Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
గర్భిణీలు రోజుకు ఎంత నీరు తీసుకోవాలి?
గర్భిణీలు రోజుకు ఎంత నీరు తీసుకోవాలి?
గర్భం దాల్చినప్పటి నుంచి గర్భిణీలను అనేక సందేహాలు వెంటాడుతాయి. ఏ ఆహార పదార్థాలను తీసుకోవాలి అలాగే వేటిని అవాయిడ్ చేయాలన్న సందేహాలు వెంటాడుతాయి. అలాగే త్రాగే నీటి విషయంలో కూడా సందేహం తలెత్తుతుంది. ఎంత నీరు త్రాగాలి? అన్న ప్రశ్న సాధారణంగా ప్రతి గర్భిణీని తొలచివేస్తుంది. నీరు లేనిదే జీవం లేదు. నీరు మానవాళి మనుగడకు ముఖ్యమైనది. ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నీటిని తీసుకోవాలి. గర్భిణీలు కూడా తగినంత నీటిని తీసుకోవాలి.
తనలో జీవం పోసుకుంటున్న మరో ప్రాణి సంరక్షణ కొరకు నీటిని తీసుకునే మోతాదును కొంచెం పెంచుకోవాలి. అయితే, ఎంత మోతాదు పెంచుకోవాలన్న విషయంలో సందేహం తలెత్తడం సహజమే. ఈ సందేహాన్ని నివృత్తి చేయడానికి ఈ ఆర్టికల్ తోడ్పడుతుంది. గర్భం దాల్చిన తరువాత ఎంత నీటిని తీసుకోవాలి అలాగే తగినంత నీటిని తీసుకోకపోవడం వలన కలిగే ఇబ్బందుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


• రోజువారీ ఎంత నీటిని తీసుకోవాలి:
గర్భం దాల్చిన తరువాత ఆహారాన్ని తీసుకునే మోతాదును పెంచాలి అని ఇంట్లోని పెద్దల నుండి అందే పాపులర్ సలహా. అయితే, ఇది కేవలం ఆహారానికి మాత్రమే పరిమితం కాదు. ఇది తీసుకునే ద్రవాలకు కూడా వర్తిస్తుంది. గర్భిణీలు ప్రతి రోజూ దాదాపు 2.3 లీటర్ల నీటిని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అంటే సుమారుగా 10 కప్పుల నీటిని గర్భిణీలు తీసుకోవాలి.

• తగినంత నీటిని తీసుకోకపోతే గర్భిణీలు ఎదుర్కొనే పరిస్థితులేంటి?
గర్భిణీ తగినంత నీటిని తీసుకోకపోవడం వలన తన ఆరోగ్యంతో పాటు గర్భస్థ శిశువు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. తగినంత నీటిని తీసుకోకపోవటం వలన ఎదురయ్యే కొన్ని ఇబ్బందులు తగ్గే ఆస్కారం కూడా ఉండదు.

• శరీరం అతివేడికి గురవుతుంది
గర్భిణీలు తగినంత నీటిని తీసుకోకపోవడంతో శరీరంలో ఉత్పత్తి అయ్యే వేడి నియంత్రణలో ఉండదు. గర్భిణీల శరీరంలో వేడి సహజంగానే కొంత ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ వేడిని నియంత్రించకపోతే శరీరం ఓవర్ హీట్కి గురవుతుంది. ఇది మొదటి ట్రిమ్ స్టర్ లో మొదలైతే, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ బారిన పడి కొన్ని సార్లు మిస్ క్యారేజ్ కు గురయ్యే ప్రమాదం ఉంది.

• బ్రెస్ట్ మిల్క్ ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది
తగినంత నీటిని తీసుకోకపోవడంతో దీని ప్రభావం బ్రెస్ట్ మిల్క్ పై పడుతుంది. మరింత విపరీతమైన పరిస్థితులలో దీని వలన తల్లి తన బిడ్డకు సరైన పోషణను తన పాల ద్వారా అందించలేకపోతుంది. అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ప్రతి రోజూ తగినంత నీటిని తీసుకోవాలి.

• మూత్రం చిక్కబడుతుంది
నీటిని తక్కువగా తీసుకోవడం వలన మూత్రం చిక్కబడుతుంది. మాములుగా వచ్చేదానికంటే మూత్రం చిక్కగా వస్తుంది. ఇది ఇన్ఫెక్షన్స్ రిస్క్ ను పెంపొందిస్తుంది. ఇలా లాస్ట్ ట్రిమ్స్టర్ వరకు కొనసాగుతుంది. ఇది కాంట్రక్షన్స్ రిస్క్ ను పెంపొందిస్తుంది. ఈ కాంట్రాక్షన్స్ వలన ప్రీ టర్మ్ లేబర్ రిస్క్ అనేది పెరుగుతుంది.

• డీహైడ్రేషన్ వలన గర్భస్థ శిశువు ఆరోగ్యంపై దుష్ప్రభావం
గర్భిణీలు తగినంత నీటిని తీసుకోకపోవడం వలన గర్భస్థ శిశువుపై దుష్ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితులలో పుట్టుకతో కలిగే లోపాలు తలెత్తే ప్రమాదం ఏర్పడవచ్చు. మొదటగా, శరీరంలోని ఉమ్మనీటి స్థాయి తగ్గిపోతుంది. ఉమ్మనీరు గర్భస్థ శిశువుకు రక్షణ కవచంలా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. ఉమ్మనీటి స్థాయి తగ్గిపోవడం వలన గర్భస్థ శిశువుకు రక్షణ కరువవుతుంది. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ తలెత్తే ప్రమాదం ఎక్కువవవచ్చు. ప్రీ టర్మ్ లేబర్ సమస్య ఎదురవవచ్చు. అందువలన, గర్భిణీలు తగినంత నీటిని తీసుకోవాలి.

• గర్భిణీలు తీసుకోదగిన ఇతర ద్రవాలేంటి?
గర్భం దాల్చిన తరువాత ఆల్కహాలిక్ బెవెరేజెస్ కు దూరంగా ఉండాలన్న సంగతి తెలిసిందే. అయితే, ఇతర ద్రవాలను అవాయిడ్ చేయవలసిన అవసరం లేదు. రోజువారీ న్యూట్రిషన్ డోస్ ను అందుకునేందుకు కొన్ని ద్రవపదార్థాలపై ఆధారపడవచ్చు. అవేంటంటే:

తాజా పండ్ల రసం:
తాజా పండ్ల రసంలో విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి గర్భిణీలకు అత్యంత అవసరం. తాజా పండ్ల రసాన్ని తాగండి. ఫ్రూట్ ఫ్లేవర్స్ కలిగిన డ్రింక్స్ ను అవాయిడ్ చేయండి. ఎందుకంటే వీటిలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది గర్భిణీలకు అలాగే గర్భస్థ శిశువులకు మంచిది కాదు.

పాలు:
పాలలో ప్రోటీన్స్ తో పాటు కేల్షియం పుష్కలంగా లభిస్తుంది. గర్భిణీలు పాలను తగినంత తీసుకోవాలి. కనీసం ఒక కప్పుడు పాలనైనా రోజూ తీసుకోవాలి. లాక్టోస్ ఇంటాలారెంట్ అయిన వారు సొయా డ్రింక్ ను ప్రిఫర్ చేయవచ్చు.

సూప్ మరియు బ్రాత్స్
ఒక కప్పుడు సూప్ మరియు బ్రాత్ ను రోజువారీ తీసుకోవడం వలన రోజువారీ ఫ్లూయిడ్ రిక్వయిర్మెంట్స్ ను అందుకోవచ్చు.

• నీటిని ఎక్కువగా తీసుకోవడం వలన కలిగే దుష్ప్రభావం?
గర్భిణీలు నీటిని ఎక్కువగా తీసుకోవాలి. తగినంత నీటిని తీసుకోవడం వలన తల్లీబిడ్డల ఆరోగ్య స్థితి మెరుగ్గా ఉంటుంది. అయితే, నీటిని మరింత ఎక్కువగా తీసుకోవడం వలన ఉమ్మనీటి శాతం అతిగా పెరగదని తెలుసుకోవాలి. గర్భిణీలు ఇంతే నీరు తాగాలని ప్రత్యేకమైన లిమిట్ లేదు. ఎవరి శరీర స్థితిని బట్టి నీటిని తీసుకునే మోతాదు ఆధారపడి ఉంటుంది.
నిజానికి, నీటిని ఎక్కువగా తీసుకోవడం వలన అనేక సమస్యల బారిన పడాల్సి వస్తుందని, తల్లి ఆరోగ్యం ఇబ్బందుల పాలవుతుందన్న అపోహ ఉంది. ఇది కేవలం అపోహ మాత్రమే. నీటిని తీసుకోవడమనేది ఆరోగ్యకరమైన విషయం. ఒకవేళ మీరు ఎక్కువగా నీటిని తీసుకుంటున్నారని మీకనిపించినా దాని వలన మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురవవు. వాటర్ రిటెన్షన్ సమస్య తలెత్తదు. అలాగే సేఫ్ మరియు హెల్దీ డెలివరీకి ఆటంకం ఏర్పడదు.



Click it and Unblock the Notifications