For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నన్సీకి సంబంధించిన మొట్టమొదటి లక్షణాలు

ప్రెగ్నన్సీకి సంబంధించిన మొట్టమొదటి లక్షణాలు

|

మరో ప్రాణికి జీవం పొసే వరం మహిళలకి మాత్రమే సొంతం. భారతీయులు ఈ విషయాన్ని వరంగా భావిస్తారు. పాపాయికి జన్మనివ్వడానికి ముందు దంపతులు ఎన్నో విధాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

లైఫ్ స్టయిల్ లో మార్పులు, డైట్ రెస్ట్రిక్షన్స్ తో పాటు ఆల్కహాల్ ను అలాగే స్మోకింగ్ ను పూర్తిగా విడిచిపెడతారు. అడ్వాన్స్ గా జాగ్రత్తలు ఎన్నో తీసుకున్నప్పటికీ ప్రెగ్నన్సీకి సంబంధించిన మొట్టమొదటి లక్షణాలను గమనించడంలో మాత్రం విఫలమవుతారు. వీటి గురించి వారికి అవగాహన లేకపోవటం ఒక కారణం కావచ్చు. ఈ లక్షణాలు గర్భిణీలలోనే కాకుండా మాములు మహిళల్లో కూడా కనిపిస్తూ ఉండటం వలన ఈ లక్షణాలు ఇగ్నోర్ చేయబడతాయి.

First Signs And Symptoms Of Pregnancy

ప్రెగ్నన్సీకి సంబంధించిన మొట్టమొదటి లక్షణాలు

ప్రెగ్నన్సీ టెస్ట్ కిట్స్ తో పాటు గర్భం దాల్చడం గురించి వివరాలు అందించే మెడిసినల్ సైన్స్ అందుబాటులోకి రాకముందే ఈ లక్షణాలతో గర్భం దాల్చిన విషయంపై కొంతవరకు నిర్ధారణకు రావచ్చు. కాబట్టి, వీటి గురించి తెలుసుకోవడం ముఖ్యమే. అయినా, ప్రెగ్నన్సీ టెస్ట్ తోనే మీరు నిర్ధారణకు రావడం ముఖ్యం. ఎర్లీ ప్రెగ్నెన్సీకి సంబంధించిన ముఖ్య లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

స్పాటింగ్ మరియు క్రామ్పింగ్:

స్పాటింగ్ మరియు క్రామ్పింగ్:

ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఎర్లియెస్ట్ లక్షణంగా స్పాటింగ్ ను పరిగణించవచ్చు. పీరియడ్ మిస్ అవడానికి ముందే స్పాటింగ్ జరుగుతుంది. కాబట్టి, దీనిని రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ గా భావించి పొరపాటుపడతారు. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ ని స్పాటింగ్ అనంటారు.

యుటెరస్ గోడలకు ఫెర్టిలైజ్డ్ ఎగ్ అనేది దానంతటదే అతుక్కున్నప్పుడు బ్లీడింగ్ ఏర్పడుతుంది. ఇది కేవలం మూడురోజులపాటే ఉంటుంది. స్పాటీగా ఉంటుంది. ఈ సమయంలో కొంతమంది మహిళల్లో అబ్డోమినల్ క్రామ్పింగ్ సమస్య తలెత్తుతుంది. ఇది మెన్స్ట్రువల్ క్రామ్ప్స్ ని పోలి ఉంటుంది. దీనిని గుర్తించడం కష్టం.

అలసట:

అలసట:

అసాధారణ అలసట కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీకి చెందిన లక్షణమే. ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ దీనికి కారణం. ఇది పీక్ స్టేజ్ కి వెళ్ళినప్పుడు నిద్రవస్తుంది. లో బ్లడ్ షుగర్ లెవెల్స్ తో పాటు లో బ్లడ్ ప్రెషర్ వలన అలసట అనేది మరింత పెరుగుతుంది.

మార్నింగ్ సిక్నెస్:

మార్నింగ్ సిక్నెస్:

ప్రెగ్నన్సీకి సంబంధించిన ముఖ్య లక్షణమిది. వికారం మరియు వాంతులతో ఈ లక్షణం అనుసంధానమై ఉంటుంది. రోజులో ఏ సమయంలోనైనా ఈ లక్షణాన్ని గుర్తించవచ్చు. దీనికి సంబంధించిన కారణాన్ని వైద్యులు ఇంకా అన్వేషిస్తూ ఉన్నారు. హార్మోన్ల పనితీరుపై అనుమానపడుతున్నారు.

ప్రెగ్నన్సీలోని ఐదవ వారంలో మార్నింగ్ సిక్నెస్ సమస్య తలెత్తుతుంది. ఇది పన్నెండవ వారం వరకు కొనసాగుతుంది.

పీరియడ్ మిస్ అవడం:

పీరియడ్ మిస్ అవడం:

ఇర్రేగులర్ మెన్స్ట్రువల్ సైకిల్ కలిగిన వారిలో మిస్డ్ పీరియడ్ అనే సమస్య సహజమే కావచ్చు. అయితే, ఇమీడియేట్ హోమ్ టెస్ట్ ద్వారా ప్రెగ్నెన్సీని చెక్ చేయవచ్చు. గర్భధారణ తరువాత నాలుగవ వారంలో పీరియడ్ ని మిస్ అవడం జరుగుతుంది. హెచ్ సీజీ హార్మోన్ లెవెల్ పెరిగి క్రమంగా ఓవరీస్ నుంచి మెచ్యూర్ ఎగ్స్ విడుదలను ఆపుతుంది.

బ్రెస్ట్ లో మార్పులు:

బ్రెస్ట్ లో మార్పులు:

బ్రెస్ట్ లో మార్పులు ఏర్పడతాయి. ప్రెగ్నన్సీ నాలుగవ వారం నుంచి ఆరవ వారం వరకు బ్రెస్ట్ లో నొప్పిని అలాగే వాపును గమనించవచ్చు. హార్మోన్లలో మార్పుల వలన ఇలా జరుగుతుంది. ఆ తరువాత బ్రెస్ట్ సైజ్ కూడా పెరుగుతుంది. చనుమొనల వ్యాసం పెరుగుతుంది. ఇవి డార్కర్ గా మారతాయి. కొంతమంది లో టింగ్లింగ్ సెన్సేషన్ కలుగుతుంది.

ఆహారాలపై విరక్తితో పాటు వాసనల పట్ల సెన్సిటివిటీ:

ఆహారాలపై విరక్తితో పాటు వాసనల పట్ల సెన్సిటివిటీ:

ప్రెగ్నన్సీ లోని మొదటి ట్రైమ్స్టర్ లో ఫుడ్ పై విరక్తి పొందడం సహజం. ఆహారం నుంచి వచ్చే వాసనల వలన ఈ సమస్య తలెత్తుతుంది. ఈ సమయంలో ఘ్రాణ శక్తి పెరుగుతుంది. అందుకే వాసనలపై విరక్తి వస్తుంది. దీని వలన వికారంతో పాటు వాంతుల సమస్య ఎదురవుతుంది.

మూత్రానికి తరచూ వెళ్ళవలసి రావడంతో పాటు మూత్రాన్ని ఆపుకోలేకపోవటం

మూత్రానికి తరచూ వెళ్ళవలసి రావడంతో పాటు మూత్రాన్ని ఆపుకోలేకపోవటం

గర్భం దాల్చినప్పటి నుంచి శరీరంలోని బ్లడ్ క్వాన్టిటీ పెరగుతుంది. దీని వలన కిడ్నీలపై సాధారణం కంటే ఎక్కువ భారం పడుతుంది. బ్లాడర్ లోని ఫ్లూయిడ్ పెరుగుతుంది. బాత్రూం ట్రిప్స్ ఫ్రీక్వెంట్ అవుతాయి. కొన్నిసార్లు యాక్సిడెంటల్ లీకింగ్ కూడా జరగవచ్చు.

మలబద్దకం:

మలబద్దకం:

హార్మోన్ల మార్పుల వలన ప్రెగ్నన్సీ సమయంలో డైజెస్టివ్ సిస్టమ్ అనేది మందగిస్తుంది. ఈ సమస్య మలబద్దకానికి దారితీస్తుంది. కొన్నిసార్లు, మలబద్దకం వలన కడుపుబ్బరాన్ని కూడా ఎక్స్పీరియెన్స్ చేసే అవకాశం ఉంది.

ప్రెగ్నన్సీకి సంబంధించిన ఇతర ముఖ్య లక్షణాలు:

ప్రెగ్నన్సీకి సంబంధించిన ఇతర ముఖ్య లక్షణాలు:

పైన చెప్పబడిన లక్షణాలతో పాటు, మరికొన్ని సాధారణ లక్షణాలు కూడా ప్రెగ్నెన్సీని సూచిస్తాయి. తలనొప్పి, బ్యాక్ పెయిన్, తలతిరగడంతో పాటు మూడ్ స్వింగ్స్ అనేవి అటువంటి కొన్ని లక్షణాలు. మూడ్ స్వింగ్స్, లో బ్లడ్ ప్రెషర్ కి హార్మోన్స్ అనేవి ముఖ్యపాత్ర పోషిస్తాయి. లో బ్లడ్ షుగర్ వలన డిజ్జీనస్ సమస్య తలెత్తుతుంది.

ఈ లక్షణాలు మీ ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేస్తాయా?

దురదృష్టవశాత్తు, కేవలం ఈ లక్షణాల పై ఆధారపడి ప్రెగ్నన్సీని కన్ఫర్మ్ చేయలేము. ఇంటివద్ద ప్రెగ్నెన్సీ టెస్ట్ ద్వారా ప్రెగ్నెన్సీని నిర్థారించుకోవచ్చు. లేదా క్లినిక్ లో నిర్థారించుకోవచ్చు. ఈ లక్షణాలు అస్వస్థతకు గురైన మహిళల్లో కూడా కనిపిస్తాయి. అలాగే, మెన్స్ట్రువల్ సైకిల్ ప్రారంభానికి ముందు కూడా కనిపిస్తాయి. కాబట్టి, మీ ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేయడానికి వీటిపై మాత్రమే ఆధారపడటం జరగకూడదు.

English summary

First Signs And Symptoms Of Pregnancy

They include making lifestyle changes like diet restrictions and completely avoiding alcohol and smoking. In spite of preparing so much in advance, couples sometimes fail to notice the first signs of pregnancy, probably because they are not aware of it. It is better to say that these symptoms are kind of brushed off, as they happen to a woman otherwise too.
Story first published:Tuesday, April 24, 2018, 8:40 [IST]
Desktop Bottom Promotion