Latest Updates
-
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి!
Pregnancy Glow: ప్రెగ్నెన్సీ సమయంలో ముఖం వెలిగిపోతుంది.. ఫేస్ గ్లోకు కారణం ఏంటో తెలుసా?
తల్లి కావడం అనేది ప్రతి మహిళకు గొప్ప సమయం. గర్భిణీ అని తెలిసిన సమయం నుండి ఎన్నో ఆశలు, కోరికలతో తల్లయ్యే మధుర క్షణం కోసం ఎదురుచూస్తుంటారు. ఈ 9 నెలల సమయంలో ఎన్నో అంశాలు ఎదురవుతుంటాయి. అందులో కొన్ని ఇబ్బంది పెడితే, మరికొన్ని ఆనందాన్ని ఇస్తాయి. బ్యాక్ పెయిన్, కాళ్ల నొప్పులు లాంటి ఇబ్బంది పెడితే.. బుజ్జాయి కదిలే స్పర్శ తెలియడం, ముఖం వెలిగిపోవడం లాంటివి ఆనందాన్నిస్తాయి.
గర్భం ధరించిన కొన్ని నెలల తర్వాత చాలా మంది ముఖం వెలిగిపోవడం గమనించే ఉంటారు. ఎప్పుడూ లేనంతగా ముఖం కలగా మారుతుంది. కాంతివంతంగా కనిపిస్తుంది. దీనినే ప్రెగ్నెన్సీ గ్లో గా పిలుస్తుంటారు. అసలు ప్రెగ్నెన్సీ సమయంలో ముఖం వెలిగిపోవడం నిజమేనా, ఇలా ఎందుకు అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రెగ్నెన్సీ గ్లో అంటే ఏంటి?
ప్రెగ్నెన్సీ గ్లో అంటే ప్రెగ్నెన్సీ సమయంలో ముఖం కాంతివంతంగా కనిపించడం. చాలా మంది గర్భిణీల ముఖం ఆ సమయంలో వెలిగిపోతుంది. హార్మోన్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు, రక్త ప్రవాహం పెరగడం లాంటి కారణాలతో ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.
ప్రెగ్నెన్సీ గ్లోకి కారణాలేంటి?
గర్భాధారణ సమయంలో కలిగే పరిపూర్ణమైన ఆనందం వల్ల ముఖం వెలిగిపోతుందని చాలా మంది నమ్ముతుంటారు. అలాగే ఇతర కారణాలు ఏంటంటే..
* హార్మోన్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు
* రక్త ప్రసరణ పెరగడం
* చర్మంలో నూనె స్థాయి పెరగడం
* చర్మం సాగదీతకు గురవ్వడం
* హీట్ ర్యాషెస్ రావడం
గర్భిణీలందరిలో ప్రెగ్నెన్సీ గ్లో కనిపిస్తుందా?
ఇది వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది. అలాగే వారిలో హార్మోన్ స్థాయిలను బట్టి ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. కొందరు సాధారణంగానే కనిపిస్తారు. మరికొందరిలో మాత్రం ముఖం వెలిగిపోతుంది.
చాలా మంది గర్భిణీలు ఎదుర్కొనే చర్మ సమస్యలు:
1. మొటిమలు:
చాలా మందిని ఈ సమస్య బాధిస్తుంది. మొటిమలు, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, ఇన్‌ఫ్లమేషన్ కు గురికావడం వల్ల చర్మం ఎర్రగా మారుతుంది. మహిళల శరీరంలో ఆండ్రోజెన్స్ హార్మోన్స్ అధికం కావడం వల్ల సెబాసియస్ గ్రంథులు పెరుగుతాయి. దాంతో ఎక్కువ సెబమ్ విడుదల అవుతుంది. ఈ సెబమ్ చర్మ మృత కణాల్లో చేరి మొటిమలకు దారి తీస్తుంది.
2. హీట్ రాషెస్:
ప్రిక్లీ హీట్ వల్ల హీట్ రాషెస్ వస్తాయి. బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల కూడా హీట్ పెరుగుతుంది. హీట్ వల్ల అసౌకర్యం, దురద కలుగుతుంది. వేడి వల్ల చర్మంపై రాషెస్ వస్తాయి.
3. దురద:
ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గడం వల్ల చర్మంపై దురద వస్తుంది. ఎక్కువగా చేతులు, చర్మం మీద దురద ఎక్కువగా ఉంటుంది. డెర్మటైటిస్ వల్ల దురద వస్తుంది.
4. మెలనోమా:
దీన్ని మాస్క్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటారు. చర్మం గ్రే కలర్ లో బ్రౌన్ ప్యాచెస్ లా డార్క్ గా మారుతుంది. ఫోర్ హెడ్, బుగ్గలు, గడ్డం మీద చర్మం డార్క్ గా మారుతుంది. హార్మోన్ల మార్పులు వల్ల ఈ మెలనోమా వస్తుంది.



Click it and Unblock the Notifications
