ఈ 7 ప్రెగ్నన్సీ టిప్స్ తో ఫస్ట్ ట్రైమిస్టర్ ని సులభంగా గడిపేయండి

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

మీ ముందు ఆహ్లాదపరిచే 9 నెలలున్నాయి. పండంటి పాపాయిని అందుకోవడానికి మీరు ఈ దశలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని తీరాలి. ప్రయాణం మొదలైనప్పుడు సజావుగా సాగితే ఆ ప్రయాణం అంతా సంతోషంగా గడిచిపోతుంది. ఈ ప్రెగ్నన్సీ ప్రయాణాన్ని కూడా ఈ 7 జాగ్రత్తలను తీసుకుంటూ ప్రారంభించండి. ప్రెగ్నన్సీని ఒక మధురమైన అనుభూతిగా మలచుకోండి.

1. సరైన ప్రీనాటల్ హెల్త్ కేర్ ను తీసుకోండి:

1. సరైన ప్రీనాటల్ హెల్త్ కేర్ ను తీసుకోండి:

ప్రీనాటల్ హెల్త్ కేర్ ఇంపార్టెన్స్ ని తీసిపారేయలేము. మీ పాపాయికి అలాగే మీకు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రీనాటల్ హెల్త్ కేర్ స్పెషలిస్ట్ సూచనలను పాటించండి. మీ బంధుమిత్రుల నుంచి ఈ సమయంలో తీసుకోవలసిన కేర్ కి సంబంధించి సలహాలను స్వీకరించండి. ఫస్ట్ ట్రైమిస్టర్ లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రెగ్నన్సీ ఫేజ్ మొత్తం సంతోషంగా గడిచిపోతుంది.

2. ప్రెగ్నన్సీ ని కన్ఫర్మ్ చేసుకునేందుకు ప్రీనాటల్ అపాయింట్మెంట్ ను తీసుకోండి.

2. ప్రెగ్నన్సీ ని కన్ఫర్మ్ చేసుకునేందుకు ప్రీనాటల్ అపాయింట్మెంట్ ను తీసుకోండి.

వైద్యులు సూచించిన టెస్ట్ ల ను చేయించుకోండి. ఈ టెస్ట్ ల ద్వారా గర్భంలోపలి పరిస్థితి గురించి వైద్యులు ఓ అంచనా వేస్తారు. మీ ఆరోగ్యస్థితిని కూడా అర్థం చేసుకుంటారు. అందువలన, ప్రెగ్నన్సీ కన్ఫర్మేషన్ కోసం వైద్యులు సూచించిన టెస్ట్ లను చేయించుకోవడం మంచిది.

 3. వైద్యుల సూచన మేరకు ప్రీనాటల్ విటమిన్స్ ను వాడండి.

3. వైద్యుల సూచన మేరకు ప్రీనాటల్ విటమిన్స్ ను వాడండి.

అలాగే మీరు ఏ ఆహారాన్ని తీసుకోవాలో వీటిని అవాయిడ్ చేయాలో తెలుసుకోండి. ఆరోగ్యకరమైన ఫుడ్స్ ను మాత్రమే తీసుకోండి. ఇది రాకెట్ సైన్స్ కాదు. ఈ సమయంలో ఏ ఆహారం తీసుకుంటే మంచిదో వైద్యులను అడిగి తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకోండి.

4. హైడ్రేటెడ్ గా ఉండండి.

4. హైడ్రేటెడ్ గా ఉండండి.

ఎందుకంటే, ఇప్పుడు మీ హార్ట్ మీతో పాటు మీలో ప్రాణం పోసుకున్న మీ పాపాయికి కూడా రక్తాన్ని పంపిణీ చేస్తోంది. తగినంత మంచినీళ్లను తీసుకోవడం ద్వారా మీ పాపాయి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. అలాగే, శరీరం నుంచి అనవసరమైన టాక్సిన్స్ ను ఫ్లష్ చేయవచ్చు. నీటిని తీసుకోవడం వల్ల అంతా మంచిదే.

5. కెఫైన్ ను అవాయిడ్ చేయండి.

5. కెఫైన్ ను అవాయిడ్ చేయండి.

రీసెర్చ్ లనేవి కెఫైన్ తో మిస్ క్యారేజ్ ల కున్న లింక్ ను వెల్లడిస్తున్నాయి. అలాగే ఇతర ప్రెగ్నన్సీ సమస్యలు కూడా కెఫైన్ వలన తలెత్తవచ్చు. కాబట్టి, మీరు కెఫైన్ ను ఈ 9 నెలలు అవాయిడ్ చేయడం మంచిది. ఈ చిన్న శాక్రిఫైస్ వలన పెద్ద ఆనందాన్ని పొందుతారు.

6. స్మోకింగ్ ను క్విట్ చేయండి.

6. స్మోకింగ్ ను క్విట్ చేయండి.

తద్వారా, స్టిల్ బర్త్ తో పాటు ప్లాసెంటల్ ప్రాబ్లెమ్స్ ని అరికట్టవచ్చు. అలాగే, ఆల్కహాల్ ను క్విట్ చేయండి. దాంతో లెర్నింగ్, స్పీచ్ ఇంపెయిర్మెంట్స్, అటెన్షన్ డెఫిషిట్, లాంగ్వేజ్ ఇష్యూస్, హైపర్ యాక్టివిటీ వంటి సమస్యల బారిన పడకుండా మీ పాపాయిని రక్షించుకోవచ్చు. మీ అడిక్షన్స్ అనేవి మీ పాపాయి ఆరోగ్యం పై దుష్ప్రభావం చూపుతాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీ అడిక్షన్స్ ను కంట్రోల్ చేసుకోండి.

7. త్వరగా నిద్రపోండి.

7. త్వరగా నిద్రపోండి.

తగినంత నిద్రవలన నేచురల్ బయలాజికల్ క్లాక్ అనేది ట్యూన్ లో ఉంటుంది. లేదంటే, మీరు అలసట బారిన పడతారు. ఫస్ట్ ట్రైమిస్టర్ లో త్వరగా నిద్రపోవడం, ఎక్కువసేపు మేలుకోకుండా ఉండటం వలన అలసట తలెత్తదు. దాంతో, మీరు ఫ్రెష్ గా బలంగా ఉంటారు. త్వరగా నిద్రపోయి, త్వరగా మేల్కొనే అలవాటు ఈ సమయంలో ఎంతో మంచిది.

ఈ జాగ్రత్తలను పాటిస్తూ ఫస్ట్ ట్రైమిస్టర్ ని సరదాగా గడిపేయండి. మీ జీవితంలోని కొత్త చాప్టర్ కి స్వాగతం పలకండి!

English summary

Have an Easy First Trimester with these 7 Pregnancy Care Tips

Have an Easy First Trimester with these 7 Pregnancy Care Tips,You’ve got a whole nine months ahead of you and you haven’t got the slightest clue as to how you can get it off to the right start. Well, allow us to tell you. We’ve put together a list of 7 highly effective things you can do during your first trimester of