సమయానికి ముందే వచ్చే పురిటి గురించి ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిన 8 కారణాలు

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

తల్లులయ్యే అదృష్టం కేవలం స్త్రీలకే ప్రసాదించబడ్డ వరం. చాలామటుకు చాలామంది స్త్రీలు తల్లి కాబోయే దశ కోసం చాలా వెయిట్ చేస్తారు. కేవలం ఒక స్త్రీ మాత్రమే తనలోపల మరో జీవికి జన్మనివ్వగలిగే శక్తి కలిగి ఉంటుంది. కానీ ఈ వరం అనేక రిస్క్ లు, బాధలతో కూడి వుంటుంది. కొన్నిసార్లు, అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, సమయానికి ముందే అంటే 37 వారాల గర్భసమయం కన్నా ముందే నెప్పులు వచ్చి పురుడు మొదలైపోతుంది. సమయానికి ముందే పుట్టిన బేబీలకి పురిటి సమయంలో తీవ్ర ఆరోగ్య సమస్యలు లేదా తదుపరి జీవితంలో కూడా వస్తాయి.

మీకు పెల్విక్ ప్రెజర్ ఉన్నప్పుడు, నెలసరి సమయంలో వచ్చేటువంటి కండరాల నెప్పులు, యోని నుంచి రక్తం లేదా నీరు డిశ్చార్జి జరిగినప్పుడు, కింది నడుము భాగంలో అసాధారణ నెప్పి కలిగినప్పుడు సమయానికంటే పురుడు ముందే వస్తుంది.

1. మొదటి గర్భంలో అబార్షన్ లేదా గర్భస్రావ కేసులు

1. మొదటి గర్భంలో అబార్షన్ లేదా గర్భస్రావ కేసులు

మీకు ఇంతకుముందొక సారి సమయానికి ముందే పురుడు వచ్చినట్లయితే, మళ్ళీ రెండోసారి అలా జరిగే అవకాశం ఉంది. అటువంటి కేసులో, డాక్టర్ సూచించే అన్ని విషయాలను తప్పక పాటించి, మీ మరియు మీ బిడ్డ సురక్షితంగా ఉండేలా చూసుకోండి. రెండవ గర్భం ముందు కూడా గర్భస్రావం జరగటం మళ్ళీ సమయానికి ముందే పురుడు వచ్చే అవకాశాలను పెంచుతుంది. రెండవసారి గర్భం దాల్చే ముందు కనీసం ఏడాది సమయమైనా తగినంత విశ్రాంతి తీసుకోండి. ఇంతకుముందు కడుపుతో ఉన్నప్పుడు గర్భస్రావం జరిగినప్పుడు వచ్చేసారి కూడా సమయానికి ముందే ప్రసవం జరగవచ్చు. మీ వైద్యునితో సంప్రదించి అన్ని అనారోగ్యాలను దూరంగా ఉంచే విధంగా ప్లాన్ చేసుకోండి మరియు గర్భసమయం మొత్తం మంచి పోషకాహారం తీసుకోండి.

2.చిన్నవయస్సులో లేదా లేటు వయస్సులో గర్భం దాల్చటం

2.చిన్నవయస్సులో లేదా లేటు వయస్సులో గర్భం దాల్చటం

చిన్నవయస్సు లేదా లేటు వయస్సులో గర్భం దాల్చటం వలన సమయానికి ముందే ప్రెగ్నెన్సీ రావచ్చు. 14-19 ఏళ్ళ మధ్యలో లేదా 35-40 ఏళ్ల మధ్యలో గర్భం దాల్చటం వలన సమయానికి ముందే పురుడు వచ్చేస్తుంది. నిజానికి లేటు వయస్సులో గర్భం దాల్చేవారికి డయాబెటిస్ మరియు అధిక రక్తపోటు వంటి సమస్యలు రావచ్చు, ఇవి ప్రెగ్నెన్సీలో అస్సలు సురక్షితం కాదు. అలాగే, 14-19 ఏళ్ళ మధ్యలో శరీరానికి పిండాన్ని మోసే శక్తి అంతగా అభివృద్ధి చెందదు.

3.ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే డిజార్డర్స్

3.ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే డిజార్డర్స్

కొన్ని వ్యాధులైన ప్రీక్లామ్సియా, హెచ్ ఇఎల్ ఎల్ పి సిండ్రోం, జననాంగాల ఇన్ఫెక్షన్లు మరియు మూత్రాశయ, గర్భాశయ సమస్యలు కూడా సమయానికి ముందే పురుడును కలిగిస్తాయి. తల్లిలో అధిక రక్తపోటు ఉండటమో లేదా మూత్రంలో అధిక ప్రొటీన్ ఉండటం వలనో వచ్చే స్థితిని ప్రీక్లాంప్సియా అంటారు.

హెచ్ ఇ ఎల్ ఎల్ పి సిండ్రోం స్థితిలో తల్లిలో ఎర్ర రక్తకణాలు విఛ్చిన్నం అయిపోతాయి లేదా కాలేయ పనితీరు హఠాత్తుగా పెరిగిపోవటం మరియు ఎంజైములు పెరగటం మరియు ప్లేట్ లెట్ల కౌంట్ పడిపోవటం ఇవన్నీ జరుగుతాయి. దీనివలన రక్తం గడ్డకట్టే అవకాశం ఎక్కువ అవుతుంది.

4. మొదటిసారి కవలలు, ముగ్గురు లేదా నలుగురు ఒకేసారి పుట్టడం

4. మొదటిసారి కవలలు, ముగ్గురు లేదా నలుగురు ఒకేసారి పుట్టడం

చాలామంది జంటలు కవలలు, ముగ్గురు లేదా నలుగురు ఒకేసారి పుట్టడంతో చాలా ఆనందంలో మునిగిపోతారు. కానీ అలాంటి కేసుల్లో కూడా సమయానికి ముందే ప్రసవం జరగవచ్చు. కడుపులో ఒకరు కన్నా ఎక్కువ ఉంటే గర్భసమయం తగ్గుతూ ఉంటుంది. అలాంటి స్థితిలో డాక్టర్ దగ్గర క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ మీరు, మీ పాపాయిలు సురక్షితంగా ఉండేలా చూసుకోండి.

5.వెనువెంటనే గర్భం దాల్చటం

5.వెనువెంటనే గర్భం దాల్చటం

జంటలు ఎప్పుడూ వెనువెంటనే ప్రెగ్నెన్సీ తెచ్చుకోకూడదు. ఇది కూడా సమయానికి ముందే డెలివరీ అవ్వటానికి కారణమవుతుంది. ప్రతి డెలివరీ తర్వాత తల్లి ఆరోగ్యం బలహీనపడుతుంది, మళ్ళీ మామూలు మనిషి అవటానికి చాలా విశ్రాంతి, పోషకాహారం అవసరమవుతాయి. వెనువెంటనే గర్భం దాల్చటం వలన విశ్రాంతికి సమయం సరిపోక బిడ్డ జీవితం రిస్క్ లో పడుతుంది. గ్యాప్ ఇవ్వకుంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి మరియు అవసరమైన పోషకాలు లేక తల్లీబిడ్డ ఇద్దరికీ చాలా కష్టమవుతుంది. అందుకని మీరే ఆరోగ్యంగా లేనప్పుడు మీ బేబీ ఎలా ఆరోగ్యంగా ఎదగగలడు? అందుకని మళ్ళీ గర్భం దాల్చడానికి కనీసం 18నెలలు ఆగండి.

6. ఎక్కువ మానసిక వత్తిడి

6. ఎక్కువ మానసిక వత్తిడి

ఈ వేగవంతమైన ప్రపంచంలో చాలామంది తప్పించుకోలేనిది మానసిక వత్తిడి. కడుపుతో ఉన్నప్పుడు మాత్రం ఒత్తిడి అస్సలు మంచిది కాదు. తను అనుకున్నలాగానే జరుగుతున్నా లేదా ఒక స్త్రీ గర్భంతో ఉన్న సమయమంతా ఏదో ఒకరకమైన మానసిక వత్తిడిని తప్పక అనుభవిస్తుంది, అందుకని సమయానికి ముందే ప్రసవం వచ్చే అవకాశాలు కూడా అలానే ఉంటాయి.

7. మీ వంశంలో ఇంతకుముందు సమయానికి ముందే ప్రసవం జరగటం

7. మీ వంశంలో ఇంతకుముందు సమయానికి ముందే ప్రసవం జరగటం

కుటుంబంలో ఇంతకు ముందే సమయానికి ముందు ప్రసవం జరిగిన ఉదాహరణలు ఉన్నట్లయితే, మీకు కూడా అలానే సమయానికి ముందే డెలివరీ జరగవచ్చు. మీరు కూడా ఒకవేళ సమయానికి ముందే పుడితే, మీ బిడ్డ కూడా అలానే జన్మించే అవకాశం ఉంది. కుటుంబ చరిత్ర మరియు జన్యువులు మీ రాబోయే తరం సమయానికి ముందే డెలివరీ ప్రభావాలు ఎంత ఎదుర్కొంటాయో నిర్ణయిస్తాయి.

8.కడుపుతో ఉన్న సమయంలో లేదా ముందు పొగతాగటం మరియు మద్యం సేవించటం

8.కడుపుతో ఉన్న సమయంలో లేదా ముందు పొగతాగటం మరియు మద్యం సేవించటం

క్రమం తప్పకుండా పొగతాగటం లేదా మద్యం సేవించే స్త్రీకి సమయానికి ముందే డెలివరీ తప్పక అయ్యే అవకాశాలు ఉంటాయి. కడుపుతో ఉన్నప్పుడు లేదా ముందు పొగతాగటం లేదా మద్యపానం వలన ప్రెగ్నెన్సీ సమయంలో ఆ స్త్రీకి చాలా సమస్యలు వస్తాయి. గర్భ సమయంలో కూడా పూర్తిగా పొగతాగటం, ఆల్కహాల్ మానేయాలి లేకపోతే బిడ్డ యొక్క తక్కువ బరువు, గర్భాశయ సమస్యలు మరియు మరణం కూడా రావచ్చు. ఇవి కడుపుతో ఉన్న సమయాన్ని మొత్తం ఎక్కువ రిస్క్ లో పెట్టేస్తాయి. మీరు మొదటి నెలల గర్భవతిగా ఉన్నా లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నా ఈ సమయానికి ముందే వచ్చే పురుడు కారణాల గురించి అవగాహన ఉండటం మంచిది.

English summary

Causes Of Preterm Labour That Every Women Should Know

Causes Of Preterm Labour That Every Women Should Know,