్ లెవల్స్ ను మ్యానేజ్ చేస్తుంది:
గర్భధారణ సమయంలో వచ్చే జస్టేషనల్ డయాబెటిస్ ను నివారించడంలో అల్లం గ్రేట్ గా సమాయపడుతుంది. అల్లంను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల గ్లూకోజ్ లెవల్స్ కంట్రోల్ చేస్తుంది. ఇది తల్లి బిడ్డకు సురక్షితం. ఎనర్జీ లెవల్స్ పెంచుతుంది.

హార్ట్ బర్న్ తగ్గిస్తుంది:
గర్భధారణ సమయంలో హార్ట్ బర్న్ చాలా తీవ్రమైన సమస్య . ముఖ్యంగా రాత్రుల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది. ఈ సమస్యను నివారించుకోడానికి, ఎక్సెస్ యాసిడ్స్ ను తగ్గించి, హార్ట్ బర్న్ నుండి ఉపశమనం పొందడానికి అల్లం గ్రేట్ గా సహాయపడుతుంది. . ఈవెనింగ్ మీల్స్ లో అల్లం చేర్చుకోవడం వల్ల నైట్ లో హార్ట్ బర్న్ సమస్య ఉండదు.

మజిల్స్ స్ట్రాంగ్ గా ఉంచి, నొప్పులను తగ్గిస్తుంది:
గర్భధారణ సమయంలో శరీరానికి సరైన వ్యాయామం ఉండదు, దానికి తోడు అధిక బరువు పెరగడం వల్ల కండరాలు , బ్యాక్ పెయిన్, కండరాలు పట్టివేత, మంజిల్ క్రాంప్స్ వాపులు, నొప్పులను తగ్గించడానికి అల్లం గ్రేట్ రెమెడీ.



Click it and Unblock the Notifications