ప్రెగ్నెన్సీ సమయంలో మీకు ఇష్టమైన ఆహారాలపై విరక్తి ఎందుకు

Posted By: Lekhaka
Subscribe to Boldsky

గర్భం దాల్చడమనేది స్త్రీ జన్మకే అతి ముఖ్యమైన వరం. గర్భధారణ గురించి మాట్లాడే ప్రతిసారి మనకు వేవిళ్లు గుర్తుకువస్తాయి. పచ్చి మామిడికాయ, చింతపండు లేదా అటువంటి మిగతా రకాల రుచులను ఆస్వాదించాలనే కోరిక గర్భిణీలకు కలుగుతుంది.

అలాగే కొన్ని రకాల విచిత్రమైన కోరికలు కూడా గర్భిణీలకు కలుగుతాయి. ఐస్ క్రీంస్ తో పచ్చళ్ళు తినాలనుకోవడం అటువంటి విచిత్రమైన కోరికలతో ఒకటి. కొంతమంది గర్భిణీలు మట్టిని తినాలని అలాగే ఇనుముని, ప్లాస్టర్ ని కూడా తినాలని ఆశపడతారు. ఇటువంటి కోరికలు ఆరోగ్యానికి హానీకరమైనవి.

కానీ మీకో విషయం తెలుసా గర్భిణీలను ఆహారమంటే వెగటు పుట్టడం కూడా సహజం. గర్భం దాల్చకముందు వారికి బాగా నచ్చిన ఆహారం గర్భం దాల్చిన తరువాత వారికి వెగటు పుట్టవచ్చు.

ఒకప్పుడు రోజువారి ఆహారంలో భాగంగా చేసుకునే అనేక పదార్థాలు గర్భిణీలకు వెగటు పుట్టవచ్చు. మొదటి త్రైమాసికంలో ఇటువంటి లక్షణాలను గర్భిణీలలో గమనించవచ్చు. అయితే, మహిళలను బట్టి అలాగే ఒక ప్రెగ్నన్సీ కి మరొక ప్రేగ్నన్సీకి కూడా ఈ లక్షణం మారుతుంది.

గర్భం దాల్చిన వెంటనే తనకు ఇష్టమైన ఆహారంపై తనకి అమితమైన విరక్తి ఎందుకు కలుగుతుందో కారణాలు ఇంకా తెలియలేదు. అయితే, మహిళలలో గర్భధారణ తరువాత ఆహార విషయాలలో ఏర్పడే ఇష్టాయిష్టాల గురించి ఎన్నో పరిశోధనలు జరిగినా ఏవీ కూడా స్పష్టమైన నిర్ధారణకు రాలేదు.

ఈ రోజు, ప్రెగ్నన్సీ సమయంలో ఆహారంపై కలిగే విరక్తి గురించి వివిధ థియరీల ద్వారా తెలుసుకుందాం. అలాగే, మీకు గనక ఇటువంటి లక్షణం ఉన్నట్టయితే ఏ విధంగా మీరు ఆ లక్షణాన్ని అధిగమించవచ్చో కూడా కొన్ని సూచనలు ఇష్టము.

Why You Start Disliking Your Favourite Food During Pregnancy?

ఒక మహిళ తాను గర్భం దాల్చిన విషయం తెలుసుకునేలోపే ఈ ఆహార విరక్తి లక్షణాలు ప్రారంభమవుతాయి. మార్నింగ్ సిక్నెస్ తో పాటు ఇవి కూడా గర్భం దాల్చిన విషయాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడే ముఖ్య సూచనలు.

ఆహార విరక్తి లక్షణాలు మీలో ప్రారంభమయినప్పుడే మీరు లాలాజలం సహజమైన దానికంటే ఎక్కువ ఉత్పత్తి అవుతుందన్న విషయాన్ని గమనించే ఉంటారు. ఒక రకమైన మెటాలిక్ టేస్ట్ మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉండడం కూడా గమనించి ఉంటారు. చాలా మంది గర్భిణీలు ఈ టేస్ట్ ని ఒక రకమైన చేదు రుచిగా భావిస్తారు.

గర్భం పెరుగుతున్నకొద్దీ, మీకు కొన్ని రకాల ఆహారపదార్థాలపై ఏవగింపు వస్తుంది. ఇంతకు ముందు మీకు బాగా నచ్చినవి కూడా ఇప్పుడు మీకు నచ్చవు. మార్నింగ్ సిక్నెస్ ప్రారంభమైనప్పటి నుంచీ మీకు ఆయా పదార్థాలు తీసుకున్న ప్రతిసారి మీకు కడుపులో తిప్పడం, వాంతి వస్తున్నట్టు అనిపించడం జరుగుతుంది. కనీసం, ఆ ఆహార పదార్థాలు వాసన కూడా మీకు గిట్టదు.

Why You Start Disliking Your Favourite Food During Pregnancy?

చాలా మంది మహిళలలో ఈ ఆహార విరక్తి లక్షణాలు గర్భం దాల్చిన మొదటి త్రైమాసికంలో కనిపిస్తాయి. కొంత మందిలో ఈ లక్షణాలు మొదటి త్రైమాసికం పూర్తవగానే ఆగిపోతాయి. మరికొంతమందిలో ప్రసవం జరిగే వరకు ఉంటాయి. మరికొంతమందిలో పిల్లలు పుట్టినతరువాత కూడా కొనసాగుతాయి.

ప్రెగ్నన్సీలో ఆహార విరక్తిని కలిగించే ఆహారాలు

ఘాటైన వాసనలు లేదా రుచులు కలిగిన ఆహారపదార్థాలను ఆహార విరక్తి కలిగిన గర్భిణీలు ఎక్కువగా దూరం పెడతారు. అయితే, ఈ నెలలు గడుస్తున్న కొద్దీ ఈ ఆహార విరక్తి ప్రభావం మారవచ్చు కూడా. ఒక దశలో ఒక రకమైన ఆహారపదార్థంపై వెగటు పుట్టినా నెలలు గడిచే కొద్దీ వేరొక ఆహారపదార్థంపై వెగటు పుట్టవచ్చు. లేదా అదే రకమైన ఆహారవిరక్తి ప్రసవమయ్యే వరకూ కొనసాగవచ్చు.

ఆహార విరక్తి ఏయే ఆహారపదార్థాలు కలుగుతుందనే ఖచ్చితమైన నియమం లేదు. అయితే, ఎక్కువ మంది మహిళలు గర్భం దాల్చిన తరువాత ఈ క్రింద చెప్పబడిన ఆహారపదార్థాలపై విరక్తిని ఏర్పరచుకుంటారని తెలుస్తోంది.

1. పాలు అలాగే పాల ఉత్పత్తులు

2. గుడ్లు

3. చేపలు

4. మాంసం

5. పౌల్ట్రీ

6. వెల్లుల్లి

7. స్పైసీ ఆహారపదార్థాలు

8. కాఫీ లేదా టీ

9. గ్రీజీ ఆహారపదార్థాలు

అయితే, విచిత్రంగా వీటినే కొంతమంది గర్భిణీలు తినాలని ఆశపడతారు.

ప్రెగ్నన్సీ దశలో ఆహార విరక్తికి కారణాలు

వీటివల్లే గర్భిణీలలో ఆహార విరక్తి కలుగుతుందని చెప్పటానికి ప్రత్యేకమైన కారణమేదీ లేదు. అయితే, డాక్టర్లు అలాగే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ క్రింది థియరీల వల్ల గర్భం దాల్చడానికి ముందు మీకు బాగా నచ్చిన ఆహారం గర్భం దాల్చిన తరువాత మీకు నచ్చకపోవచ్చని తెలుస్తోంది.

గర్భధారణ సమయంలో ఆహార విరక్తికి సంబంధించి ఈ ప్రముఖ థియరీలో చెప్పబడిన ముఖ్యమైన అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

HCG-హ్యూమన్ కొరియోనిక్ గొనడోట్రోపిన్

HCG-హ్యూమన్ కొరియోనిక్ గొనడోట్రోపిన్

HCG అనే ఈ హార్మోన్ ప్రెగ్నన్సీ సమయంలో కలిగే అనేక మార్పులకు ప్రధాన కారణం. పదకొండు వారాల గర్భం సమయంలో ఈ హార్మోన్ శరీరంలో అధికంగా ఉంటుంది. ఆ తరువాత నుంచి ఈ హార్మోన్ స్థాయి పడిపోతూ ఉంటుంది. పదకొండు వారాల గర్భం సమయంలోనే చాలా మంది గర్భిణీలు ఆహార విరక్తి గురించి ఫిర్యాదు చేస్తూ ఉండడాన్ని కూడా మనం గమనించాలి. అందువల్ల, గర్భిణీలలో ఆహార విరక్తి ఈ హార్మోన్ హెచ్చుతగ్గులే కారణమని ఒక వాదన వినిపిస్తోంది.

మార్నింగ్ సిక్నెస్

మార్నింగ్ సిక్నెస్

మార్కింగ్ సిక్నెస్ తో ఇబ్బందిపడే మహిళలే ఆహార విరక్తిని కలిగి ఉంటారని ఇంకొక వాదన ఉంది. మార్నింగ్ సిక్నెస్ యొక్క మరొక ప్రధానమైన లక్షణమే ఆహార విరక్తి కలగడమని భావిస్తున్నారు. లేదా ఆహార విరక్తి అలాగే మార్నింగ్ సిక్నెస్ కి కూడా ఎదో ఒక సాధారణ కారణం కలిగి ఉంటుందని నమ్ముతున్నారు.

ఘాటైన రుచులు అలాగే వాసనలు

ఘాటైన రుచులు అలాగే వాసనలు

గర్భం దాల్చిన తరువాత గర్భిణీలలో వాసన మరియు రుచి చూసే శక్తి అమాంతం పెరుగుతుంది. అందువల్ల, ఏవైనా ఘాటైన వాసనలు కలిగిన ఆహారపదార్థాలు కనుక వీరు తీసుకుంటే వీరికి వికారం కలుగుతుంది. వాసనను అలాగే రుచిని చూసే శక్తి సాధారణం కాంటే గర్భం దాల్చిన తరువాత కొంచెం ఎక్కువవడం వలన వీరికి ఆహార విరక్తి కలుగుతుండవచ్చని అంటున్నారు.

లాలాజలం

లాలాజలం

కొన్నిరకాల ప్రెగ్నన్సీ హార్మోన్స్ వలన గర్భిణీలలో లాలాజలం అధికంగా ఉత్పత్తి అవుతుంది. అందువలన, గర్భిణీలకు నోటిలో ఒకరకమైన చేదైన మెటాలిక్ టేస్ట్ కలుగుతుంది. ఈ రకమైన చేదైన మెటాలిక్ టేస్ట్ వలన ఆహార పదార్థాలు నోటికి ఇంపుగా ఉండవు. తద్వారా ఆహార విరక్తి కలుగుతుంది. ఈ రకమైన ఇబ్బంది ఉండటం వలన ఆహారాన్ని ఆస్వాదించలేరు.

ఉద్దేశ్యపూర్వక ఆహార విరక్తి

ఉద్దేశ్యపూర్వక ఆహార విరక్తి

మనం మన శరీరం గురించి పరిపూర్ణమైన అవగాహనతో ఉండాలి. మన శరీరం మనకు తరచూ మనకి ఏది మంచిదో కాదో సూచనలు ఇస్తూ ఉంటుంది. గర్భం దాల్చిన తరువాత ఆ విధంగానే రక్షణ యంత్రాంగం వలన ఆహార విరక్తి కలుగుతుందని భావిస్తున్నారు. ఇది ఒక రకంగా గర్భిణీలకు అలాగే గర్భస్థ శిశువుకి ఏవి మంచివో ఏవి హానీకరమైనవో తెలియచేసే రక్షణ వ్యవస్థగా మనం భావించాలి.

ఈ థియరీకి మద్దతు పలికే ఇంకొక అంశం ప్రకారం ఎవరైతే మార్నింగ్ సిక్నెస్ కి అలాగే ఆహార విరక్తికి గురవుతారో వారిలోనే అరుదుగా ప్రీమెచ్యూర్ బర్త్స్, గర్భస్రావాలు అలాగే నిర్జీవ జననాలు కలగడం జరుగుతుంది. మొదటి త్రైమాసికంలోనే ఆహారవిరక్తి ఏర్పడుతుంది. గర్భస్థ శిశువు ఈ సమయంలోనే చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి బిడ్డకి అపాయం జరిగే శాతం ఎక్కువనే అంశాన్ని ఈ థియరీ తెలుపుతోంది.

ఆహార విరక్తి లక్షణాలని ఎలా అధిగమించాలి?

ఆహార విరక్తి లక్షణాలని ఎలా అధిగమించాలి?

ఆహార విరక్తిని అధిగమించడం అంత సులభమేమీ కాదు. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవలసిన అంశం ఏమిటంటే మీకు ఆహార విరక్తి కలిగించే ఆహారాన్ని దూరంగా ఉంచడం వలన ఎటువంటి హానీ జరగదన్న విషయం.

శరీరమందించే సూచనలు గ్రహించండి.

శరీరమందించే సూచనలు గ్రహించండి.

శరీరం ప్రతిసారి మీకు సూచనలు అందిస్తూ ఉంటుందని. మీ శరీరం మీకందించే సూచనలను గ్రహించండి. మీకు ఆహార విరక్తి కలిగే ఆహారానికి దూరంగా ఉండండి. ఒకవేళ మీరు అటువంటి ఆహారాన్ని తీసుకున్న వాంతి రూపంలో బయటకు వస్తుంది. తరువాత మీకు ఇంకొద్దిసేపు వికారం వేధిస్తుంది. అందుకే, మీ శరీరం ఇష్టపడని ఆహారానిన్ని దూరంగా ఉంచండి.

ఆహారవిరక్తిని కలిగించే ఆహారాన్ని మీకు ఇష్టమైన ఆహారంతో భర్తీ చేయండి

ఆహారవిరక్తిని కలిగించే ఆహారాన్ని మీకు ఇష్టమైన ఆహారంతో భర్తీ చేయండి

కొన్నిసార్లు, మీకు ఆహార విరక్తి కలిగించే ఆహారంలో శరీరానికి అత్యవసరమయ్యే పోషకాలు కలిగి ఉండవచ్చు. అటువంటప్పుడు మీరు ఆయా ఆహారాన్ని దూరంగా ఉంచాలని అనుకోకపోవచ్చు. అయితే, అటువంటి పోషకవిలువలు కలిగే మరొక ఆహారపదార్థంతో మీకు విరక్తిని కలిగించే ఆహారాన్ని భర్తీ చేయండి. ఒకవేళ మీరు పాలకూరపై ఆహారవిరక్తిని పెంచుకుంటే మీరు అమరాన్త్ ఆకులు, మునగాకు లేదా మెంతి ఆకులను ఆహారంలో భాగంగా చేసుకోండి.

నచ్చని ఆహారాన్నిమరొక ఆహారంతో కలిపి తినండి

నచ్చని ఆహారాన్నిమరొక ఆహారంతో కలిపి తినండి

ఒక వేళ మీకు ఏదైనా ఆహారపదార్థంపై అయిష్టత ఏర్పడితే ఆ ఆహారపదార్థాన్ని వేరొక దానితో కలిపి తినండి. అలా అయితే, మీకు ఆహార విరక్తిని కలిగించే ఆహారం మీకు కనిపించకుండానే మీ శరీరంలోకి వెళ్లి సరైన పోషకాలను అందిస్తుంది. కొన్ని రకాల కూరగాయలను మీరు తినలేకపోతే వాటిని పండ్లపై స్మూతీస్ గా చేసుకుని తినవచ్చు. వెనిల్లా లేదా యాలకుల వంటి సువాసన పదార్థాలను జత చేయడం ద్వారా మీకు వెగటుని కలిగించే ఆహారం యొక్క వాసనని కప్పి ఉంచవచ్చు.

ఆకలితో ఉండకండి

ఆకలితో ఉండకండి

ఆహార విరక్తి ఏర్పడడం వలన ఆహారాన్ని తీసుకోవడాన్ని మానుకోకూడదు. ఆలా చేస్తే ఆరోగ్యానికి హానికరం. సరైన పోషకవిలువలు శరీరానికి అందకుండా పోతాయి. అందుకే మీ పొట్టని ఖాళీగా ఉంచకుండా ఎదో ఒకటి తింటూనే త్రాగుతూనో ఉండాలి. హెర్బల్ టీలను అలాగే టీలను త్రాగుతూ ఉండాలి. పండ్లను, తృణధాన్యాలను అలాగే ఉప్పు బిస్కట్స్ ని తింటూ ఉండడం మంచిది.

మందులను వాడాలి

మందులను వాడాలి

పైన వివరించబడిన ఏ చిట్కా కూడా మీకు ఉపయోగపడకపోతే మీరు ఆహార విరక్తి కారణంగా ఎటువంటి ఆహారాన్ని సరిగ్గా భుజించలేరు. కాబట్టి, అటువంటి పరిస్థితులలో, మీరు మీ వైద్యునికి మీ పరిస్థితిని వివరించాలి. మీ శరీరం యొక్క పోషకావసరాల బట్టి మీకు కొన్ని సప్లిమెంట్స్ ను వైద్యులు సూచిస్తారు. మీరు ఇప్పటికే ప్రీనాటల్ విటమిన్స్, నియాసిన్ టాబ్లెట్స్, ఐరన్ అలాగే క్యాల్షియం వాటిని వాడుతూ ఉండి ఉండవచ్చు. వీటితో పాటు, అదనంగా మరికొన్ని ముఖ్యమైన సప్లీమెంట్స్ ని వైద్యులు మీకు సూచించవచ్చు.

English summary

Why You Start Disliking Your Favourite Food During Pregnancy?

During pregnancy, some women tend to crave weird combinations of foods like ice creams and pickles. But the case may differ from woman to woman and pregnancy to pregnancy. There are many theories and speculations that try to explain why women develop aversions to food, but none of these can be considered to be conclusive.