బంగాళదుంపతో జలేబీ.. ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చేస్తే అస్సలు వదలరు!

Posted By:

జలేబీ అనగానే ఎవరికైనా నోట్లో నీళ్లు ఊరాల్సిందే. వేడి వేడిగా, కరకరలాడుతూ, లోపల తీపి పాకంతో నిండిన జలేబీని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. సాధారణంగా మనం స్వీట్ షాపుల్లో దొరికే మైదా పిండి జలేబీలను మాత్రమే తిని ఉంటాము. కానీ మీరు ఎప్పుడైనా బంగాళదుంప జలేబీ గురించి విన్నారా? లేదా రుచి చూశారా?

సాధారణ జలేబీల కంటే ఇవి చాలా భిన్నమైన, అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. పండుగలు వచ్చినా, ఇంట్లో ఏదైనా వేడుక జరిగినా లేదా కొత్తగా ఏదైనా స్వీట్ ట్రై చేయాలనిపించినా.. ఈ ఆలూ జలేబీ మీకు బెస్ట్ ఆప్షన్. ఇంట్లోనే సులభంగా, తక్కువ సమయంలో ఈ బంగాళదుంప జలేబీని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Aloo Jalebi Recipe Try the Unique Crispy Potato Jalebi at Home in Telugu

కావాల్సిన పదార్థాలు
మైదా పిండి - 100 గ్రాములు
ఉడికించిన బంగాళదుంపలు - 2
పెరుగు - అర కప్పు
ఫ్రూట్ సాల్ట్ (ఈనో) - పావు టీస్పూన్
వంట నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
కుంకుమపువ్వు - చిటికెడు
యాలకుల పొడి - పావు టీస్పూన్
పంచదార - 1 కప్పు

5 నిమిషాల్లో అద్భుతమైన బ్రేక్‌ ఫాస్ట్.. మీ పిల్లలు లొట్టలేసుకుంటూ తినే చీజ్ గార్లిక్ శాండ్‌ విచ్

తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోండి. అందులో ఒక కప్పు చక్కెర వేసి, తగినన్ని నీళ్లు పోసి పాకం మరిగించండి. పాకం మరుగుతున్నప్పుడు అందులో చిటికెడు కుంకుమపువ్వు, పావు టీస్పూన్ యాలకుల పొడి వేయండి. వీటి వల్ల జలేబీకి మంచి రంగు, సువాసన వస్తాయి. ఈ పాకాన్ని సుమారు 5-7 నిమిషాల పాటు మరిగించాలి. జలేబీకి మరీ చిక్కటి పాకం అవసరం లేదు, కొద్దిగా పల్చగా, చేతికి కాస్త జిగురుగా తగిలేలా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆపేయండి.

-ఒక పెద్ద బౌల్ తీసుకుని.. అందులో ముందుగా ఉడికించి, మెత్తగా స్మాష్ చేసుకున్న బంగాళదుంపల మిశ్రమాన్ని వేయండి. అందులోనే మైదా పిండి, అర కప్పు పెరుగు, ఫ్రూట్ సాల్ట్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కాకుండా, అలాగని మరీ పల్చగా కాకుండా జలేబీలు వేయడానికి వీలుగా మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి.

-కలుపుకున్న ఈ పిండి మిశ్రమాన్ని ఒక శుభ్రమైన కాటన్ గుడ్డలో లేదా పైపింగ్ బ్యాగ్‌ లో నింపుకోండి. గుడ్డ ఉపయోగిస్తే అడుగు భాగంలో చిన్న రంధ్రం చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేడి చేయండి.

-నూనె వేడెక్కాక, మంటను మీడియంలో ఉంచి, పిండిని గుండ్రంగా తిప్పుతూ జలేబీల ఆకారంలో నూనెలో వేయండి. ఇవి మంచి బంగారు రంగులోకి మారి, కరకరలాడే వరకు రెండు వైపులా వేయించుకోవాలి.

-నూనెలోంచి వేడివేడి జలేబీలను తీసి, వెంటనే మనం ముందుగా సిద్ధం చేసుకున్న గోరువెచ్చని పంచదార పాకంలో వేయాలి. ఒక 2-3 నిమిషాల పాటు వాటిని పాకంలో నాననివ్వండి. అప్పుడే జలేబీలు పాకాన్ని బాగా పీల్చుకుని జ్యూసీగా తయారవుతాయి.

-అంతే ఎంతో రుచికరమైన, నోరూరించే బంగాళదుంప జలేబీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Wednesday, September 16, 2026, 13:02 [IST]
Desktop Bottom Promotion