Latest Updates
-
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.!
ప్రెగ్నెన్సీ సమయంలో ఒత్తిడి తగ్గించుకోవడానికి సింపుల్ టిప్స్
కొంత మంది మహిళలు గర్భం పొందిన తర్వాత, గర్భధారణ సమయంలో మానసికంగాను మరియు శారీరకంగాను ఒత్తిడి కలిగి ఉంటారు. ఇది వారు అనుభవపూర్వకంగా చెబుతున్న విషయం . గర్భం పొందిన తర్వాత శరీరంలో హార్మోనుల యొక్క ప్రభావం అమాంతం పెరుగుతాయి. ముఖ్యంగా అధిక జ్వరం మరియు అజీర్తి సమస్యలను కంట్రోల్ చేసుకోలేకపోతారు.
గర్భధారణ సమయంలో మొతం శరీరంలో వచ్చే మార్పులు వల్ల ఒత్తిడిని తగ్గించుకోలేకపోతారు. హార్మోనుల ప్రభావం వల్ల ఒత్తిడి మరింత పెరుగుతుంది, కంట్రోల్ చేసుకోలేరు .

మరి గర్భధారణ సమయంలో ఒత్తిడిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. గర్భధారణ సమయంలో వచ్చే ఒత్తిడిని తగ్గించుకోలేని పరిస్థితుల్లో వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి . లేదంటే ఆరోగ్య పరంగా తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.
అయితే, స్ట్రెస్ చాలా తక్కువ మాత్రమే ఉన్నప్పుడు జీవనశైలిలో కొన్ని సింపుల్ గా మార్పు చేసుకోవడం వల్ల , తిరిగి నార్మల్ స్థితికి రాగలుగుతారు. అందుకు కొన్ని చిట్కాలు ఈ క్రింది విధంగా...

ఒత్తిడికి గల కారణాలేంటో తెలుసుకోవాలి: ముందుగా ఒత్తిడికి గల కారాలేంటో తెలుసుకోవాలి. గర్భధారణ సమయంలో ఎక్కువగా ఒత్తిడిగా ఉన్నప్పుడు కారణం తెలుసుకోకపోతే, ఒత్తిడి నుండి బయట పడటం చాలా కష్టం.

విశ్రాంతి: గర్భధారణ సమయంలో విశ్రాంతి లేకుండా గడుపుతున్నట్లైతే వెంటనే బ్రేక్ తీసుకోవాలి. ఒత్తిడిలో ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి బయటకు వెళ్ళడం కూడా ఒక మంచి ఉపాయం.

మంచి పౌష్టికాహారం తీసుకోవాలి: మంచి ఆహారం తీసుకోవాలి. పోషకాల లోపం కూడా మీరు ఒత్తిడికి లోనవ్వడానికి కారణం అవుతుంది. కాబట్టి, గర్భధారణ సమయంలో మంచి పౌష్టికాహారంను తీసుకోవాలి.

యోగా: గర్భిణీ స్త్రీలు యోగా చేయడం వల్ల వారి మనస్సు మరియు శరీరం రిలాక్స్ గా ఉంటుంది. గర్భణీ స్త్రీ చేయవల్సిన కొన్ని యోగాసనాలున్నాయి, వాటిని ప్రయత్నించి ఆరోగ్యకరంగా గర్భంను పొందవచ్చు.

పాజిటివ్ గా ఆలోచించడం: పాజిటివ్ గా ఉండటం మరియు పాజిటివ్ గా ఆలోచించడం అన్నది గర్భిణీ స్త్రీ తను మనస్సును సంతోషకరమైన వాతావరణంలో మలచుకోవడం వల్ల గర్భధారణ సమయంలో చాలా సహాయపడుతుంది.

తేలికపాటి వ్యాయామాన్ని చెయ్యండి - తేలికపాటి వ్యాయామం చెయ్యడం ఎంతో మేలు. చిన్న నడక, ఈత లేదా యోగా క్లాస్ వంటివి మనల్ని తిరిగి ఉత్తేజితుల్ని చెయ్యడం లో ప్రజన పాత్ర పోషిస్తాయి. యోగా క్లాసులలో సాధన చేసే ప్రాణాయామ పద్దతుల వల్ల ఒత్తిడి నుండి కాపాడుకునే అవకాశం ఉంటుంది.



Click it and Unblock the Notifications
