For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భాశయంలో బేబీ బరువు పెంచటానికి సాయపడే ఆహారపదార్థాలు

ఆరోగ్యవంతమైన బిడ్డకి జన్మనివ్వాలనుకునే ప్రతి స్త్రీ చాలావరకు దాని మరోపేరు బేబీ అధికబరువుతో పెద్ద పొట్ట అని భావిస్తుంది. అందుకని బేబీ బరువు పరిశీలించదగ్గ ముఖ్య విషయమే. సగటు 2.75(ఆరోగ్యకరమైన బరువు) కిలో

|

ఆరోగ్యవంతమైన బిడ్డకి జన్మనివ్వాలనుకునే ప్రతి స్త్రీ చాలావరకు దాని మరోపేరు బేబీ అధికబరువుతో పెద్ద పొట్ట అని భావిస్తుంది. అందుకని బేబీ బరువు పరిశీలించదగ్గ ముఖ్య విషయమే. సగటు 2.75(ఆరోగ్యకరమైన బరువు) కిలోల బరువుతో చాలా మటుకు పిల్లలు పుట్టినా, ఈ అంకె కన్నా తక్కువ వెళ్తే ఎవరూ భరించలేరు, వైద్యుల బృందాలు కూడా. మారుతున్న జీవనవిధానాలతో బేబీ తక్కువ బరువుతో పుట్టటం ఇప్పుడు సాధారణంగా కన్పిస్తోంది.

చాలా కొన్ని అధ్యయనాలు మాత్రమే పిండం యొక్క బరువు ఆహారం సరిగా తీసుకోవడం వల్ల పెంచవచ్చని చెబుతున్నాయి. కానీ ఇదేమీ అసాధ్యం కాదు. సరైన ఆధారాలు లేకపోయినా, వైద్యులు తక్కువ పిండం బరువున్న తల్లులకి వారి ఆహారంలో మార్పులు చేసుకుంటే అంతా బాగవుతుందని సలహా ఇస్తారు. 'ఇద్దరికి సరిపడా తినడం' కన్నా సరైన పరిమాణంలో పోషకాలను తీసుకోవటం నిజానికి ముఖ్యం. అదేంటో లోతుగా తెలుసుకుందాం.

foods that increase weight of baby in the womb

పిండం యొక్క బరువును ఎలా కొలుస్తారు?

పుట్టబోయే బిడ్డ బరువును అల్ట్రాసౌండ్ స్కాన్ సమయంలో కొలుస్తారు. ఈ స్కాన్ ను గర్బవతిగా ఉన్న సమయంలో బిడ్డ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోడానికి వేర్వేరు సమయాల్లో మొత్తం 3-4 సార్లు చేస్తారు. ఈ యంత్రం పిండం పరిమాణాన్ని తెలుపుతుంది. అది ఎలా కొలుస్తుందంటే ;

బైపారిటల్ వ్యాసం

ఫెమర్ పొడవు

తల వృత్తపరిధి

ఒసిపిటోఫ్రంటల్ వ్యాసం

పొట్ట వృత్తపరిధి

హ్యుమరస్ పొడవు

ఈ పై సంఖ్యలతో, పిండం యొక్క బరువును తెలుసుకోడానికి ఒక ఫార్ములా సూత్రం తయారుచేయబడింది. బరువును సరిగ్గా కొలిచే రెండు ముఖ్యమైన మానాలు బైపెరైటల్ వ్యాసం మరియు పొట్ట వృత్తపరిధి. ఈ లెక్క ఎప్పుడూ పూర్తిగా సరిగా ఉండదు మరియు తేడా సాధారణంగా +/-10 శాతంగా ఉంటుంది.

తక్కువ పిండ బరువుకి కారణాలు

తక్కువ పిండ బరువు కలిగిన బేబీని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. దీనికి కారణాలు ఇవి అయ్యి ఉండవచ్చు ;

బరువు తక్కువున్న తల్లి

పోషకాహారలోపం

ఐయుజిఆర్ (ఇంట్రా యుటరైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్) (గర్భాశయం లోపల పెరుగుదల కుదరకపోవటం)

ఎస్ జిఎ (గర్భధారణకి వయస్సు తగినంత లేకపోవటం)

జన్యుపర కారణాలు

తల్లి వయస్సు

ఇంతకు ముందే ఉన్న ఆరోగ్య స్థితులు

భారత బేబీలలో సూచించిన బరువు పెరుగుదల

అధ్యయనాల ప్రకారం, భారతదేశంలో పిండాల బరువు ఈ ప్రకారం పెరుగుతుందిః

10వ వారం 4గ్రాములు

15వ వారం 70గ్రాములు

20వ వారం 300 గ్రాములు

25వ వారం 660 గ్రాములు

30వ వారం 1.3కిలోలు

35 వ వారం 2.4కిలోలు

36వ వారం 2.6కిలోలు

37వ వారం 2.9కిలోలు

38వ వారం 3.1 కిలోలు

39వ వారం 3.3కిలోలు

40వ వారం 3.5కిలోలు

బేబీ బరువుపై ఒక కన్నేసి ఉంచటానికి దిశానిర్దేశం చేయటానికి ఒకే ఛార్ట్ అందుబాటులో ఉంది. బిడ్డ బరువుకి, బిడ్డ ఆరోగ్యానికి ఏమాత్రం సంబంధం లేదు. బరువు తక్కువున్న బేబీలు, బరువు ఎక్కువ వున్న బేబీలు చాలామందికన్నా ఆరోగ్యంగా ఉన్నవారు ఉన్నారు. అలాగే రివర్సులో కూడా. ఎంతైనా, ప్రతి బిడ్డ వేరు మరియు ప్రత్యేకం కదా. కానీ పిండం బరువు తగ్గటం పోషకాహారలోపం వల్లనైతే మాత్రం మీరు మీ ఆహారంలో తప్పక మార్పులు చేసుకోవాల్సిందే.

గమనిక ; ప్రొటీన్ ఎక్కువ ఉండే ఆహారపదార్థాలు తీసుకోవటం మంచిది. అనారోగ్యకరమైన కొవ్వు మరియు కార్బొహైడ్రేట్లు కాదు. కడుపుతో ఉన్నవారికి రోజుకి 80గ్రాముల ప్రొటీన్ అవసరం. కానీ కొందరు వైద్యనిపుణుల ప్రకారం ఈ పరిమాణం చాలా ఎక్కువని అందుకే అవసరమైన దానికంటే పెద్ద సైజు పాపాయిలు పుడతారని వాదిస్తారు.

అందుకని కడుపుతో ఉన్నవారు సమతుల్య ఆహారం మరియు కింద సూచించిన ఆహారపదార్థాలు ఎక్కువ తీసుకోవడం వలన పిండం సరిపడినంత బరువుతో ఉంటుంది.

గుడ్లు

గుడ్లు

ఇతర ఆహారాలలో ప్రొటీన్లతో పోలిస్తే గుడ్లలోని ప్రొటీన్ నాణ్యత చాలా అధికం. అదేకాక, వాటిల్లో ఫోలిక్ యాసిడ్, కోలిన్, ఐరన్ కూడా ఉంటాయి. గుడ్డులోని చాలామటుకు ప్రొటీన్ దాన్ని పెంకు తీయకుండా ఉడికించి తీసుకున్నప్పుడు శరీరం పీల్చుకోగలదు. రోజుకి ఒక పెంకు తీయకుండా ఉడికించిన గుడ్డు తినటం కడుపుతో ఉన్నవారికి మంచిది.

డ్రై ఫ్రూట్లు మరియు నట్’స్

డ్రై ఫ్రూట్లు మరియు నట్’స్

బేబీ యొక్క ఆరోగ్యకరమైన బరువు సరిగ్గా డ్రై ఫ్రూట్లు, నట్'స్ తీసుకున్నప్పుడే సాధ్యపడుతుంది. అనేకమంది వైద్యులు కూడా బిడ్డ బరువు సమస్యలున్న గర్భిణీ స్త్రీలకి నట్'స్ తినమనే సలహా ఇస్తున్నారు. వీటిల్లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది కానీ కొవ్వు కాదు. నట్ ‘స్ అంటే బాదం పప్పు, వేరుశెనగ, పిస్తా,వాల్ నట్'స్ వంటివి. మంచి డ్రై ఫ్రూట్లంటే ఖర్జూరాలు, ఎండపెట్టిన ఆప్రికాట్లు, నల్ల కిస్మిస్ లు, ఫిగ్స్ వంటివి. చేతిలో పట్టినన్ని ప్రతిరోజూ సాయంత్రం స్నాక్ గా తినండి.

పాలు

పాలు

కడుపుతో ఉన్నవారికి రోజుకి 2 గ్లాసుల పాలు తప్పనిసరి. అది రోజుకి 4 గ్లాసులు కూడా చేసుకోవచ్చు. ప్రొటీన్ కి దీనికన్నా మంచి ఆహారపదార్థం లేదు మరియు ఒక అధ్యయనం ప్రకారం రోజుకి 200-500మిలీ ల పాలు తాగటం వలన పిండం బరువుపై సానుకూల ప్రభావం పడింది. పాల యొక్క లాభాలు చాలావరకు పొందాలంటే అందులో ఏమీ కలపకుండా తాగితేనే ఉత్తమం. దాన్ని జావలలో, స్మూతీలలో కలుపుకోవచ్చు.

పెరుగు

పెరుగు

పెరుగు తినటం వలన బేబీలలో తక్కువ బరువు సమస్య రిస్క్ ను నివారించవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రొటీన్లు అధికంగా ఉండేదే కాక, పెరుగులో పాలలోకన్నా ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఇందులో విటమిన్ బి కాంప్లెక్స్, జింక్ కూడా ఉంటాయి. కడుపుతో ఉన్నవారు పెరుగును రోజుకి మూడుసార్లు తీసుకోవటం మంచిది.

పచ్చని ఆకుకూరలు

పచ్చని ఆకుకూరలు

వారానికి కనీసం మూడుసార్లు ఆకుకూరలు తీసుకోవడం వలన మంచి పరిమాణంలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలేట్,ఐరన్ మరియు మెగ్నీషియం లభిస్తాయి. బ్రొకోలీ కూడా ఈ విభాగంలోకే వస్తుంది. విటమిన్ ఎ కంటిచూపుకి చాలా ముఖ్యం మరియు బేబీ యొక్క చర్మం, ఎముకల ఎదుగుదలలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.ఇదే బిడ్డ బరువును కూడా పెంచుతుంది.

సన్నని మాంసం

సన్నని మాంసం

సన్నని మాంసంలో అధిక ప్రొటీన్లు ఉండి బిడ్డ కణజాలం, కండరాల ఎదుగుదలకి చాలా ముఖ్యమవుతుంది. అందులో ఉండే ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్ బిడ్డలో మెదడు ఎదుగుదలకి సాయపడతాయి. వారానికి 2-3 సార్లు కొంచెం చికెన్, గొర్రె, ఇంకా సముద్రపు ఆహారమైనా ఫర్వాలేదు, తీసుకోవటం మంచిది.

తృణధాన్యాలు

తృణధాన్యాలు

రిఫైన్ చేసిన ధాన్యాలు అనగా మైదా మరియు మొక్కజొన్న పిండిలను తృణధాన్యపు పిళ్ళతో మార్చాల్సి ఉంటుంది. తృణధాన్యాలలో జొన్నలు, గోధుమరవ్వ మరియు బ్రౌన్ రైస్ వంటివి ఉంటాయి. వీటి నుంచి ప్రొటీన్, ఐరన్, మెగ్నీషియం, కార్బొహైడ్రేట్ మరియు ఫైబర్ లభిస్తాయి. కడుపుతో ఉన్నంతకాలం రోజుకి రెండుసార్లు ఈ తృణధాన్యాలను తీసుకోవటం మంచిది.

చేపలు

చేపలు

ప్రొటీన్ అత్యధికంగా ఉండటమేకాక, చేపలో ఒమేగా -3ఫ్యాటీ యాసిడ్లు కూడా ఎక్కువగా ఉంటాయి. కాకపోతే మీరు పాదరసం ఎక్కువగా ఉండని చేపను తీసుకోవడం ముఖ్యం. పిండం పూర్తిగా ఎదగటానికి చేప చాలా మంచి ఎంపిక.

కాటేజ్ జున్ను

కాటేజ్ జున్ను

కాటేజ్ జున్ను లేదా పన్నీర్ భారతదేశంలో చాలా ప్రసిద్ధి, ముఖ్యంగా శాకాహారులకి.40-50గ్రాములు తక్కువ ఫ్యాట్ పన్నీర్ ఒక గ్లాసు పాలతో సమానం. దీన్ని పాస్తా,కూర గ్రేవీలు, రోటీలు దేనితో అయినా జతచేయవచ్చు. ఇంట్లో తయారుచేసిన పనీర్ బయట షాపు నుండి తెచ్చిన కాటేజీ జున్ను కన్నా ఎంతో ఉత్తమం.

చిక్కుళ్ళు

చిక్కుళ్ళు

కడుపుతో ఉన్నప్పుడు రోజుకి రెండు సార్లు చిక్కుళ్ళ వంటివి తినటం తప్పనిసరి. సెనగలు, సోయాబీన్స్, రాజ్మా,బఠాణీలు, పప్పుధాన్యాలు,ఆకుకూరలు వంటి అనేక పదార్థాలలో ప్రొటీన్ మరియు కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండి కొవ్వు శాతం తక్కువగా ఉంటాయి. బిడ్డ ఆరోగ్యానికి, సరైన బరువుకి ఫైబర్ పదార్థాలైన ఈ లెగ్యూమ్స్ వంటివి అవసరం.

Read more about: food
English summary

Foods That Help Increase Weight of Baby In The Womb

Every woman would want to give birth to a healthy baby and healthy mostly equates to being bulky. So, the weight of the baby is a concern. The weight of the baby is determined during the ultrasound. Foods might increase the baby's weight in the womb. Foods such as eggs, dry fruits, etc., can help increase the weight of
Desktop Bottom Promotion