For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నన్సీ సమయంలో బ్లీడింగ్ అనేది సాధారణమేనా?

ప్రెగ్నన్సీ కి సంబంధించిన మార్పులు ఒకరిలో ఒకలా కనిపిస్తే మరొకరితో మరొకలా కనిపిస్తాయి. మీరు ఎక్స్పీరియెన్స్ చేసిన ప్రెగ్నన్సీ లక్షణాలని మీ ప్రేగ్నన్ట్ ఫ్రెండ్ ఎక్స్పీరియెన్స్ చేసి ఉండకపోవచ్చు.

|

మహిళ జీవితానికి వన్నె తెచ్చేది ప్రెగ్నన్సీ అని చెప్పడం అతిశయోక్తి కాదు. అయితే, ప్రెగ్నన్సీకి సంబంధించి మహిళల్లో అనేక సందేహాలు సహజము. ప్రెగ్నన్సీ సమయంలో తీసుకునే ఆహారం దగ్గరనుంచి ప్రతి విషయంపైనా ఎన్నో సందేహాలు కలుగుతాయి. అయితే, ప్రెగ్నన్సీ వలన మహిళలకు తొమ్మిది నెలలపాటు పీరియడ్స్ నుంచి విముక్తి లభిస్తుంది. ఈ సమయంలో ఎన్నో రుచులను ఆస్వాదించాలని వారికనిపిస్తుంది. ప్రెగ్నన్సీ సమయంలో కలిగే క్రేవింగ్స్ ని తీర్చేందుకు కుటుంబము మొత్తం ఆప్యాయత కనబరుస్తుంది.

అయితే, మొదటిసారి గర్భం దాల్చిన వారికి ఈ ఫేజ్ ఎంతో కన్ఫ్యూషన్ ని కలిగిస్తుంది. ఈ సమయంలో మన శరీరం అనేక మార్పులకు గురవుతుంది. ఆ మార్పులను అర్థం చేసుకోవడం అంత సులభంగా కాదు. మన శరీరం మనకిచ్చే సూచనల్ని అర్థం చేసుకోవడం కష్టమే. తరచూ ఆకలి వేయడం లేదా ఎప్పుడూ అలసటగా ఉండటం, నిద్రలేమితో బాధపడటం లేదా అతిగా నిద్రపోవడం, పెల్విక్ ఏరియాలో నొప్పివంటివి ఈ టైంలో తలెత్తే కొన్ని కండిషన్స్. ఇవి, సాధారణంగా హానీకరమైనవి కావు. అయితే, ఇవి గనక విపరీతమైన అసౌకర్యానికి మిమ్మల్ని గురిచేస్తే వీటి విషయంలో మీరు మరింత శ్రద్ధ కనబరచాలి. మీ గైనకాలజిస్ట్ ను సంప్రదించి తగిన వైద్య చికిత్సను అందుకోవాలి.

is it normal to bleed during pregnancy

ప్రెగ్నన్సీ కి సంబంధించిన మార్పులు ఒకరిలో ఒకలా కనిపిస్తే మరొకరితో మరొకలా కనిపిస్తాయి. మీరు ఎక్స్పీరియెన్స్ చేసిన ప్రెగ్నన్సీ లక్షణాలని మీ ప్రేగ్నన్ట్ ఫ్రెండ్ ఎక్స్పీరియెన్స్ చేసి ఉండకపోవచ్చు. అందువలన, ఈ సమయంలో సంభవించే మార్పులకి కారణాలివని ప్రత్యేకించి చెప్పలేము.

అయితే, ప్రెగ్నన్సీకి సంబంధించిన విషయాలను మేము తెలుసుకుని మీకు అందిస్తున్నాము. సరైన సమాచారాన్ని మీకందించేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాము. తద్వారా, మీ ప్రెగ్నన్సీ జర్నీ మీకు మధురమైన జ్ఞాపకాలను మిగిల్చేలా ప్రయత్నిస్తున్నాము.

ప్రెగ్నన్సీ సమయంలో ఎక్కువమంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య స్పాటింగ్. అందువల్ల, దీనికి సంబంధించిన విషయాలను ఇప్పుడు చర్చించబోతున్నాము.

స్పాటింగ్ అంటే ఏమిటి?

స్పాటింగ్ అంటే ఏమిటి?

వెజీనా నుంచి బ్లడ్ డిశ్చార్జ్ అవడాన్ని స్పాటింగ్ అంటారు. ప్రెగ్నన్సీ సమయంలో మహిళలు బ్లీడింగ్ ను ఎక్స్పీరియన్స్ చేయకపోయినా అప్పుడప్పుడూ కనిపించే స్పాటింగ్ వారిని ఆందోళనకు గురిచేస్తుంది.

ప్రెగ్నన్సీ సమయంలో స్పాటింగ్ కనిపించడం సాధారణమేనా?

ప్రెగ్నన్సీ సమయంలో స్పాటింగ్ కనిపించడం సాధారణమేనా?

స్టాట్స్ ప్రకారం ప్రెగ్నన్సీ సమయంలో 20 శాతం మహిళలు కనీసం ఒక్కసారైనా స్పాటింగ్ ను ఎక్స్పీరియన్స్ చేస్తారని తెలుస్తోంది. తక్కువ మొత్తంలో బ్లడ్ డిశ్చార్జ్ అయినప్పుడు స్పాటింగ్ అంటారు. ఇది సాధారణమేనని వైద్యులు చెప్తున్నారు. సాధారణంగా స్పాటింగ్ సమయంలో కనిపించే బ్లడ్ అనేది పింక్ లేదా బ్రౌన్ కలర్ లో ఉంటుంది. అంటే గాని, బ్రైట్ రెడ్ లో మాత్రం ఉండదు.

కొన్ని సందర్భాలలో, బ్లడ్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా ఉంటూ మీరు బ్లీడింగ్ ని గమనిస్తే మీరు వెంటనే గైనకాలజిస్ట్ ను సంప్రదించాలి.

స్పాటింగ్ కి కారణమయ్యే అంశాలు-

స్పాటింగ్ కి కారణమయ్యే అంశాలు-

ప్రెగ్నన్సీ సమయంలో తక్కువ బ్లీడింగ్ అనేది సాధారణమన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే, ఈ కింద కారణాలను మాత్రం మీరు గమనిస్తూ ఉండాలి.

ఈ కింది కారణాల వలన ప్రెగ్నన్సీ సమయంలో స్పాటింగ్ కనిపిస్తుంది.

1. ఇంప్లాంటేషన్ వలన స్పాటింగ్:

1. ఇంప్లాంటేషన్ వలన స్పాటింగ్:

యుటెరస్ లోకి ఫెర్టిలైజైన ఎగ్ ప్రవేశిస్తున్నప్పుడు కొంతమంది మహిళలలో బ్లడ్ డిశ్చార్జ్ ని గమనించవచ్చు. ఈ ఎగ్ అనేది యుటెరస్ వాల్స్ కి అతుక్కోవడానికి ప్రయత్నించేటప్పుడు బ్లీడింగ్ అవుతుంది.

2. ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ:

2. ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ:

ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ కి సంబంధించిన మొదటి సూచనని స్పాటింగ్ ద్వారా గమనించాలి. యుటెరస్ వెలుపల ఫెలోపియన్ ట్యూబ్స్ లో ఎంబ్రియో ఎదుగుదల జరుగుతున్నప్పుడు ఈ కండిషన్ తలెత్తుతుంది.

3. సెర్విక్స్ లో ఇరిటేషన్:

3. సెర్విక్స్ లో ఇరిటేషన్:

ప్రెగ్నన్సీ వలన శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ప్రెగ్నన్సీ హార్మోన్ అనేది ప్రెగ్నన్సీ ప్రారంభమవడానికి ముందు నుంచి సెర్విక్స్ కి ఇరిటేషన్ ను కలిగిస్తుంది. ఈ కారణం చేత కూడా స్పాటింగ్ కనిపిస్తుంది.

4. ఇన్ఫెక్షన్స్:

4. ఇన్ఫెక్షన్స్:

ప్రెగ్నన్సీకి సంబంధం లేని కొన్ని రకాల వెజీనల్ ఇన్ఫెక్షన్స్ వలన కూడా స్పాటింగ్ కనిపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్స్ కి తగిన చికిత్సను వెంటనే తీసుకోవాలి.

5. సెక్స్ లో పాల్గొన్నప్పుడు:

5. సెక్స్ లో పాల్గొన్నప్పుడు:

ప్రెగ్నన్సీ సమయంలో సెక్స్ లో పాల్గొంటే స్పాటింగ్ కనిపించే అవకాశాలు కలవు. ఇది సాధారణమే. ఇది సాధారణమే అయినా, మీరు గైనకాలజిస్ట్ ను సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవడం మేలు.

సెకండ్ లేదా థర్డ్ ట్రైమ్స్టర్ లో బ్లీడింగ్ అనేది ప్లెసెంటా ప్రేవియా లేదా ఎర్లీ టర్మ్ లేబర్ వలన సంభవించవచ్చు. ఆందోళన చెందేకంటే సందేహం ఉన్నప్పుడు గైనకాలజిస్ట్ ను సంప్రదించి తగిన సూచనలు అలాగే చికిత్సను తీసుకోవడం ఉత్తమం. ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటూ శరీరం మీకందించే సూచనలను జాగ్రత్తగా అర్థం చేసుకోవడం ద్వారా పండంటి బిడ్డకు జన్మనివ్వవచ్చు.

English summary

is it normal to bleed during pregnancy, what is spotting, reasons for spotting

One of the common issues that women face during pregnancy is spotting. Therefore here, we will be discussing in detail about it. Take a look.
Story first published:Tuesday, February 6, 2018, 14:37 [IST]
Desktop Bottom Promotion