హై రిస్క్ ప్రెగ్నన్సీ ప్రివెన్షన్ కు అలాగే దీనిని మేనేజ్ చేసే మార్గాలు

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

ప్రెగ్నన్సీ సమయంలో కొన్ని కాంప్లికేషన్స్ ఎదురైనప్పుడు ఆ కాంప్లికేషన్స్ అనేవి బిడ్డకి అలాగే తల్లికి హానీకరమైనప్పుడు హై రిస్క్ ప్రెగ్నన్సీగా పరిగణిస్తారు.

అలాగే, హైపెర్టెన్షన్, డయాబెటిస్ మరియు అనీమియా వంటి కొన్ని హెల్త్ రిస్క్స్ ప్రెగ్నన్సీ సమయంలో ఎదురైనప్పుడు ఇవి తల్లికి అలాగే బిడ్డకీ ప్రమాదకరమే.

ఈ కండిషన్స్ అనేవి యాషియన్ సబ్ కాంటినెంట్ లో అధికంగా ఎదురవుతాయి.

problems related to pregnancy

ప్రెగ్నన్సీ సమయంలో 3 నుంచి 10 శాతం వరకు హైపెర్టెన్షన్ బారిన పడే అవకాశం ఉంది. వారిలో మెటర్నల్ మోర్టాలిటీ, ప్రీ టర్మ్ బర్త్ మరియు ఇంట్రాయుటెరైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ కి ఇదే కారణం.

అందువలన, మాటెర్నల్ మరియు ఫోటల్ ఎవాల్యుయేషన్ ని గమనించడం అవసరం. స్పెషలిస్ట్స్ దగ్గరనుంచి సలహాను స్వీకరించాలి. ప్రతి ప్రెగ్నన్సీ అనేది భిన్నమైనది. అందుకు తగిన జాగ్రత్తలను వైద్యులనుంచి తెలుసుకుని పాటించాలి.

హై రిస్క్ ప్రెగ్నన్సీ కాంప్లికేషన్స్

18 నుంచి 20 వారాల మధ్యలో జరిగే అనామలీ స్కాం అనేది బేబీలోని స్ట్రక్చరల్ అబీనార్మాలిటీస్ ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది.

అన్ని ప్రెగ్నన్సీ స్టేజ్ లలో ఇది అవసరం. డయాఫ్రాగ్మాటిక్ హెర్నియా బారిన పడిన బేబీని 20 వారల ప్రెగ్నన్సీలో జరిగిన అల్ట్రా సౌండ్ స్కానింగ్ ద్వారా గుర్తించడం జరిగింది.

ఈ ప్రెగ్నన్సీలో తల్లీబిడ్డలు వైద్యుల పర్యవేక్షణలో ఉండడం తప్పనిసరి. ప్రెగ్నన్సీ కాంప్లికేషన్స్ల్ వలన కలిగే ప్రాణనష్టాల్ని తగ్గించే అవకాశము ఉంది.

వీటన్నిటితో పాటు, లైఫ్ స్టయిల్ లో అలాగే ఫుడ్ హేబిట్స్ లో మార్పులు అవసరం. హై రిస్క్ ప్రెగ్నన్సీ లో ఎదురయ్యే కాంప్లికేషన్స్ ని ఈ మార్పులతో కాస్తంత అరికట్టవచ్చు.

హై రిస్క్ ప్రెగ్నన్సీ కాంప్లికేషన్స్

problems related to pregnancy

ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకోండి:

మీరు తీసుకునే ఫుడ్ పై మీరు శ్రద్ధ వహించాలి. వాటితో పాటు ఫోలిక్ యాసిడ్, కేల్షియం, ఐరన్, విటమిన్స్ తో పాటు మిగతా పోషకాలు అవసరం.

ప్రెగ్నన్సీలో డయాబెటిస్, హైపెర్టెన్షన్, అనీమియా వంటి హెల్త్ ఇష్యూస్ ఎదురైతే డాక్టర్ల సూచన మేరకు ఈ హెల్త్ ఇష్యూస్ కాంప్లికేషన్స్ ని తగ్గించే ఇతర పోషకాలను కూడా మీరు తీసుకోవాలి.

శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలి:

మీ శరీర బరువును మీరు గమనిస్తూ ఉండాలి. బరువు తగ్గుదలను అలాగే పెరుగుదలను గమనిస్తూ ఉండాలి. డాక్టర్ ని సంప్రదించి శరీర బరువు యొక్క కరెక్ట్ డీటెయిల్స్ ను తెలుసుకోండి. మీరు చేయదగిన ఎక్సర్సైజుల గురించి కూడా తెలుసుకోండి. ఇవన్నీ, తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యాన్ని సంరక్షించే మార్గాలు.

స్మోక్ మరియు ఆల్కహాల్ ని అవాయిడ్ చేయండి: స్మోకింగ్ మరియు ఆల్కహాల్ నుంచి మీరు దూరంగా ఉండటం మంచిది.

రెగ్యులర్ ప్రీనాటల్ కేర్ :

వైద్యున్ని తరచూ సంప్రదించి మీ ఆరోగ్యస్థితిని గమనించుకోవడం మంచిది. దీని ద్వారా ఎన్నో కాంప్లికేషన్స్ ని అవాయిడ్ చేయవచ్చు. అమ్నియాసెంటెసిస్ వంటి కొన్ని ప్రత్యేకమైన టెస్ట్ లను స్పెషలిస్ట్ ను మీకు సజెస్ట్ చేసే సూచనలు కూడా కలవు. ఇలా జాగ్రత్తలు పాటిస్తే, వీటి ద్వారా మీ ఆరోగ్యాన్ని మీలో ప్రాణం పోసుకుంటున్న మీ శిశువు ఆరోగ్యాన్ని సంరక్చించుకున్న వారవుతారు.

English summary

High-Risk Pregnancy: Prevention & Ways To Tackle It

A pregnancy is considered high risk when there are certain complications that could hamper the mother or baby, or both. Diabetes or hypertension are the major risk factors. Few safety measures helps in preventing high risk pregnancy.
Story first published: Wednesday, March 7, 2018, 16:15 [IST]