Latest Updates
-
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా..
గర్భిణీ తీసుకొనే పెయిన్ కిల్లర్స్, పుట్టే బిడ్డ మీద ఎలా ప్రభావం చూపుతాయి..
మత్తుమందులను పెయిన్ కిల్లర్లుగా వాడితే, పుట్టే బిడ్డలో శారీరక లోపాలు వస్తాయా? అన్నవిషయం తెలుసుకోవడానికి కొన్ని పరిశోధనలు నిర్వహించారు. మత్తుమందు పెయిన్ కిల్లర్లు అయిన కోడీన్, ఆక్సీకోడోన్ లేదా హైడ్రోకోడోన్ వంటివి ప్రెగ్నెన్సీ ముందు లేదా ప్రెగ్నెన్సీ మొదటి త్రైమాసికిలో తీసుకుంటే, పుట్టబోయే పిల్లలకు శారీరక లోపాలు వస్తాయని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ మరియు ప్రివెన్షన్ సంస్ధ తాజాగా నిర్వహించిన ఒక స్టడీలో వెల్లడించింది.
ఈ స్టడీని అమెరికన్ జర్నల్ ఆప్ ఆబ్ స్టెట్రిక్స్ మరియు గైనకాలజీలో ప్రచురించారు. సర్వే చేసిన తల్లులలో రెండు నుండి మూడు శాతం మంది తల్లులు మత్తుమందుల పెయిన్ కిల్లర్లు లేదా అనాల్జసిక్ మందులతో చికిత్స చేయబడ్డారు. అయితే స్టడీలో మందులను తల్లులు వారంతవారే వాడితే వచ్చే ప్రమాదాలను పరిశీలించలేదు. వైద్యుల పర్యవేక్షణలోనే ఈ పెయిన్ కిల్లర్లు వాడితే వచ్చే అనర్ధాలను పరిశీలించింది.

మహిళలు సాధారణంగా వాడిన మత్తుమందు పెయిన్ కిల్లర్లు కోడీన్ మరియు హైడ్రో కోడోన్ గా గుర్తించారు. ఈ మందుల చికిత్సలను బిడ్డలలో పుటుకతో వచ్చే గుండె లోపాలు, వెన్నెముక లోపాలు, కంటిలోపాలు, జీర్ణ వ్యవస్ధ లోపాలు మొదలైన వాటితో పోల్చారు. అయితే, ఈ పరిశోధనలో పిల్లలకు వచ్చే గుండె సంబంధిత లోపాలు ఈ మందుల కారణంగానే వస్తున్నాయని తేలింది. ఈ ఫలితాలు, గతంలోని పరిశోధనలతో సరిపోలాయి.
ఈ మందులు వాడని మహిళల పిల్లలతో పోలిస్తే వాడిన మహిళ ల పిల్లలలో గుండె సంబంధిత లోపాలు రెండు రెట్లుగా వున్నట్లు పరిశోధన తెలిపింది. ఈ రకమైన లోపాలు అమెరికాలో ప్రతి సంవత్సరం షుమారు 40 వేలమంది పిల్లలలో వారి మొదటి సంవత్సరం వయసులోనే కనుగొనబడ్డాయి. ఈ పిల్లలకు తరచుగా సర్జరీలు, అధిక సమయం ఆస్పత్రిలో గడపటం, ఈ రకమైన లోపాలకు జీవితకాల చికిత్స వంటివి ఎదురయ్యాయి.

కొన్ని మందులు ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవటం ఎంతో ప్రమాదకరమైందని, నిర్ధారించారు. గర్భిణీ స్త్రీలు తీసుకునే మందులు గర్భంలోని పిల్లలపుటుకకు హాని కలిగించరాదని తెలిపారు. మందుల ప్రభావం అనేక కారణాలుగా వుంటుందని, వారు తీసుకునే మందు డోసేజి మొత్తం, ప్రెగ్నెన్సీలో ఏ సమయంలో తీసుకున్నారు? మహిళ ఆరోగ్య పరిస్ధితి, మహిళ తీసుకునే ఇతర మందులు వంటి వాటిపై కూడా ఆధారపడి వుంటుందన్నారు. కనుక గర్భవతి మహిళలు, లేదా గర్భం ధరించాలనుకునేవారు. ఈ రిస్కులతో కూడిన పెయిన్ కిల్లర్లు వాడరాదని స్టడీ నిర్వహించిన డైరెక్టర్ ధామస్ తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో అవసరంమేరకు ప్రధాన మందులు వాడాలని తెలిపారు.
కనుక గర్భవతి మహిళలు, లేదా గర్భం ధరించాలనుకునే మహిళలు, తమకు ఏ వ్యాధి వచ్చినప్పటికి విచక్షణా రహితంగా పెయిన్ కిల్లర్లను వాడితే, తాత్కాలికంగా వారికి ఉపశమనం కలిగినప్పటికి, దీర్ఘకాలంలో ఆ మందుల ప్రభావం వారికి పుట్టబోయే బిడ్డల ఆరోగ్యంపై చూపుతుంది. గర్భవతి మహిళ ప్రధానంగా తన ఆహారాలపట్ల కూడా శ్రధ్ధ వహించాలి. సరైన ఆహారాలు తీసుకొనకపోవడం, సరైన జీవన విధానాలు పాటించకపోవడం వంటివి పెయిన్ కిల్లర్లు వాడేందుకు దోహదం చేస్తాయని గుర్తించాలి.



Click it and Unblock the Notifications