Latest Updates
-
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి!
పుట్టబోయే బిడ్డ యొక్క జెండర్ తెలుసుకోవటం వలన కలిగే లాభనష్టాలేంటి?
పుట్టబోయే బిడ్డ యొక్క జెండర్ తెలుసుకోవటం వలన కలిగే లాభనష్టాలేంటి?
మీరు మీ శిశువు యొక్క జెండర్ తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఇటివల కాలంలో మహిళలతో పోలిస్తే పురుషులు ఎక్కువగా వారికీ పుట్టబోయే శిశువు జెండర్ తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. అయితే గర్భవతి అయిన మహిళ ఏమి తినాలి ఎలా ఉండాలి అనే విషయాల మీద పూర్తి హక్కు ఉండాలి.

అలాగే ఒక మహిళగా మీ గర్భంలో పెరుగుతున్న శిశువు యొక్క జెండర్ తెలుసుకోవటం పూర్తిగా మీ హక్కు మరియు మీ నిర్ణయంగా ఉండాలి. భారతదేశంలో, శిశువు యొక్క జెండర్ లేదా సెక్స్ తెలుసుకోవడం చట్టవిరుద్ధం అయినప్పటికీ, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఇది చట్ట విరుద్దం కాదు. అందువలన, జంటలు ముందుగానే వారికీ పుట్టబోయే శిశువు జెండర్ తెలుసుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు.
పొట్టలో ఉన్నది అబ్బాయా ? అమ్మాయా ? తెలుసుకోవడం ఎలా ?
ఇక్కడ జెండర్ తెలుసుకోవటం వలన కలిగే లాభాలు మరియు నష్టాలు రెండు ఉన్నాయి. ఈ వ్యాసాన్ని చదివితే మీకు జీవితంలో చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. అలాగే చాలా ఆశ్చర్యం మరియు షాక్ కలుగుతుంది. ఇప్పుడు గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

1. బందం పెరుగుతుంది
మీరు పుట్టబోయే బిడ్డ జెండర్ ముందుగానే తెలుసుకుంటే, మీరు మంచి మరియు బలమైన బంధం నిర్మించడానికి సహాయపడుతుంది. శిశువు గర్భంలోనే ఉండగానే జెండర్ తెలుసుకోవటానికి ఇది ఒక కారణం అని చెప్పవచ్చు.

2. పేరు గురించి ఆలోచన
మీరు శిశువు యొక్క జెండర్ గురించి ముందుగానే తెలుసుకుంటే వారి పేరు గురించి ఆలోచించవచ్చు.

3. తోబుట్టువులతో బందానికి సహాయపడుతుంది
మీకు ముందుగా పిల్లలు ఉంటే,ఇప్పుడు పుట్టబోయే శిశువుతో బందానికి సహాయపడుతుంది. అలాగే పిల్లలు కూడా పుట్టబోయే శిశువు కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

4. నర్సరీ కోసం సమయం
శిశువు యొక్క జెండర్ ముందుగానే తెలిస్తే మీకు మరియు మీ భాగస్వామికి నర్సరీ లో స్థిరపరచటానికి వీలు కలుగుతుంది.

5. ఆశ్చర్యం మిస్ అవుతారు
ప్రపంచంలో ఆశ్చర్యం అనేది అత్యుత్తమ భావాలలో ఒకటి. ముందుగానే జెండర్ తెలిస్తే ఈ ఆశ్చర్యాన్ని మిస్ అవుతాం.

6. అంచనాలు పెరుగుతాయి
కొంత మంది మహిళలు వారికీ పుట్టబోయే శిశువు యొక్క జెండర్ తెలుసుకొని, పుట్టబోయే శిశువు యొక్క ఆరోగ్యం గురించిన అంచనాల పెంచుకుంటారు.

7. అల్ట్రాసౌండ్
శిశువు యొక్క సెక్స్ ని గుర్తించడంలో అల్ట్రాసౌండ్ పరీక్ష 100 శాతం ఖచ్చితమైనది కాదని తెలుసా? కానీ అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించుకోవచ్చు. అయితే ఎక్కువగా ఆశలు పెట్టుకోకూడదు.



Click it and Unblock the Notifications
