For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలతో ఇలాంటి విషయాలను ఎట్టి పరిస్థితిలో చర్చించకూడదు

గర్భిణీ స్త్రీలతో ఇలాంటి విషయాలను ఎట్టి పరిస్థితిలో చర్చించకూడదు

|

మాతృత్వంతో స్త్రీ పరిపూర్ణత్వం సొంతం చేసుకుంటుంది. గర్భంలో మరొక జీవితానికి జన్మనిచ్చే ప్రక్రియ ఈ భావనను వర్ణించడానికి కూడా సాద్యం కాదు. తల్లిగా ఉండటం వల్ల ఆమెను సమాజాన్ని చూసే విధానం భిన్నంగా ఉంటుంది. ఆమె తన ఆరోగ్యం మరియు డిమాండ్ల గురించి పట్టించుకుంటారు. కడుపులో పెరిగే బిడ్డ కొరకు ఆమెకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టిస్తారు మరియు వారి ఆనందానికి ప్రాముఖ్యత ఇస్తారు.

అయితే కొంత మంది గర్భిణీ స్త్రీలు ఎలాంటి విషయాల గురించి చర్చించకూడదు. దాని గురించి సాధారణ సమాచారం లేకుండా, కొంతమంది వారి ఆరోగ్యాన్ని లేదా మనస్సును ప్రభావితం చేసే సమస్యల గురించి చర్చిస్తారు.

గర్భిణీ స్త్రీలతో ఎలాంటి విషయాలు చర్చించ కూడదు, ఎలాంటి విషయాలు వారి మనస్సును, ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందో మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..

బరువు గురించి అసమంజసమైన ప్రశ్న

బరువు గురించి అసమంజసమైన ప్రశ్న

మీరు గర్భవతిగానే కబడుటలేదు, చాలా సన్నగా ఉన్నారు, చాలా లావుగా ఉన్నారు. ప్రసవం సమయంలో కష్టం అవ్వొచ్చు. బిడ్డ పుట్టడానికి ఇంకా ఎన్ని వారాలున్నాయి, ఇప్పుడు పొట్ట ఇంత పెద్దగా పెరిగిందే? ఇటువంటి మాటలను వారి ముందు ఎట్టి పరిస్థితిలో మాట్లాడకూడదు. వారి ఆరోగ్యం గురించి వైద్యులు మరియు కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఇటువంటి ప్రశ్నలు గర్భిని ప్రారంభ దశలో లేదా ప్రసవ సమయంలో వారిని ఆందోళనకు గురి చేస్తుంది. వారి మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది.

కడుపు భాగాన్ని తాకడం

కడుపు భాగాన్ని తాకడం

గర్భిణీ పొట్ట (బేబీ బంప్) మ్యాంగ్నెట్ లాగా అందరినీ ఆకర్షిస్తుంది. కొంతమందికి చూసిన వెంటనే పొట్టను తాకాలని అనిపిస్తుంటుంది. అయితే అలా గర్బిణి స్త్రీ , ఇంట్లో వారే కావచ్చు చూసిన వారంత పొట్టను తాకాలనుకోవడం వల్ల గర్భణి స్త్రీకి చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. ఆమె చాలా అసౌకర్యానికి గురి అవుతుంది. వారి పొట్టను నేరుగా తాడం వల్ల వారికి చాలా అసౌకర్యం అని తెలుసుకోండి. పదే పదే ఇలా చేయడం వల్ల కూడా వారి మానసిక ఆరోగ్యంపై మళ్లీ ప్రభావితం చేస్తుంది.

అనవసరమైన సలహాలు, ప్రశ్నలు

అనవసరమైన సలహాలు, ప్రశ్నలు

గర్భిణీ అంటే చాలు ఇంట్లో వారితో పాటు స్నేహితులు, బంధువులు కనిపించిన వారంతా ఉచిత సలహాలిచ్చే వారే. ఇలా ఉంటే ఆడపిల్ల, అలా ఉంటే మగపిల్లాడు, ఇలాంటి ఆహారం తీసుకోవాలి, బిడ్డ పుట్టిన తర్వాత జాబ్ చేస్తారా? బిడ్డకు ఎన్ని నెలలు పాలు పడుతారు? ఇటువంటి ప్రశ్నలు నిజంగా గర్భిణీ స్త్రీలకు ఇష్టం ఉండదు. కొన్ని సందర్భాల్లో ఏం సమాధానం చెప్పాలో అని గందరగోళంకు గురి అవుతారు. వీలలైనంతవరకు అటువంటి వారికి దూరంగా ఉండండి, లేకపోతే మాటలు మార్చండి మరియు సానుకూల సమాధానాలతో స్పందించండి.

ఇతర చేదు సంఘటనల గురించి

ఇతర చేదు సంఘటనల గురించి

ప్రసవ సమంయలో పడే వేదనలు, ప్రసవ సమయంలో చాలా కష్టం, నా అనుభం ఇలా ఉంటుంది. అలా ఉంటుంది, నొప్పి భాదిస్తుంది, శస్త్రచికిత్స గురించి విషయాలు సాధ్యమైనంత నిద్ర, ముందు ముందు ఎక్కువ నిద్రించడానికి సాధ్యపడదు అటువంటి సలహాలు, హెచ్చరికలు గర్భిస్త్రీలకు చెప్పకూడదు. సానుకూల విషయాలపై దృష్టి పెట్టండి మరియు బిడ్డకు జన్మ నివ్వడంలో ఎంత నొప్పి అయినా మరిచిపోవచ్చు అనే విషయాన్ని గుర్తించుకోండి

మీ స్వంత సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టించుకోండి

మీ స్వంత సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టించుకోండి

మీరు గర్భంతో తల్లి కాబోతున్నారన్న అద్భుతమైన అనుభూతిని అనుభవిస్తున్నాట్లైతే, మీ అంతట మీరు స్వంత సానుకూల ప్రపంచాన్ని సృష్టించుకోండి. మీ చుట్టుపక్కల ఇష్టమైన, మీ మనస్సుకు నచ్చిన విషయాలు, ప్రసవంకు అవసరమైన వస్తువులను సేకరించి, అమర్చుకోవడం మొదలు పెట్టండి. అనసవరమైన అలోచనలు, విషయాలను మనస్సులో నుండి తొలగించండి. మంచి సంగీతం వినడం, మంచి పుస్తకాలు చదవడం, మంచి ప్రదేశాలను సందర్శించడం చేయండి.

English summary

Never Discuss These Things With Pregnant Woman

When you’re pregnant, it can sometimes feel like everyone has an opinion on your body. Here are some of the most annoying thing every pregnant woman face, waht she really neglect and what not to disucuss with pregnant woman.
Desktop Bottom Promotion