ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి? - కారణాలు, లక్షణాలు మరియు చికిత్స

Written By: Gayatri Devupalli
Subscribe to Boldsky

గర్భం ధరించడం మరియు ఒక కొత్త ప్రాణాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయడం అనేది ఒక గొప్ప దీవెన. అయినప్పటికీ అన్నిరకాల గర్భధారణలు ఆనందకరమైనవి కాలేవు. అటువంటి ఒక కఠిన వాస్తవం డాక్టర్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని తెలియజేసినపుడు మానకు ఎదురవుతుంది.

ఫలదీకరణ చెందిన అండం ఆరోగ్యవంతంగా ఎదగాలంటే గర్భసంచిలోనికి చేరుకున్నాక మాత్రమే సాధ్యమవుతుంది. కానీ ఒక్కోసారి అండం గర్భసంచి బయట ఎక్కడో ఒక దగ్గర జరుగుతుంది. ఇటువంటి స్థితినే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటారు. ఇటువంటి పరిస్థితి తలెత్తినప్పుడు చాలాసార్లు ఫలదీకరణ చెందిన అండం యొక్క ఎదుగుదల ఫెలోపియన్ ట్యూబ్లో జరుగుతుంది. ఈ తరహా గర్భాన్ని కొన్నిసార్లు ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటారు.

What Is An Ectopic Pregnancy - Signs, Symptoms & Treatment

అసలు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి?

ఫెలోపియన్ ట్యూబుల నిర్మాణం గర్భసంచి వలే అండం ఎదుగుదలకు అనువుగా ఉండదు. కనుక ఇటువంటి గర్భధారణకు తక్షణ వైద్య సహాయం మరియు చికిత్స అవసరం. ఈ పరిస్థితి అసాధారణమైనది ఏమి కాదు. ప్రతి 50 కేసుల్లో ఒకదానికి ఇలా జరుగుతుంది.

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి కారణాలు:

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఈ క్రింది కారణాల వలన కలిగే అవకాశం ఉంది.

1. ఫెలోపియన్ ట్యూబులకు ఇన్ఫెక్షన్ సోకడం లేదా వాపు కారణంగా మూసుకుపోవడం.

2. ఫెలోపియన్ ట్యూబులకు జరిగిన శస్త్రచికిత్సల మూలంగా అండం యొక్క కదలికలను నియంత్రించే అవకాశం ఉండటం.

3. ఇదివరకు ఫెలోపియన్ ట్యూబులలో కలిగిన ఇన్ఫెక్షన్ తొలగించడానికి పెట్టిన కోత వలన కొత్తగా పెరిగిన కణజాలం

అండం యొక్క కదలికలను అడ్డుకోవడం.

4. ఫెలోపియన్ ట్యూబులకు లేదా పెల్విక్ ప్రాంతం చుట్టుపక్కల శస్త్రచికిత్సలు చేయటం వలన అండం ట్యూబులకు అతుక్కొని ఉండటం.

5. జన్మతః ఫెలోపియన్ ట్యూబుల నిర్మాణంలో లోపాలు ఉండటం.

What Is An Ectopic Pregnancy - Signs, Symptoms & Treatment

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లక్షణాలు:

గర్భధారణ సమయంలో స్త్రీలలో కనిపించే సాధారణ లక్షణాలతో పాటుగా మన శరీరం కొన్ని ప్రత్యేక సూచనల ద్వారా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని తెలియజేస్తుంది. ఈ సూచనలు మీ అనుభవంలోకి వస్తే కనుక తప్పనిసరిగా వైద్యులను సంప్రదించండి

1. పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి పదునుగా పొడిచినట్టుగా వస్తూ పోతూ ఉంటే అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని తెలియజేస్తుంది. వచ్చిన ప్రతిసారి నొప్పి తీవ్రత తగ్గుతూ, పెరుగుతూ వచ్చి పోతూ ఉంటుంది. ఈ నొప్పి ముఖ్యంగా కటి మరియు పొత్తికడుపు ప్రాంతంలో కలుగుతుంది. అంతేకాక కొన్నిసార్లు భుజం మరియు మెడ ప్రదేశం వద్ద రావచ్చు. ఇలా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ విచ్చిన్నం అయ్యి రక్తస్రావం జరిగి డయాఫ్రమ్ వద్ద పెరుకున్నప్పుడు జరుగుతుంది.

2. సాధారణంగా వచ్చే నెలసరి కన్నా ఎక్కువగా లేదా తక్కువగా యోని ద్వారా రక్తస్రావం జరుగుతుంది.

3. ఆకస్మికంగా జీర్ణశయాంతర సమస్యలు సంభవించడం జరుగుతుంది.

4. ఎల్లప్పుడూ అలసిపోయినట్లు నీరసంగా అనిపించడం, పలుమార్లు కళ్ళు తిరగడం లేదా స్పృహ కోల్పోవడం జరుగుతుంది.

What Is An Ectopic Pregnancy - Signs, Symptoms & Treatment

పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం జరుగడాం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ నిర్ధారణ: మీరు వైద్యుని సంప్రదించినపుడు ఈ పైన తెలిపిన లక్షణాలలో ఏవి మీలో కనిపిస్తున్నాయి అతనికి పూర్తిగా వివరిస్తే, కొన్ని పరీక్షలు నిర్వహించి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని నిర్ధారణ చేస్తారు. ముందుగా ప్రాథమిక పెల్విక్ పరీక్షలు నిర్వహించి నొప్పి ఏ ప్రదేశంలో కలుగుతుందో గుర్తిస్తారు. అటు తర్వాత ప్రత్యేకంగా ఏ ప్రదేశంలో అయినా వాపు వంటివి ఉన్నాయేమో అని పరీక్షించి, తదనంతరం పొత్తికడుపు ప్రాంతంలో ఏదైనా కణజాలం ఉంటే కనిపెట్టడానికి ప్రత్యేక పరీక్షలు చేస్తారు.

స్కానింగ్ చేసి పెరుగుతున్న పిండం గర్భసంచి లో ఉందో లేదో నిర్ధారణ చేసుకుంటారు. HCG మరియు ప్రొజెస్టిరాన్ స్థాయిలు కొలుస్తారు. తక్కువగా ఉన్నట్లయితే అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి సంకేతం. అప్పుడు కుల్డోసెంటసీస్ అనే ప్రక్రియ చేపడతారు. ఈ ప్రక్రియలో యోని పై భాగంలోకి ఒక సూదిని చొప్పిస్తారు. ఈ ప్రదేశం గర్భసంచి వెనుక మరియు రెక్టమ్ కు ముందు వైపుగా ఉంటుంది. ఈ ప్రదేశంలో రక్తం ఉంటే, అది చిట్లిన ఫెలోపియన్ ట్యూబును సూచిస్తుంది.

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి చికిత్స:

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి చికిత్స ఈ క్రింది విధంగా చేస్తారు.

. గర్భధారణ తొలినాళ్లలో కనుక గుర్తించినట్లైతే మెథోట్రెక్సేట్ ఇచ్చి ఫెలోపియన్ ట్యూబుకు హానికలిగించకుండా చేస్తారు. గర్భధారణ కణజాలాన్ని శరీరం శోషించుకుంటుంది.

• కొందరిలో ఫెలోపియన్ ట్యూబులు అధికంగా సాగిపోవడం లేదా చిట్లిపోయి రక్తస్రావం కలుగజేస్తాయి. ఇటువంటి కేసులలో ఫెలోపియన్ ట్యూబును పాక్షికంగా లేదా పూర్తిగా తొలగించవలసి వస్తుంది. ఇటువంటి సమయంలో అత్యవసర శస్త్రచికిత్స అవసరమవుతుంది.

. లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స ద్వారా లాపరోస్కోప్ ను ఉపయోగించి వైద్యులు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని ఫెలోపియన్ ట్యూబల నుండి గర్భసంచిలోనికి ప్రవేశపెడతారు. సాధారణ అనస్థీషియా ఇచ్చి ఈ శస్త్రచికిత్స చేస్తారు. ఈ పద్ధతిలో ఫెలోపియన్ ట్యూబులను సరిచేయడం లేదా తొలగించడం కూడా చేస్తారు. ఒకవేళ లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స విఫలమైనట్లైతే కనుక లాపరోటమీ చేస్తారు.

. కొన్ని కేసులలో, ఎక్టోపిక్ గర్భధారణ ఒకసారి జరిగితే తరువాత సాధారణ గర్భధారణ జరిగే అవకాశాలు తగ్గిపోతాయి. అయినప్పటికీ మీ వైద్యునితో చర్చించి వారి సహాయంతో సంతానోత్పత్తి చికిత్స తీసుకుంటే సాధారణంగా గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయి.

English summary

What Is An Ectopic Pregnancy - Signs, Symptoms & Treatment

The ideal place for a fertilized egg to attach itself is inside the uterus. However, if it attaches itself somewhere outside the uterus, then this form of a pregnancy is referred to as an ectopic pregnancy. Most of the pregnancies of this kind are the ones where the fertilized egg attaches itself to the fallopian tube, thus this type of pregnancy is also sometimes known as a tubal pregnancy.
Story first published: Saturday, April 28, 2018, 11:30 [IST]