Latest Updates
-
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు!
10 నిముషాల్లో పర్ఫెక్ట్ పన్నీర్ బిర్యానీ టేస్టీగా..ఈజీగా ఇలా తయారుచేసేసుకోండి
పన్నీర్ బిర్యానీకి పరిచయం అవసరం లేదు మరియు భారతీయులు ఇష్టపడే అత్యంత ప్రజాదరణ పొందిన వంటకం. ఇది వేడుకల వంటకం అయినప్పటికీ, సాధారణంగా సందర్భాల కోసం తయారు చేయబడినప్పటికీ, భారతదేశంలోని ప్రతి స్ట్రీట్ లో బిర్యానీ కార్నర్‌లు పెరగడంతో, దీనిని తరచుగా తిని ఆనందిస్తారు. సాంప్రదాయకంగా బిర్యానీని మాంసంతో తయారు చేస్తారు మరియు ఇటీవలి దశాబ్దాలలో వెజిటేరియన్ బిర్యానీ శాకాహార భారతీయులలో ప్రసిద్ధి చెందింది. ఇటీవలి సంవత్సరాలలో పనీర్ బిర్యానీ దాని దృష్టిని ఆకర్షించింది మరియు భారతదేశంలోని కొన్ని ఉత్తమ బిర్యానీ ప్రదేశాలలో మీరు అత్యంత అద్భుతమైన వంటకాన్ని రుచి చూడాలి అంటే అది వెజిటేరియన్ పనీర్ బిర్యానీ . ఒకసారి చుచి చూసారంటే అద్భుతమైన రుచిని ఆశ్వాదించి ఆశ్చర్యపోతారు.
బిర్యానీ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే వంటకం. ఇది మీ రోజువారీ భోజనం కోసం మీరు సిద్ధం చేయగల భోజనం. మీరు ఇందులో వివిధ కూరగాయలను ఉపయోగించవచ్చు, కానీ ఇక్కడ పనీర్‌ను మాత్రమే ఉపయోగించడం జరిగింది. పనీర్‌లో చాలా ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది, కాబట్టి మీరు దీన్ని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. రాత్రి భోజనంలో బూందీ రైతా మరియు పాపడ్‌తో పనీర్ బిర్యానీ రిసిపిని సర్వ్ చేయండి. మీరు మీ ఇంటి పార్టీల కోసం కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు.
నెయ్యిలో వేయించిన పనీర్ క్యూబ్స్ మరియు బాస్మతి రైస్‌తో తయారు చేయబడిన సులభమైన మరియు సరళమైన దమ్ స్టైల్ బిర్యానీ వంటకం. మాంసం తినని వారికి లేదా పనీర్ ప్రియులకు ఇది సరైన శాఖాహార బిర్యానీ ఎంపిక. ఈ వంటకం తయారు చేయడం సులభం మరియు మధ్యాహ్నం లంచ్ బాక్స్ లేదా అర్థరాత్రి వారాంతపు విందు కోసం సులభంగా వడ్డించవచ్చు. మరి ఈ వంటకు కావల్సిన పదార్థాలు, ఏవిధంగా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావాల్సినపదార్థాలు:
పన్నీర్ 200(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
బాస్మతి రైస్ 2 గ్లాసులు
నూనె 2 టేబుల్ స్పూన్లు
నెయ్యి 2 టేబుల్ స్పూన్లు
షాజీర 1/4 టీస్పూన్
ఏలకలు 2
లవంగాల 4
దాల్చిన చెక్క చిన్న ముక్క
స్టార్ ఈనీస్ పువ్వు 1
బిర్యానీ ఆకు
జీడిపప్పులు 5
పచ్చిమిర్చి 5
ఉల్లిపాయ 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
టమోటోలు 2 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
కొత్తిమీర 1/2 కప్పు(సన్నగా తరిగినవి)
పుదీనా 1/2 కప్పు(సన్నగా తరిగినవి)
జాపత్రి కొద్దిగా
పసుపు పొడి 1/4టీస్పూన్
కారం పొడి 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్
ఉప్పు రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి, పన్నీర్ ముక్కలు వేసి బాగా బ్రౌన్
కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ఫ్రై అయ్యేటప్పుడు చిటికెడు
ఉప్పు, కారం, పసుప వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద కుక్కర్ పెట్టి అందులోరెండు టేబుల్ స్పూన్ నూనె, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా వేడి అవ్వనివ్వాలి.
3. వేడెక్కిన నూనెలో 1/4 టీస్పూన్ షాజీర, 2 ఏలకలు, 4 లవంగాలు, 1 చిన్న ముక్కు దాల్చిన చెక్క , 1 స్టార్ ఆనీస్ పువ్వు, కొద్దిగా జాపత్రి, కొద్దిగా ఉప్పు వేయాలి.
4. అలాగే కొద్దిగా బిర్యానీ ఆకు , 5 జీడిపప్పు, 5 పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగనివ్వాలి.
5. అందులోనే టమోటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టి, కొత్తిమీర, పుదీనా తరుగు వేసి మీడియం మంట మీదా బాగా వేగించాలి.
6. అవి వేగుతుండగాలనే అందులోనే కారం పొడి, పసుపుపొడి, దనియాల పొడి, గరం మసాలా వేసి మొత్తం మిశ్రమాన్ని రెండు నిము వేగించాలి.
7. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ను పూర్తిగా నీరు వంపేసి వేయాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి, బియ్యం కూడా ఒక నిముషం పాటు వేగనివ్వండి.
8. రెండు నిముషాల తర్వాత రెండున్నర గ్లాస్ నీళ్ళు పోయాలి. ఒక గ్లాసు బాస్మతి రైస్ కు ఒకటింపావ్ గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. అలాగే మరికొద్దిగా కొత్తిమీర కూడా చిలకరించుకోవాలి.
9. మొత్తం మిశ్రాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా వేగించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేయాలి. మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలిపి మూత పెట్టి, మీడియం మంట మీద ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతే స్టౌ ఆఫ్ చేసి, ఆవిరి తగ్గిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి వేడి వేడిగా పెరుగు రైతాతో సర్వ్ చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications













