Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
జెనిటల్ హెర్పిస్ సమస్యగల మహిళలకు సుఖప్రసవం అయ్యే అవకాశం ఉంటుందా ?
సరైన సెక్స్ ఎడ్యుకేషన్ లేని కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశం అయినా, లైంగిక సంక్రమణ వ్యాధుల (STD) వ్యాప్తిని అరికట్టలేని స్థితిలో ఉందన్నది వాస్తవం. క్లమేడియా మరియు గనేరియా వంటి లైంగిక సంక్రమణ వ్యాధులు, అందరికీ తెలిసిన సాధారణ గర్భధారణ సమయంలో కనిపించే ఇన్ఫెక్షన్లుగా ఉంటాయి. క్రమంగా వీటికారణంగా అనేకమంది మహిళలు, గర్భధారణకు కూడా నోచుకోలేని పరిస్థితులకు గురవుతుంటారు.
అత్యంత ఘోరమైన విషయం ఏమిటంటే, చికిత్స చేయగల కొన్ని లైంగిక సంక్రమణ వ్యాధులు, కొన్ని అసాధారణ సమయాలలో, ప్రధానంగా గర్భధారణ సమయంలో అధ్వానమైన స్థితిలో తిరిగి వస్తుంటాయి. జెనిటల్ హెర్పిస్ అనేది కూడా అటువంటి సాధారణమైన పరిస్థితిని సూచిస్తుంటుంది. ఇది గర్భధారణ మరియు లేబర్ (ప్రసవం) వంటి అంశాల మీద కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఈ లైంగిక సంక్రమణ వ్యాధి మరియు దాని ప్రభావాల గురించి, తల్లి మరియు బిడ్డ ఎదుర్కునే పరిస్థితుల గురించిన సమగ్ర సమాచారం గురించిన మరిన్ని వివరాలకు వ్యాసంలో ముందుకు సాగండి.

అసలేమిటీ జెనిటల్ హెర్పిస్ :
ఈ జెనిటల్ హెర్పిస్ జననేంద్రియాల వద్ద తలెత్తే అత్యంత సాధారణ రకానికి చెందిన లైంగిక సమస్య. ఇది హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ లేదా HSV-2 వలన కలిగే ఒక సాధారణ లైంగిక సంక్రమణ వ్యాధిగా నివేదించబడుతుంది. ఈ సంక్రమణ ప్రభావిత ప్రాంతంలో హెర్పెటిక్ పుళ్ళు అత్యంత తీవ్ర పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతుంటాయి. ఈ పుండ్ల నుండి తరచుగా చీముతో నిండుకుని, ద్రవం కారుతూ ఉంటాయి.
HSV-2 వైరస్ మ్యూకస్ పొర ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది, మరియు సాధారణంగా ఇది నోరు, ముక్కు మరియు జననాంగం వంటి ప్రాంతాలలో బొబ్బలకు కారణంగా మారుతుంది. ఇవి లాలాజలం, శ్లేష్మం, వీర్యం లేదా జననేంద్రియాల స్రావం వంటి శరీర ద్రవాలలో ఇన్ఫెక్షన్ చేరేందుకు కారణమవుతుంది.
జెనిటల్ హెర్పిస్ యొక్క ప్రధాన లక్షణంగా, జననేంద్రియ అవయవాల మీద చీము నిండిన బొబ్బల రూపాన్ని కలిగి, తరచుగా చీము కారుతూ ఉంటుంది. ఓరల్ సెక్స్ ద్వారా సంక్రమించిన పరిస్థితులలో ముక్కు మరియు నోరు భాగాలలో కూడా ఈ విధంగా కనపడవచ్చు,
జెనిటల్ హెర్పిస్, గర్భధారణ ప్రక్రియ మరియు నవజాత శిశువుల మీద ఏవిధంగా ప్రభావం చూపుతుంది ?
ఏది ఏమైనప్పటికీ, జననేంద్రియ హెర్పిస్ చాలా సర్వసాధారణమైన విషయం. 10,000 మంది శిశువులలో కేవలం ఒకరు మాత్రమే దీని బారిన పడుతున్నారని అధ్యయనాలు సూచిస్తున్నాయి. శిశువులకు సంక్రమణ సోకకుండా, మరియు ప్రభావితమైన ఎడల, లక్షణాలను నిర్వహించడానికి సకాలంలో చికిత్స చేసేందుకు అనేక మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి. క్రమంగా ఇది పెద్ద సమస్యగా మారబోదని అధ్యనాలు చెప్తున్నా, వైద్యులు మాత్రం శిశువులు వారి తల్లి నుండి సంక్రమణకు గురైతే మాత్రం, తీవ్ర పరిణామాలను ఎదుర్కొనవలసి ఉంటుందని ఆందోళన వ్యక్తపరుస్తున్నారు.
బిడ్డ వ్యాధిని పొందలేదు అని నిర్ధారించుకోడానికి ముందు అనేక అంశాలను పరిగణనలోనికి తీసుకోవలసి ఉంటుంది. ముందుగా ఏ దశలో తల్లి ఇన్ఫెక్షన్ బారిన పడిందో నిర్ధారించడం ముఖ్యం. గర్భధారణ సమయంలో సంక్రామ్యతలు ముందస్తుగా జరిగినట్లయితే, బిడ్డకు వ్యాప్తి చెందకుండా తల్లి సురక్షిత చర్యలు తీసుకోవచ్చునని చెప్పబడుతుంది.
అయితే, నవజాత శిశువులలో రోగ నిరోధక శక్తి తక్కువగాఉన్న నేపధ్యంలో, ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం అధికంగా ఉన్న కారణాన, మూడవ త్రైమాసికంలో తల్లికి ఇన్ఫెక్షన్ సోకితే, అది తీవ్ర ఆందోళనలకు దారితీస్తుంది. అటువంటి సందర్భాల్లో, సాధారణ డెలివరీ కూడా సిఫారసు చేయబడదు.
తల్లి గర్భం దాల్చడానికి ముందు హెర్పిస్ కలిగి ఉంటే, ఆ తల్లి శరీరం ఇన్ఫెక్షన్తో పోరాడటానికి అవసరమైన ప్రతిరోధకాలను ఉత్పత్తి చేసి, ఈ సామర్థ్యాన్ని శిశువు మీద కూడా ప్రసరింపచేసే అవకాశాలు ఉన్నాయి. అయితే, గర్భధారణ యొక్క మూడవ త్రైమాసికంలో వ్యాధి సోకితే మాత్రం, బిడ్డకు ఇన్ఫెక్షన్ కలుగజేసే ప్రమాదంతో పోరాడగల యాంటీబాడీస్ ఉత్పత్తి చేయడానికి తగినంత సమయం లేని కారణాన, శిశువుకు కూడా జెనిటల్ హెర్పస్ సోకే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. .
నవజాత శిశువుల యొక్క నియోనటాల్ హెర్పిస్ వలన అంధత్వం, మెదడు దెబ్బతినడం లేదా మరణం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

జననేంద్రియాల హెర్పిస్ ఉంటే సుఖ ప్రసవం సాధ్యమేనా?
తల్లి జెనిటల్ హెర్పిస్ సమస్యతో ప్రభావితమై ఉంటే కూడా సుఖ ప్రసవం సాధ్యమవుతుంది, ఉదాహరణకు ...
సంక్రమణ సూచనలు తక్కువగా ఉన్న పక్షంలో, అనగా దురద, చీము కారడం మొదలైన క్రియాత్మక ఇన్ఫెక్షన్ సూచనలను చూపించని పక్షంలో జెనిటల్ హెర్పిస్ గురైన తల్లికి కూడా సుఖ ప్రసవం చేయడం సురక్షితమైనదిగానే చెప్పబడుతుంది.
ఇన్ఫెక్షన్ సంబంధిత వైద్యులు ( చర్మ రోగ నిపుణులు), తల్లి లక్షణాలను సకాలంలో గుర్తించి చురుకుగా వ్యవహరించిన పక్షంలో, కొన్ని జాగ్రత్తలతో సుఖ ప్రసవానికి పూనుకోవచ్చు.

శిశువుకు చనుబాలను అందించవచ్చా?
మీ రొమ్ముల మీద, లేదా దాని దగ్గరల్లో ఏవైనా హెర్పిస్ పుండ్లు కనిపించని పక్షంలో, జెనిటల్ హెర్పిస్ ఉన్నా కూడా మీ బిడ్డకు చనుబాలను అందించటం పూర్తిగా సురక్షితమని చెప్పబడుతుంది. పుండ్లు ప్రధానంగా మమ్మరీ గ్రంధుల (రొమ్ము భాగం) దగ్గర వ్యాపిస్తుంటాయి. కేవలం ఇటువంటి సందర్భంలో మాత్రమే, మీ బిడ్డకు స్తన్యం ఇవ్వడం సరికాదని చెప్పబడుతుంది.
జెనిటల్ హెర్పిస్ గురించిన అవగాహన లేకుండా, మీరు తరచుగా చీము కలిగిన పుండ్లను కనుగొంటున్న ఎడల, తక్షణమే వైద్యుని సంప్రదించడం ఎంతో ఉత్తమంగా సూచించబడుతుంది.

జెనిటల్ హెర్పిస్ కొరకు ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి ?
దురదృష్టవశాత్తు, ఈ జెనిటల్ హెర్పిస్ సమస్యని పూర్తిగా నయం కాని వ్యాధిగా చెప్పబడుతుంది. వైరస్ పూర్తిగా శరీరం నుండి తొలగిపోవడం జరుగదు. మరియు జీవితంలో ఏసమయంలో అయినా తిరిగి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. క్రమంగా మీ వైద్యుడు కొన్ని యాంటీ వైరల్ ఔషధాలను సిఫారసు చేయవచ్చు, ఇవి రోగ లక్షణాలను నిర్వహించడంలో సహాయపడవచ్చు.
ఒకవేళ మీరు గర్భధారణకు ముందెప్పుడైనా హెర్పిస్ బారిన పడి ఉండి, గర్భధారణ సమయంలో ఎటువంటి సంకేతాలను గమనించకపోయినా కూడా, మీ దేహం మీ బిడ్డకు ఇన్ఫెక్షన్ కలిగించే అవకాశం ఉంది. .
ఒకవేళ మీరు ఇదివరకే హెర్పిస్ బారిన పడి ఉంటే, ఈ విషయం గురించి మీ వైద్యునికి ఖచ్చితంగా తెలియజేయవలసిన అవసరం ఉంది. క్రమంగా మీ నవజాత శిశువుకు, లేదా మీకు ఎటువంటి సంక్లిష్టతలు కలుగకుండా, సమస్యలను నిరోధించడానికి సహాయపడవచ్చు. మీరు వైద్యుని దగ్గర ఇటువంటి విషయాలలో సిగ్గు, బిడియం ప్రదర్శిస్తే, అది ఖచ్చితంగా మీ శిశువు పట్ల మీరు చేసిన భయంకర తప్పిదమే అవుతుంది. మీ వైద్యునికి ముందస్తుగా మీ సంక్రామ్యతల గురించిన వివరాలను తెలియజేసిన పక్షంలో, జెనిటల్ హెర్పిస్ సమస్యని తేలికగా నిర్వహించవచ్చునని చెప్పబడుతుంది.

హెర్పిస్ రాకుండా ఉండేందుకు సూచనలు :
వాస్తవానికి హెర్పిస్ సంక్రమణ వ్యాధిగా చెప్పబడుతుంది. కావున, లైంగిక భాగస్వామికి హెర్పిస్ సమస్య ఉన్న పక్షంలో, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమంగా సూచించబడుతుంది. ఉదాహరణకు కండోం వినియోగించడం, ఓరల్ సెక్స్ దూరంగా ఉండడం వంటివి. వ్యాధి కలిగిన తర్వాత భాదపడేకన్నా, ముందస్తు జాగ్రత్తలతో సంక్రమణలు కలుగకుండా జాగ్రత్తపడవచ్చు. అంతేకాకుండా, కొన్ని అపరిచిత లైంగిక సంబంధాలు కూడా ఇటువంటి సమస్యకు కారణం కావొచ్చు. కావున, ఎప్పటికప్పుడు వైద్యుని సంప్రదించి సరైన పరీక్షలు నిర్వహించుకోవడం ద్వారా, కొన్ని సమస్యలకు ఆదిలోనే చెక్ పెట్టవచ్చు. లేదా, మీనుండి ఇతరులకు వ్యాధులను అంటించడానికి ఆస్కారాలు లేకపోలేదు. కావున జాగ్రత్త తప్పనిసరి.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications











