For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నొప్పులను ప్రేరేపించడానికి ఉపయోగపడే అద్భుతమైన సహజ మార్గాలు

నొప్పులను ప్రేరేపించడానికి ఉపయోగపడే అద్భుతమైన సహజ మార్గాలు

|

గర్భధారణ కాలం ఎంత అందమైనది అయినా, మన బిడ్డని మనం చూసుకునే తొలి క్షణంలో కలిగే సంతోషం ముందు అన్నీ బలాదూర్ అనిపిస్తుంది. గర్భధారణ కాలం పూర్తిగా ముగిసిన తరువాత మాత్రమే,తొమ్మిది నెలల పాటు తన కడుపులో మోసిన బిడ్డను ఒక తల్లి కలుసుకునే అవకాశం కలుగుతుంది.

గర్భం ముగియటం మరియు పిల్లలను ఈ భూమి మీద కలవడానికి మధ్య నొప్పులు పడటం అనే ప్రక్రియ ఉంటుంది. ఈ సమయంలో తల్లి తన శరీరం వెలుపలికి శిశువును నెడుతుంది. ఈ ప్రక్రియ తల్లికి చాలా బాధాకరమైనది అయినా, తన జీవితంలో జరిగే అద్భుతాలలో ఇది ఒకటిగా ప్రతి తల్లి భావిస్తుంది.

నొప్పులను ప్రేరేపించడానికి ఉపయోగపడే అద్భుతమైన సహజ మార్గాలు

ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే, నొప్పులు మొదలయ్యే ఖచ్చితమైన సమయం, అందరు స్త్రీలకు ఒకే విధంగా ఉండదు. ఒకే స్త్రీకి కూడా జరిగే వివిధ ప్రసవాలు,ఒకదాని నుండి మరొకటి భిన్నంగా ఉండవచ్చు. ఒక్కోసారి ఇంకా ప్రసవానికి సమయం ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాలలో తల్లి తన బిడ్డను ఇకపై మోయలేనని అనుకోవచ్చు. కానీ, అటువంటప్పుడు, బలవంతపు ప్రసవానికి ప్రయత్నిస్తే తల్లికి, పుట్టబోయే బిడ్డకు ప్రమాదకరంగా మారవచ్చు.

అటువంటి సందర్భాలలో, చాలా మంది ప్రసూతి నిపుణులు నొప్పులను ప్రేరేపించడాన్ని సిఫార్సు చేస్తారు. ఎన్ని వైద్య మార్గాలు ఉన్నప్పటికీ, సహజ పద్ధతిలోనే ప్రసవం అయితే అది అత్యుత్తమం. ఈ వ్యాసం ద్వారా, వివిధ మార్గాల ద్వారా ప్రసవాన్ని ఎలా ప్రేరేపించవచ్చో తెలుసుకుందాం.

నొప్పులను ప్రేరేపించడానికి ఉపయోగపడే ఐదు సహజ మార్గాలు

1. చనుమొనలను ప్రేరేపించడం

1. చనుమొనలను ప్రేరేపించడం

తల్లిపాల ఉత్పత్తికి అవసరమయ్యే హార్మోన్ గర్భాశయం సంకోచించడానికి కూడా కారణమవుతుంది. ఈ హార్మోన్ ని ఆక్సిటోసిన్ అని పిలుస్తారు. చనుమొనల ప్రేరేపణ ద్వారా ఈ హార్మోన్ ఉత్పత్తిని ప్రోత్సహించవచ్చు. కనుక నొప్పులను ప్రేరేపించడానికి , చనుమొనలను ప్రేరేపించడం ఒక సమర్థవంతమైన మార్గం.

ఈ చర్య మీరు చేసుకోగలరు లేదా మీరు మీ భాగస్వామి యొక్క సహాయం అడగవచ్చు. ప్రత్యామ్నాయంగా, మీరు ఒక రొమ్ము పాలను పంపింగ్ చేసే యంత్రాన్ని కొనుగోలు చేసి, మీ చనుమొనలను ప్రేరేపించి, నొప్పుల ప్రక్రియను ప్రారంభించడం కొరకు ఉపయోగించవచ్చు.

2. ఆక్యుపంక్చర్

2. ఆక్యుపంక్చర్

ఇది నొప్పులను ప్రేరేపించే అత్యంత సౌకర్యవంతమైన మార్గాలలో ఒకటి మరియు తల్లి యొక్క శ్రమ పెద్దగా అవసరం ఉండదు. వైద్యపరంగా, ఆక్యుపంక్చర్ శరీరంలో ఆక్సిటోసిన్ విడుదలకు వీలు కల్పిస్తుంది. ఇది గర్భధారణ కాలం ముగిసిన మహిళల్లో నొప్పులను ప్రేరేపించడానికి ఉపయోగపడే ఒక హార్మోన్.

ఏదేమైనప్పటికీ, ఈ పద్ధతిని మీరు మీ శిశువును పూర్తికాలం మోసి, గర్భధారణ కాలం ముగిసినప్పటికి నొప్పులు ప్రారంభమవ్వని పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఆచరించడం మంచిది. అంతేకాకుండా, అధికారిక అనుమతులు పొందిన ప్రదేశంలో జరుగుతుందని నిర్ధారించుకోండి. ఆ ప్రక్రియను నిర్వహించే వ్యక్తికి తగిన నైపుణ్యం ఉందో, లేదో తెలుసుకోండి.

3. ఆక్యుప్రెజెర్

3. ఆక్యుప్రెజెర్

ఆక్యుప్రెషర్ మరియు ఆక్యుపంక్చర్ అనే ప్రక్రియలు ఒకటేనని చాలామంది అపోహ పడతారు. కానీ, వాస్తవానికి, ఈ రెండింటికి అస్సలు సంబంధమే లేదు. ఆక్యుప్రెజెర్ అనేది గర్భిణీ స్త్రీలలో నొప్పులను ప్రేరేపించడానికి, ఒక అద్భుతమైన మార్గం ఐనప్పటికీ, ఇది అందరు మహిళల విషయంలో పనిచేయదు. అయితే, ఈ పద్ధతిని ప్రయత్నించడం తెలివైన పని.

ఇది నొప్పులను ప్రేరేపించకపోయినా, ఖచ్చితంగా మీ శరీరంలో వివిధ భాగాలలో ఉన్న నొప్పులను మరియు వాపులను తగ్గిస్తుంది. గర్భం యొక్క ఆఖరి దశలో కూడా శరీర నొప్పులు తగ్గించడానికి ఈ పద్ధతిని పాటించడం మంచిది.

4. వ్యాయామం

4. వ్యాయామం

వ్యాయామం సమయంలో, ఏ వ్యక్తికైనా గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. హృదయ స్పందన వేగం పెరిగినపుడు, ప్రసవానికి సిద్ధంగా ఉన్న తల్లికి నొప్పులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందువలన, నొప్పులను ప్రేరేపించడానికి ఉపయోగపడే సురక్షితమైన మార్గాలలో ఇది కూడా ఒకటి. అయితే, వ్యాయామం చేస్తున్నప్పుడు మీ శరీరం అధిక ఒత్తిడికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒత్తిడి ఎక్కువైతే, మీరు అలసిపోయి బిడ్డను కనడానికి తగినంత శక్తి లేకుండా పోతుంది.

అందువలన, వ్యాయామం చేసేటప్పుడు, నడక లేదా నేలను శుభ్రపరచడం వంటి సరళమైన వ్యాయామాలకు కట్టుబడి ఉండటం మంచిది. గర్భం యొక్క తుది దశలో ఏరోబిక్స్ చేయడంలేదా ఈత కొట్టడం వంటి భారీ వ్యాయామాలు చేయరాదు.

5. శృంగారం

5. శృంగారం

ఈ దశలో మీకు లైంగిక అనుభవం పట్ల ఆసక్తి లేకపోయినా, లైంగిక సంపర్కం నొప్పులు ప్రక్రియ ఆరంభమవడానికి తోడ్పడుతుంది. వైద్యపరంగా కూడా, లైంగిక సంపర్కం వలన గర్భాశయం సంకోచించి నొప్పుల ప్రక్రియ ప్రారంభమవుతుందని నిరూపించబడింది.

గర్భం యొక్క తుది దశలలో కూడా శృంగారం సురక్షితం అని గుర్తించడం చాలా అవసరం. ఇలా చేయడం వలన కడుపులో బిడ్డకు ఎటువంటిహాని కలగదు. కానీ, ఉమ్మనీరు బయటకు రావడం మొదలైన తర్వాత ఎటువంటి లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనరాదు. కొన్ని సందర్భాల్లో, ఇలా చేయడం వలన అంటురోగాలు సంక్రమించవచ్చు.

English summary

Natural ways to induce labor at home

Past the due date, it becomes really difficult for the mother to carry the child in her womb. In such cases, with the consultation of the doctor, one can induce labor at home. Acupuncture is one of the options as it facilitates the release of oxytocin in the body. Other ways to induce labor are acupressure, nipple stimulation, sex, etc.
Desktop Bottom Promotion