Latest Updates
-
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్!
కడుపుతో ఉన్నవారికి లోపల బిడ్డ కదలికలు ఎప్పటి నుంచి మొదలవుతాయంటే...
మర్చిపోలేని అనుభవం : స్త్రీకి గర్భం దాల్చడం అన్నింటికంటే ఎక్కువగా ఆనందాన్నిచ్చే విషయం. అచ్చం మన పోలికలతో పుట్టే పాపాయికి జన్మనివ్వడమంటే మహిళకు మర్చిపోలేని సందర్భం. కడుపులో ఉన్న బుజ్జాయికి అన్ని రకాల పోషకాలు మనవల్లే అందుతున్నాయనే విషయమే ప్రత్యేకంగా అనిపిస్తుంది. మొత్తం గర్భధారణ ప్రక్రియ అంతా ఒక మిరాకిల్‌గా అనిపిస్తుంది. ఈ ప్రక్రియ ముగిసి పండంటి బిడ్డ భూమి మీదకు వచ్చేదాకా ఆత్రంగా ఎదురుచూస్తుంటాం.
అనేక మార్పులు: గర్భధారణ సమయంలో మహిళ అనేక రకాల మార్పులను చూస్తుంది. శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులుంటాయి. తల్లి కాబోతున్నానే విషయం తెలిసినప్పటినుంచి లోపల బిడ్డ ఎలా ఉందో అనే గాభరా, ఆత్రుత ఉండటం సహజం. లోపల బిడ్డ ఆరోగ్యం ఎలా ఉందీ, అంత చిన్న స్థలంలో హాయిగా ఉండగలరా లేదా అనే సందేహం కలుగుతుంటుంది. అయితే ప్రకృతిలో అన్ని రకాల ప్రశ్నలకు సమాధానాలుంటాయి.

శరీరం అలా మార్పును ఆహ్వానిస్తుంది: కడుపుతో ఉండగా లోపల ఎదిగే బిడ్డకు చోటు ఇచ్చే విధంగా మన శరీరం తయారవుతుంది. అయితే పెరిగే కొద్దీ కొందరు తల్లులకు కొన్ని రకాల సమస్యలు ఉన్నట్టుగా అనుకుంటారు. ముఖ్యంగా లోపల బిడ్డ కాళ్లు, చేతులు ఆడించినప్పుడు, కడుపును తన్నినట్టుగా అనిపిస్తుండటం సహజం.
అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా..: లోపల బిడ్డ పెరుగుతున్న కొద్దీ తల్లులు దాని గురించి మరింత ఆలోచిస్తుంటారు. కడుపులో సరైన పోషణ అందుతుందో లేదో అని అనుకుంటూ ఉంటారు. ఈ కారణంగానే కడుపుతో ఉన్నవారు తరచూ డాక్టర్ దగ్గరకు వెళ్లి అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించుకొని బిడ్డ కదలికలను చూడాలనుకుంటారు. బిడ్డ కదలికలు, ఎదుగుదల తెలుసుకునేందుకు కొన్ని పరామితులు ఉంటాయి. ముఖ్యంగా బిడ్డ కాళ్లు, చేతులు ఎదిగి లోపల నుంచి తంతు ఉంటారు. ఇదే వారి ఎదుగుదలకు సంకేతంగా చెప్పొచ్చు. దీన్నే అనాది కాలంగా నమ్ముతూ వస్తున్నారు. ఇప్పుడంటే అల్ట్రాసౌండ్, డాప్లర్ లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది కానీ అప్పట్లో అందరు ఇదే కొలమానంగా తీసుకునేవారు.

8 వారాల తర్వాత...: కడుపుతో ఉండేవారు బిడ్డ కదలికలను ఎప్పటి నుంచి అనుభవిస్తారు? లోపల సరైన పోషణ ఉందో లేదో తెలుసుకునే మార్గమేమిటి అంటే నిపుణులు ఈ విధంగా చెబుతున్నారు. సాధారణంగా గర్భం ధరించిన 8 వారాల తర్వాత లోపల ఏదో ఉందన్న భావన కలగడం మొదలవుతుందట. ఈ విషయం గురించి మరింతగా...
8 వారాల వ్యవధిలో లోపల పిండం పెరుగుతుంది. ఉమ్మనీరులో పెదాలు, బుగ్గలతో ఫీలింగ్ మొదలవుతుంది.
11, 12వ వారాల్లో ఇలా...
11 వ వారంలోకి వచ్చేసరికి కాళ్లు, చేతులు బాగా డెవలప్ అయి తల్లి గర్భంలోని స్థలాన్ని పరిశీలించే అవకాశం దొరుకుతుంది. లోపల పిండానికి నేర్చుకునే దశ, పరిసరాలను గ్రహణం చేయగలిగే అవకాశం వస్తుంది.
12 వ వారం వచ్చేసరికి లోపల బిడ్డ తన్నేది తల్లికి తెలుస్తూ ఉంటుంది. కడుపులో పేలాలు పేలినట్టు భావన వస్తుంది.

20వ వారం స్పష్టంగా
20 వ వారం వచ్చేసరికి లోపల బిడ్డ తన్నేది స్పష్టంగా అనుభం వస్తుంది. ఇతరులకు చెవి ఆనించి పెడితే అది తెలుస్తుంది. రోజులు గడిచే కొద్దీ లోపల బిడ్డ దృఢంగా తయారవుతూ ఉంటారు.
30 వారాలకు తల ఎటువైపు ఉన్నది...
30 వారాలు పూర్తయ్యే సరికి తల కచ్చితంగా ఏ పొజిషన్‌లో ఉన్నది అర్థమవుతూ ఉంటుంది. మార్పు ఎలా ఉంటుందంటే కడుపు ఆకారం మారుతున్నది స్పష్టంగా కనిపిస్తుంటుంది.
చాలా మంది మహిళలకు లోపల బిడ్డ చివరి దాకా తంతున్నదీ లేనిది స్పష్టంగా తెలియదు. అది అలవాటుగా మారుతుంది కాబట్టి రాన్రాను గ్రహించలేకపోతారు.

తల్లి మూడ్‌ను బట్టి
తల్లి మూడ్‌ను బట్టి కూడా లోపల బిడ్డ కదలికలు ఆధారపడి ఉంటాయి. తల్లి సంతోషంగా ఉంటే లోపల బిడ్డ ఎక్స్జ్‌ట్‌మెంట్‌తో ఉంటాడు. తల్లి ఒత్తిడిలో ఉంటే బిడ్డ అచేతనంగా ఉంటాడు. అదీ కాక తల్లి పోషకాహారం బాగా తింటే లోపల బిడ్డ మరింత బలవర్ధకంగా తయారవుతుంది.
లోపల బిడ్డ తరచూ కదలికలు ఉండకపోయినా పెద్దగా గాభరా పడాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. అధిక బరువు ఉన్నవారు బిడ్డ కదలికలను ఆలస్యంగా గుర్తిస్తారు.
సంతోషంగా ఉంటే...
కడుపుతో ఉన్నప్పుడు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఇది లోపలున్న బిడ్డకు మేలుచేస్తుంది. సంతోషంగా ఉన్నప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోను విడుదలవుతుంది. ఇది బిడ్డ కదలికలను పసిగడుతుంది. తల్లి సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటే లోపల బిడ్డ కూడా ఫుల్ ఖుష్.



Click it and Unblock the Notifications











