Latest Updates
-
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.!
రెగ్యులర్ పాలకోవా బోర్ కొట్టిందా? అయితే 10 రెట్లు టేస్టీగా ఉండే కల్తీ పాలకోవా ట్రై చేయండి!
పాలకోవా అనగానే మనందరికీ నోట్లో నీళ్లు ఊరుతాయి. దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పండుగలకు, శుభకార్యాలకు దేవుడికి ఎక్కువగా చేసుకునే సంప్రదాయ స్వీట్లలో ఇది ఒకటి. కేవలం రెండు, మూడు పదార్థాలతో మన ఇంట్లోనే ఎంతో స్వచ్ఛంగా, ఆరోగ్యకరంగా పాలకోవాను తయారు చేసుకోవచ్చు.
అయితే పాలకోవాకి కొంచెం బాదం ప్లేవర్ టచ్ ఇచ్చి తయారుచేసుకుంటే రుచి అదిరిపోతుంది. దీని టేస్ట్ రెగ్యులర్ పాలకోవా కంటే 10రెట్లు ఎక్కువగా ఉంటుంది. నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. టేస్ట్ లో కానీ, టెక్చర్ లో కానీ రెగ్యులర్ పాలకోవాకి ఏ మాత్రం తీసిపోని విధంగా,అంతకంటే ఎక్కువ టేస్టీగా ఉండే బాదం ప్లేవర్ పాలకోవా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

బాదం ప్లేవర్ పాలకోవా తయారీకి కావాల్సిన పదార్ధాలు
-పాలు
-బాదంపప్పులు
-మిల్క్ మెయిడ్
-యాలకలు
-నెయ్యి
-కుంకుమ పువ్వు
-నిమ్మరసం
బాదం ప్లేవర్ పాలకోవా తయారీ విధానం
-ముందుగా 250 గ్రాముల బాదంపప్పుని కనీసం 8 గంటల సేపు నానబెట్టుకోవాలి.
-తర్వాత పాలకోవా చేయడానికి మందపాటి అడుగు ఉన్న ఒక పెద్ద కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. వెడల్పాటి పాత్ర అయితే పాలు త్వరగా ఇగిరిపోతాయి. అడుగు మందంగా ఉంటే పాలు త్వరగా మాడిపోవు. కడాయిలో 1 లీటర్ పాలు పోసి మీడియం మంట మీద మరగించాలి.
-పాలు మరుగుతున్నప్పుడు పాత్ర అంచుల వెంబడి మీగడ పేరుకుపోతూ ఉంటుంది. గరిటెతో ఆ అంచులను గీకి, మీగడను మళ్లీ పాలలోనే కలుపుతూ ఉండాలి. పాలు పొంగకుండా, అడుగు అంటకుండా నిరంతరం కలుపుతూనే ఉండాలి. పాలు సగానికి పైగా ఇగిరిపోయి చిక్కబడటానికి కనీసం 30 నుండి 40 నిమిషాల సమయం పడుతుంది.
-పాలు మరిగేలోగా నానబెట్టిన బాదంపప్పు పొట్టు తీసేయండి. మిక్సీ జార్ లో పొట్టు తీసేసిన బాదంపప్పులు వేసి,ఇందులోనే 2 యాలకలు,కొద్దిగా నీళ్లు కూడా పోసుకొని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు పాలు బాగా మరిగి సగం అయిన తర్వాత అందులో నాలుగు చుక్కల నిమ్మరసం పిండుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న బాదం పేస్ట్ వేసి కలిపాక ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల మిల్క్ మెయిడ్ వేసి కలుపుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసి 10 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి.
-మిశ్రమం కడాయి అంచుల నుంచి విడిపోవడం ప్రారంభమైనప్పుడు అందులో కొద్దిగా కుంకుమపువ్వు చల్లుకొని కలుపుకోవాలి. ఇది పాలకోవాకు సహజమైన రంగును, అద్భుతమైన రుచిని ఇస్తుంది. కోవా ముద్దలా మారుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
