Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
డాక్టర్లు చివరి నిముషంలో సిజేరియన్ ను ఎందుకు సూచిస్తారు
తల్లులు యోని డెలివరీ కావాలని అనుకుంటారు. కానీ వైద్యులు చివరి నిమిషంలో సి సెక్షన్ లోకి వెళ్ళాలని చెప్పుతారు. అయినా నిరాస చెందవలసిన అవసరం లేదు.
శిశువుల తల చాలా పెద్దదిగా ఉన్నప్పుడు మరియు శిశువు పిరుదులు తలక్రిందులుగా ఉన్నప్పుడు మాత్రమే సి సెక్షన్ ని వైద్యులు సిఫార్స్ చేస్తారని నిపుణులు అంటున్నారు. అలాగే తల్లికి మధుమేహం లేదా అధిక రక్తపోటు లేదా గుండె సమస్యల యొక్క వైద్యసంబంధ చరిత్ర కలిగి ఉన్నప్పుడు కూడా సి సెక్షన్ ని సిఫార్స్ చేస్తారు.
సి సెక్షన్ శస్త్రచికిత్స అంటే తల్లి పొత్తికడుపు గర్భాశయం మరియు గోడలో కోత పెట్టడం ద్వారా శస్త్రచికిత్స చేసి బిడ్డను తీస్తారు. దీనిని సాధారణంగా డెలివరీ కోసం ఒక సురక్షితమైన ఎంపికగా భావిస్తారు. యోని పద్దతితో పోలిస్తే దీనిలో కొన్ని సమస్యలు ఉన్నాయి.
మరోవైపు, సి సెక్షన్ శస్త్రచికిత్స తర్వాత మీరు ఇంటికి వేగంగా వచ్చి త్వరగా నయం అయ్యి కోలుకొనే అవకాశం ఉంది. కాబట్టి, గర్భిణీ స్త్రీలు డాక్టర్ మీకు చివరి క్షణంలో సి సెక్షన్ సిఫార్స్ చేస్తే , ఎందుకు సి సెక్షన్ సిఫార్స్ చేసారో తెలుసుకోవటానికి ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి. వీటిని ఒకసారి పరిశీలన చేయండి.

ముందు సి సెక్షన్
మీరు ఒక సి సెక్షన్ ద్వారా గతంలో ఒక శిశువుకు జన్మినిచ్చి ఉంటే, అదే విధానాన్ని వైద్యులు మీకు పుట్టే రెండో డెలివరీకి కూడా అనుసరిస్తారు. ఇది మరిన్ని సమస్యలను నిరోదిస్తుంది.

నొప్పులు రాకపోతే
మీకు డెలివరీ నొప్పులు రాకపోతే, అప్పుడు వైద్యులు సి సెక్షన్ కోసం సిఫార్స్ చేస్తారు.

గర్భస్థ పిండంలో విపత్తులు
డెలివరీ సమయంలో తల్లి తీవ్రమైన నొప్పి లోనవుతుంది.తల్లి మరియు పుట్టబోయే బిడ్డ యొక్క హృదయ స్పందన నియంత్రించబడుతుంది. తల్లి అలసిపోయిన మరియు పిండంనకు విపత్తులు కలుగుతాయని భావించినప్పుడు సి సెక్షన్ కి సిఫార్స్ చేస్తారు.

బొడ్డు త్రాడు స్థానభ్రంశం
కొన్ని సందర్భాలలో బొడ్డు తాడు శిశువు కన్నా ముందుగా యోని నుండి బయటకు వస్తుంది. అప్పుడు పుట్టే శిశువుకు ప్రాణవాయువు అందక ప్రమాదం జరగవచ్చు. అటువంటి పరిస్థితుల్లో సి సెక్షన్ నిర్వహిస్తారు.

గర్భాశయంలో పగిలితే
తల్లి బౌతికంగా ఎన్నో పనులను చేయటం వలన గర్భాశయంలో బీటలు పడవచ్చు. అప్పుడు సి సెక్షన్ ద్వారా శిశువును బయటకు తీస్తారు.

వెనుకభాగం ముందుకు వస్తే
శిశువు పిరుదులు తలక్రిందులుగా ఉన్నప్పుడు మాత్రమే సి సెక్షన్ ని వైద్యులు సిఫార్స్ చేస్తారు. అప్పుడు వైద్యులు సి సెక్షన్ ద్వారా శిశువును ఈ ప్రపంచంలోకి తీసుకువస్తారు.

కొన్ని వ్యాధుల కారణంగా
కొన్నిసార్లు తల్లికి క్రియాశీల జననేంద్రియ సర్పి ఇన్ ఫెక్షన్ లేదా HIV లాంటి ఇన్ ఫెక్షన్స్ ఉండవచ్చు. ఇటువంటి సందర్భాల్లో శిశువు వ్యాధుల బారిన పడకుండా సి సెక్షన్ నిర్వహిస్తారు.



Click it and Unblock the Notifications
