For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నెన్సీ కిట్ తో అవసరం లేకుండా గర్భధారణ తెలుసుకునే 6 చిట్కాలు

|

గర్భధారణ, మహిళలు అత్యంత సంతోషంగా ఫీల్ అయ్యే క్షణాలు. దీనికోసం తాము గర్భం ధరించామో లేదో తెలుసుకొనుటకు సమయం కోసం ఎదురు చూడడమో లేక, గర్భధారణ నివృత్తి పరికరాలను వినియోగించడమో చేస్తుంటారు. కాని వీటి అవసరం లేకుండానే ఇంటిలో కొన్ని సహజ పద్దతులు అవలంబించుట ద్వారా గర్భధారణ గురించిన సందేహాలు తొలగించుకోవచ్చు.

సాధారణంగా శాస్త్రీయపద్దతుల ద్వారా డాక్టరు పర్యవేక్షణలో తెలుకోవడమే ఉత్తమ మార్గం కాగా. అశాస్త్రీయ పద్దతులలో కొన్ని ప్రాచీన విధానాలు అవలంబించుట ద్వారా కూడా గర్భధారణ సందేహాలను తొలగించుకోవచ్చు.

1.నిల్వ చేసిన మూత్ర పరీక్ష:

1.నిల్వ చేసిన మూత్ర పరీక్ష:

గర్భధారణ నివృత్తి చేసుకోవాలి అనుకునే వారు, ఏదైనా ఒక చిన్ని పాత్ర, లేదా ప్లాస్టిక్ డబ్బా (VESSEL)లో మూత్రాన్ని సేకరించండి. 3,4 గంటలు పట్టించుకోకుండా ఎక్కడైనా భద్రపరచండి. 3,4 గంటల తర్వాత మూత్రంపై తెల్లని పొర ఏర్పడితే గర్భం దాల్చిన అవకాశాలు ఉన్నట్లే. అలాకాకుండా మూత్రం ఏమార్పూ లేకుండా ఉన్నట్లయితే గర్భధారణ జరగలేదని నిర్ధారించుకోవచ్చు.

2.గోధుమ మరియు బార్లీ టెస్ట్:

2.గోధుమ మరియు బార్లీ టెస్ట్:

ఈ పరీక్షను పురాతన కాలంలో ఈజిఫ్టులో చేసేవారు. ఈ మధ్యకాలంలో చేసిన పరిశోధనల ప్రకారం కూడా డెబ్బై శాతం ఖచ్చితత్వాన్ని ఇచ్చినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక పరీక్ష విషయానికి వస్తే. గోధుమ మరియు బార్లీ విత్తనాలపై గర్భధారణ గావించిన లేక సందేహములో ఉన్న స్త్రీ మూత్ర విసర్జన చెయ్యవలసి ఉంటుంది. కొన్ని రోజుల పరిశీలన తర్వాత గోధుమ గింజలపై మొలకలు వస్తే ఆడ శిశువుగాను, బార్లీ గింజల పై మొలకలు వస్తే మగ శిశువుగాను , ఏ మొలకలూ రాని పక్షంలో గర్భధారణ జరగనట్లు నిర్ధారణకి వచ్చేవారు. కాని ఇలా పరీక్షలు చెయ్యడం మనదేశంలో చట్ట విరుద్దం. పైగా ఇది ఇంకా ప్రయోగ దశలోనే ఉన్న పాతకాలపు నమ్మకం.

3.టూత్పేస్ట్ టెస్ట్:

3.టూత్పేస్ట్ టెస్ట్:

రోజులోని మొదటి మూత్రాన్ని ఒక సీసాలో సేకరించి, ఇందులో కొంత తెల్లటి టూత్పేస్టుని కలపండి. కలిపిన తర్వాతి రంగుకి 3,4 గంటల తర్వాతి రంగుకి మార్పు కనిపించినా, లేక నురగలు వచ్చినా మీరు బహుశా గర్భవతి అయ్యుండొచ్చు.

4.బ్లీచ్ టెస్ట్:

4.బ్లీచ్ టెస్ట్:

రోజులోని మొదటి మూత్రాన్ని సీసాలో సేకరించి, అందులో కొంచం బ్లీచింగ్ పౌడర్ ని కలపండి. మూత్రంలో నురగలు వచ్చినా, లేక సోడా లాగా బుడగలు వచ్చినా మీరు గర్భవతి అయ్యే సూచనలు ఉన్నాయని అర్ధం. ఒక వేళ బ్లీచింగ్ పౌడర్ అందుబాటులో లేని ఎడల , కేంద్రీకృత సబ్బుని ఉపయోగించవచ్చు.

5. ఆవాల పొడి పరీక్ష:

5. ఆవాల పొడి పరీక్ష:

ఆవపిండి పొడి బహిష్టుని ప్రేరేపించే లక్షణం కలది. ఒకవేళ పీరియడ్ సమయానికి రాని పక్షంలో ఆవపిండి రెండు కప్పుల పొడిని గోరువెచ్చని నీళ్ళలో వేసి స్నానం చెయ్యండి. మరుసటి రోజే పీరియడ్ వస్తే మీరు అనుకున్నది తప్పు. ఇదే పరీక్ష రెండు వారాల తర్వాత చేసినా పీరియడ్ రాకపోతే మీరు బహుశా గర్భవతి అయ్యుండొచ్చు.

6. లక్షణం కోసం ఎదురుచూడండి:

6. లక్షణం కోసం ఎదురుచూడండి:

గర్భం ప్రారంభదశలలో జననేంద్రియాల వద్ద రక్తప్రవాహం వలన ఊదా లేదా ఎరుపు రంగులోకి మారే అవకాశాలు ఉంటాయి. ఈ లక్షణం ఆహారంపై కోరికలు కలగడానికి మరియు వికారపు లక్షణాలకు ముందే ఉంటాయి. ఈలక్షణాలను మొదటిసారిగా ఫ్రెంచ్ వైద్యుడు ఒకరు 1836లో గమనించారు. 1886 లో జేమ్స్ రీడ్ చాడ్విక్ అనే వైద్యుడు ఈ విషయాన్ని అమెరికన్ గైనకాలజీ సొసైటీ దృష్టికి తీసుకుని వచ్చారు. దీనిని ఇప్పుడు చాడ్విక్ సైన్ గా పిలుస్తున్నారు.

గర్భధారణ నివృత్తికి నిజానికి శాస్త్రీయ పద్ధతులనే అనుసరించాలి. ఇవన్నీ పాతకాలపు కథల కిందే పరిగణించాల్సి ఉంటుంది. ఒక ఆటగా మానసిక సంతృప్తికోసం చేసేవే కాని శాస్త్రీయం కావు. మరియు ఇందులో ఏవి కూడా ప్రమాదకరమైనవి కావు . కొంత మూత్రాన్ని వినియోగించడమే మీరు చెయ్యాల్సిందల్లా.

English summary

6 Simple Ways To Confirm Pregnancy Without A Kit

6 Simple Ways To Confirm Pregnancy Without A Kit,While a scientific pregnancy test is the best way to confirm pregnancy, there are a number of historical, non-medical ways that were used before these miraculous devices were invented.
Story first published:Thursday, March 8, 2018, 17:47 [IST]
Desktop Bottom Promotion