అసాధారణ గర్భం దాల్చినప్పుడు కనిపించే గర్భాధారణ లక్షణాలు...

ప్రతి ఆడవారిలో గర్భ సమయంలో వివిధ రకాల లక్షణాలను బహిర్గతమవుతాయి. ఈ లక్షణాలు కూడా గర్భం ధరించిన ఆడవారి ఆరోగ్యము మరియు ధరించిన గర్భం సాధారణమా లేదా అసాధారణమా మరియు ఇతర కారకాల పైన కూడా ఆధారపడి ఉంటుంది.

కానీ మనలో చాలా మంది సాధారణ గర్భాన్ని కలిగి ఉన్నను వివిధ రకాల లక్షణాలను బహిర్గతమవుతుంటాయి. అందులో డోకులు, రుతుక్రమంలో మార్పులు, అలసట మరియు ఉదయపు జ్వరము, వంటివి బహిర్గతం అవుతుంటాయి. కానీ వీటితో పాటు చాలా రకాల అసాధారణ గర్భ లక్షణాలు కూడా బహిర్గతం అవుతాయి.

మలబద్ధకం

మలబద్ధకం

మీ శరీరంలో హార్మోన్'లలో కలిగే మార్పుల వలన ఇది సంభవిస్తుంది. హార్మోన్'లు జీర్ణాశయం నెమ్మదిగా మరియు నిధానంగా తన కదలికలను చూపుతుంది. ఈ సమస్య నుండి భయటపడుటకు, మీరు సరిపోయేంత మొత్తంలో ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి, అధిక మొత్తంలో నీటిని తాగాలి మరియు వ్యాయామాలను కూడా చేయాలి. ఒకవేళ మలబద్దకము వలన దీర్ఘకాలికంగా ఇబ్బంది పడినట్లయితే వైద్యుడిని సంప్రదించాలి లేదా ఉపశమనం కోసం ఇతర చికిత్సలను కూడా చేపించుకోవాలి.

దురదలుగా అనిపించటం

దురదలుగా అనిపించటం

అసాధారణ గర్భ సమయంలో బహిర్గతం అయ్యే మరొక లక్షణం శరీరం మొత్తం దురదలుగా అనిపించటం. శరీరం పైన దురదలు అని కొంత మంది స్త్రీలలో మాత్రమే కనిపిస్తుంది అది కూడా ఎవరైతే కోలేస్టాసిస్'తో (పైత్యరసము పారుదలకు ఆటంకము వలన జమ అవటం) ఇబ్బంది పడుతున్నారో వారిలో చర్మం పైన దురదలుగా అనిపిస్తుంది. దీని వలన కడుపులో పెరుగుతున్న శిశువు పైన ప్రభావం చూపే అవకాశం ఉంది.

సిరలు

సిరలు

అసాధారణ గర్భం ధరించిన తరువాత భుజాల పైన మరియు చాతి చుట్టూ ఉండే సిరలు భయటకి కనపడటం కూడా ఒక లక్షణంగా గుర్తించవచ్చు. వీటి వలన చాలా నిరాశకి గురవుతుంటారు. గర్భ సమయంలో రక్త పరిమాణం మరియు రక్త ప్రసరణ కూడా అధికం అవుతాయి. దీని ఫలితంగా చాతి పైన నీలి రంగులో రక్త నాళాలు బహిర్గతం అవుతాయి, అంతేకాకుండా వీటి వలన ఎలాంటి ప్రమాదాలు కలుగవు.

చర్మ సమస్యలు

చర్మ సమస్యలు

గర్భసమయంలో చాలా రకాల చర్మ సమస్యలకు గురి అవ్వవలసి వస్తుంది. మీ ముఖం పైన నల్లటి మచ్చలు లేదా శరీర భాగాల పైన అధిక చర్మం పెరగటం గమనిస్తారు. ముఖ్యంగా చర్మం రావటం లేదా చర్మం వేలాడటం వంటివి చేతుల పైన లేదా బాహ్యమూలాలలో కనపడుతుంది. దీనికి గల కారణం- మీ శరీరంలో అదనపు 'మెలనిన్' ఉత్పత్తి చెందటం, నల్లటి మచ్చలు ఏర్పడటం మరియు హార్మోన్'ల ప్రభావం వలన కూడా కలుగవచ్చు.

లాలాజల ఉత్పత్తి

లాలాజల ఉత్పత్తి

కొంత మంది ఆడవారు గర్భం ధరించిన తరువాత అధికంగా లాలాజలం ఉత్పత్తి అవుతుంది అని చెపుతుంటారు. గర్భ సమయంలో శరీరంలో కలిగే హార్మోన్'ల మార్పుల వలన ఇలా జరుగుతుంది. పిండి పదార్థాలను తక్కువగా తీసుకోవటం వలన మరియు నిమ్మకాయ రసంలో నీటిని కలుపుకొని తాగటం వలన ఈ సమస్య నుండి ఉపశనమం పొందవచ్చు మరియు వీటి వలన ప్రసవానికి ముందు లేదా కానీ తరువాత కానీ ఎలాంటి సమస్యలు కలుగవు.

గర్బ స్రావాలు అధికం అవటం

గర్బ స్రావాలు అధికం అవటం

గర్బ ధరించిన ఆడవారిలో చాలా రకాల మార్పులు కనపడతాయి ముఖ్యంగా వారిలో గర్భ సమయంలో స్రావాలు అధికంగా జరుగుతాయి. ఇవి అప్పుడపుడు రోజు మొత్తం కూడా కలుగవచ్చు. ఈ విడుదల అయ్యే స్రావాలు అసాధారణ రంగు మరియు వాసనను కలిగి ఉంటాయి. శరీరంలో హార్మోన్స్ మరియు యోని నుండి అధికంగా స్రావాలు విడుదల అవటం వలన ఇలా జరుగుతుంది, అంతేకాకుండా ఈ స్రావాలు మలిన వాసనలో, దురదలు లేదా మంటలను, లేదా ఆకుపచ్చ-పసుపు రంగులో లేదా పలుచగా లేదా చిక్కగా విడుదల అయినట్లయితే ఇన్ఫెక్షన్'కి గురి అయ్యారు అని అర్థం. మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన వైద్యం తీసుకోవటం మంచిది.

Desktop Bottom Promotion