Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మీ బ్రేక్ ఫాస్ట్ కి కొత్త రుచి..కమ్మనైన దోసకాయ ఇడ్లీ..ఎలా చేసుకోవాలంటే
పొద్దున్నే టిఫిన్ అనగానే మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఇడ్లీ. మృదువుగా, తేలికగా ఉండటంతో ఇది అందరి ఆదరణ పొందింది. అయితే రోజూ తినే మామూలు ఇడ్లీకి బదులుగా కాస్త కొత్తదనం కోరుకుంటున్నారా? కూరగాయల మేళవింపుతో ఆరోగ్యాన్ని, అద్భుతమైన రుచిని అందించే అల్పాహారం కోసం చూస్తున్నారా? అయితే మీరు తప్పక ప్రయత్నించాల్సిన వంటకం దోసకాయ ఇడ్లీ.
దక్షిణ భారతదేశ వంటకాల్లో ఇడ్లీకి ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. అలాంటి ఓ వినూత్నమైన, రుచికరమైన ప్రయోగమే ఈ దోసకాయ ఇడ్లీ. వీటిపై కాస్త నెయ్యి వేసుకుని, మీకు నచ్చిన చట్నీతో తింటుంటే ఆ రుచే వేరు. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపించేంత అద్భుతంగా ఉంటుంది. దీని తయారీ చాలా సులభం, కానీ రుచి మాత్రం అమోఘం. ఈ నోరూరించే దోసకాయ ఇడ్లీని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

దోసకాయ ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-దోసకాయ తురుము - 1 కప్పు
-ఇడ్లీ రవ్వ - అర కప్పు
-పచ్చి కొబ్బరి తురుము - ముప్పావు కప్పు
-పచ్చిమిర్చి - 2- 3
-కొత్తిమీర - కొద్దిగా
-ఉప్పు - రుచికి సరిపడా
-నూనె - ఇడ్లీ ప్లేట్లకు రాయడానికి
దోసకాయ ఇడ్లీ తయారీ విధానం
-ముందుగా దోసకాయను శుభ్రంగా కడిగి, చెక్కు తీసి, గింజలు లేకుండా తురుముకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పు దోసకాయ తురుము, అర కప్పు ఇడ్లీ రవ్వ వేసి బాగా కలపాలి. చేత్తోనే కలపడం వల్ల దోసకాయలోని సహజమైన నీరు రవ్వకు బాగా పడుతుంది.
-ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి తురుము, పచ్చిమిర్చి వేసి నీళ్లు పోయకుండా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి.
-ఈ కొబ్బరి మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న దోసకాయ-రవ్వ మిశ్రమంలో వేయాలి. దీనికి తరిగిన కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు కూడా జతచేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి.
-పిండి మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు కలపండి. ఒకవేళ జారుగా అయితే మరికొంత ఇడ్లీ రవ్వ వేసి సర్దుబాటు చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఓ 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. దీనివల్ల రవ్వ బాగా నాని ఇడ్లీలు మెత్తగా వస్తాయి.
-ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె రాసి సిద్ధం చేసుకున్న పిండిని వాటిలో వేయాలి. ఇడ్లీ కుక్కర్ లో పెట్టి ఆవిరి మీద 10-12 నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలు. అంతే వేడివేడి, కమ్మనైన దోసకాయ ఇడ్లీలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications