Latest Updates
-
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.!
గర్భిణీలు సీాఫ్ట్ డ్రింక్స్ తాగడం సురక్షితమేనా
మహిళ జీవితంలో ఒక ప్రెగ్నెన్సీ ఒక అందమైన , సంతోషకరమైన విషయం. మహిళ గర్భం పొందిన వెంటనే , ఆమెకు ఎన్నో ఆంక్షలు పెడుతుంటారు. ముఖ్యంగా ఆమె తీసుకొనే ఆహారం విషయంలో ఆమెంటే ఇష్టపడే వారు, కుటుంబ సభ్యులు, స్నేహితులు , బందువులు ఇలా ఎరికి తోచిన జాగ్రత్తలను వారు అందిస్తుంటారు . ముఖ్యంగా ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలను సూచిస్తుంటారు!
మహిళ గర్భం పొందిన తర్వాత ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడానికి సూచిస్తుంటారు , దాంతో తల్లి ఆరోగ్యకరమైన బరువు పెరగడంతో పాటు, గర్భాధారణ కాలంను సురక్షితంగా ముగించడానికి సహాయపడుతుంది.

గర్భధారణ కాలంలో ఆహారం మీద కోరికలు ఎక్కువగా కలిగి ఉంటుంది. దాంతో ఎక్కువ ఆహారం లేదా అనారోగ్యకరమైన చిరుతిండ్లు మీద మనస్సు పడుతుంది . అది బిడ్డకు మాత్రమే కాదు, కడుపులో పెరిగే తల్లికి కూడా సురక్షితం కాదు..
గర్భధారణ సమయంలో ఎక్కువగా తినడం వల్ల ఓబేసిటికి కారణమవుతుంది. జీర్ణ సమస్యలు, హైబ్లడ్ ప్రెజర్ మొదలగు సమస్యలకు కారణం అవుతుంది. ఇటువంటి హెల్త్ కండీషన్స్ బిడ్డలోను మరియు కొన్ని సందర్భాల్లో తల్లిలోనూ ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది.

అందువల్ల, మహిళ గర్భం పొందిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకుంటుందో గమనిస్తుండాలి. ఆమెహెల్తీ డైట్ ను మాత్రమే తీసుకోవాలి. తల్లికి మరియు బిడ్డకు అవసరమయ్యే న్యూట్రీషియన్స్ ను తీసుకోవడం వల్ల ఇద్దరు సురక్షితంగా ఉంటారు.
గర్భం పొందిన మహిళలు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు. ఇంకా వారికి ఇష్టమైన ఆహారాలు మరియు పానీయాలను అందివ్వడానికి భయపడుతుంటరు. ఏం ఆహారం తింటే ఎలాంటి సమస్య వస్తుందని భయపడతారు. అలాంటి ఆహారాల్లో ఒకటి శీతల పానీయాలు ఒకటి మరియు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ , ఇవి పుట్టబోయే బిడ్డకు హనికలిగిస్తాయి? ఏవిధంగా అంటే ..

శీతల పానియాలు, సోడా, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ పానీయాలు తాగడం వల్ల పుట్టబోయే బిడ్డలు ఊబకాయంతో పుడుతారు.
గర్భిణీలు సాప్ట్ డ్రింక్స్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల ఇతర సాధారణ పిల్లలతో పోల్చితే, బాడీమాస్ ఇండెక్స్ అధికంగా ఉండే పిల్లలకు జన్మనిస్తారు.
గర్భాధారణ సమయంలో రెగ్యులర్ గా శీతల పానియాలు తాగిన వారి పిల్లల్లో సంవత్సరంలో మెటబాలిక్ డిజార్డ్స్ మరియు బరువు తగ్గే సమస్యలు ఉంటాయి . ఇది ఖచ్చితంగా అనారోగ్యకరం మరియు పిల్లఆరోగ్యానికి ప్రమాదకరం . చిన్న వయస్సులో మెటబాలిక్ మరియు వెయిట్ సమస్యలు చాలా ప్రమాదకరం.

అందువల్ల గర్భిణీ మహిళలు శీతల పానియాలకు మరియు ఆర్టిఫిషియల్ డ్రింక్స్ కు దూరంగా ఉండటం మంచిది . వీటిలో షుగర్ కంటెంట్ మరియు క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి తల్లి మరియు బిడ్డ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. .



Click it and Unblock the Notifications