Latest Updates
-
గర్భస్రావం తర్వాత సంతాన సామర్థ్యం పెరుగుతుందా.. ఇందులో నిజమెంత.? -
జూన్ 24న శివ యోగం: ఈ సమయం నుంచి మీ కెరీర్, అదృష్టం మారుతుందా? -
ఇంట్లో శ్రీ చక్రం ఉంటే ఏమవుతుంది? ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన విషయాలు -
జూన్ 24 నుంచి తులా రాశిలో చంద్ర సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ధన లాభం ఖాయం! -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.!
ఘుమఘుమలాడే గోంగూర కోడి పులావ్..వాసనకే సగం ఆకలి తీరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే
తెలుగు వారి వంట గదిలో గోంగూరకు ఉన్న స్థానం ప్రత్యేకం. ఆ పుల్లటి రుచికి ఎవరైనా దాసోహం అనాల్సిందే. అలాంటి గోంగూర, మెత్తటి కోడి మాంసంతో కలిస్తే? ఆ రుచి మాటల్లో వర్ణించలేనిది. ఆ అద్భుతమైన కలయికే గోంగూర కోడి పులావ్. పండగైనా, ప్రత్యేక సందర్భమైనా లేదా వీకెండ్ లో ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ తో కలిసి ఆనందంగా భోజనం చేయాలన్నా ఈ పులావ్ బెస్ట్ ఆప్షన్. దీని సువాసనకే సగం ఆకలి తీరిపోతుంది. నోరూరించే గోంగూర కోడి పులావ్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
-బాస్మతి బియ్యం - 2 కప్పులు
-చికెన్ - అర కేజీ
-గోంగూర ఆకులు - 1 పెద్ద కప్పు
-నూనె - 3 టేబుల్ స్పూన్లు
-ఆవాలు - 1 స్పూన్
-జీలకర్ర - 1 స్పూన్
-ధనియాలు - 1 స్పూన్
-అల్లం - 1 అంగుళం ముక్క
-వెల్లుల్లి రెబ్బలు - 5-6
-పచ్చిమిర్చి - 3
-ఉల్లిపాయలు - 2
-ధనియాల పొడి - 1 స్పూన్
-జీలకర్ర పొడి - 1 స్పూన్
-పసుపు - చిటికెడు
-ఉప్పు - రుచికి సరిపడా
-నీరు - 4 కప్పులు (లేదా బియ్యానికి రెట్టింపు)

తయారీ విధానం
-ముందుగా బాస్మతి బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత మంచి నీటిలో సుమారు 30 నిమిషాల పాటు నానబెట్టండి.
-ఇప్పుడు స్టవ్ లేదా పొయ్యి మీద ఒక మందపాటి గిన్నె లేదా కుక్కర్ పెట్టి నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కగానే ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేయండి. అవి చిటపటలాడుతూ మంచి సువాసన వెదజల్లుతున్నప్పుడు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగులోకి మారే వరకు వేయించండి.
-ఉల్లిపాయలు చక్కగా వేగాక, అల్లం-వెల్లుల్లి-పచ్చిమిర్చి ముద్దను వేసి పచ్చి వాసన పోయే వరకు ఒకటి రెండు నిమిషాలు వేయించాలి.
-ఇప్పుడు శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలను వేసి మంటను కాస్త పెంచి, చికెన్ రంగు మారే వరకు బాగా వేపాలి.
-ఇప్పుడు అందులో సన్నగా తరిగిన గోంగూరను వేయాలి. గోంగూర వేయగానే అది మెత్తబడి తన పుల్లటి రుచిని చికెన్‌కు పట్టిస్తుంది. ఆ వెంటనే పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం దగ్గరపడి, నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.
-ఇప్పుడు నానబెట్టి, నీళ్లు వంపేసిన బాస్మతి బియ్యాన్ని ఈ మసాలా మిశ్రమంలో వేసి మెల్లగా, అన్నం మెతుకులు విరగకుండా ఒకటి రెండు నిమిషాలు కలపండి.
-తర్వాత అందులో 4 కప్పుల నీళ్లు పోసి ఒకసారి కలిపి, మూత పెట్టి పెద్ద మంటపై ఒక పొంగు రానివ్వండి.
-ఒక పొంగు రాగానే, మంటను సిమ్ లో పెట్టి గిన్నెపై మూత పెట్టి, సుమారు 15-20 నిమిషాల పాటు ఉడకనివ్వండి.
-20 నిమిషాల తర్వాత పొయ్యి ఆపి, వెంటనే మూత తీయకుండా మరో 10 నిమిషాలు అలానే వదిలేయండి. ఆ తర్వాత ఒక ఫోర్క్ తో మెల్లగా అన్నాన్ని పైకి కిందకి కదిలించి వేడివేడిగా ప్లేట్లలోకి సర్వ్ చేసుకోవడమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications