Latest Updates
-
మహిళల్లో పీరియడ్స్, ఫిట్నెస్ సమస్యలకు చెక్ పెట్టే ప్రొటీన్ పౌడర్.. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఇలా చేసేయండి -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. టెంపుల్ స్టైల్ కాంచీపురం ఇడ్లీ, ఈ చట్నీతో తింటే అమోఘం.! -
ఉతికిన బట్టలు ఈ సమయంలో ఆరేస్తున్నారా.. వాస్తు ప్రకారం ఇంటికి ఎంత ప్రమాదకరమో తెలుసా.? -
వరలక్ష్మీ వ్రతం 2026: మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి బెస్ట్ మెసేజెస్, వాట్సాప్ స్టేటస్ లు.. -
రోజుకు 2 యాలకులు తింటే..15 రోజుల్లో మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే! -
మొదటి రోజే మేనేజర్‌కి ఊహించని షాక్.. 6 గంటల్లోనే కొత్త ఉద్యోగి షాకింగ్ నిర్ణయం -
వరలక్ష్మీ వ్రతం రోజు అటుకులతో ఇలా కేసరి చేసి చూడండి.. శ్రమ తక్కువ, టేస్ట్ ఎక్కువ.! -
మహిళలకు అమృతంతో సమానం.. ఎముకల పటిష్టతకు, రక్తహీనతను తరిమికొట్టే హెల్తీ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
సమసప్తక యోగం: శుక్ర, శని గ్రహాల అరుదైన కలయిక.. ఈ రాశుల వారి తలరాతే మారనుంది.! -
చాణక్య నీతి: భార్య తన భర్తకు తెలియకుండా చేయకూడని 4 పనులు.. లేదంటే కష్టాలు తప్పవు.!
ఉల్లి, వెల్లుల్లి లేకుండా పూరీ, బగారాకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆలూ టమాటర్ గ్రేవీ.. ఈ తాలింపుతోనే అసలు మజా.!
శ్రావణ మాసంలో చాలా మంది ఉల్లి, వెల్లుల్లి తినరు. ఇక నానెవెజ్ కూడా ముట్టుకోరు. పూజలు, వ్రతాలకు ప్రసిద్ధి చెందిన ఈ మాసంలో వంటల విషయంలో మహిళలు చాలా నిష్టగా నియమాలు పాటిస్తారు. అలాగని రుచీపచీ లేకుండా తినలేరు కదా.. ఈ మాసంలో నాన్‌వెజ్‌కి, ఉల్లివెల్లుల్లికి దూరంగా ఉన్నా.. వాటికి మించిన రుచితో ఈ స్పెషల్ కర్రీ ట్రై చేయండి. అదే ఆలూ టమాటర్ కర్రీ..

ఈ మాసంలో ఇంటికి చుట్టాలు ఉన్నా, పండుగలు ఉన్నా నాన్‌వెజ్ తినని మీకోసం అయినా ఇతరుల కోసమైనా ఈ ఆలూ టమాటర్ కర్రీని తప్పక ట్రై చేయాల్సిందే.. ఈ కర్రీ వైట్ రైస్‌లో కంటే కూడా పూరీ, బగారా రైస్, చపాతీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్‌గా ఉంటుంది. మరి ఉల్లి వెల్లుల్లి లేకుండా ఆలూ టమాటర్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం.. అయితే ఈ కర్రీలో చివరిలో వేసే తాలింపుతోనే అసలు మజా వస్తుంది..
ఆలూ టమాటర్ గ్రేవీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు..
బంగాళాదుంపలు- ఐదు(మీడియం సైజు)
ధనియాలు- టీస్పూన్
జీలకర్ర- అర టీస్పూన్
సోంపు- అర టీస్పూన్
నెయ్యి- మూడు టేబుల్‌స్పూన్లు
ఆయిల్- రెండు టేబుల్ స్పూన్లు
ఇంగువ- కొద్దిగా
పచ్చిమిర్చి- ఐదు
తరిగిన అల్లం- టేబుల్ స్పూన్
టమాటాలు- నాలుగు(మీడియం సైజు)
పసుపు- అర టీస్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
కారం- టీస్పూన్
నల్ల మిరియాల పొడి- టీస్పూన్
ధనియాల పొడి- టీస్పూన్
గరం మసాలా- అర టీస్పూన్
నీళ్లు- కప్పు
కొత్తిమీర- కొద్దిగా
కసూరి మెంతి- అర టీస్పూన్
కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్- అర
టీస్పూన్
ఆలూ టమాటర్ గ్రేవీ కర్రీ తయారీ విధానం
ముందుగా బంగాళా దుంపలను ఉడికించి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత నీళ్లు తీసేసి పొట్టు తీసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. టెంపుల్ స్టైల్ కాంచీపురం ఇడ్లీ, ఈ చట్నీతో తింటే అమోఘం.!
ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, సోంపును దంచిని మెత్తగా పొడి చేసి పక్కన ఉంచండి.
స్టవ్‌పైన వెడల్పాటి కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, నూనె వేసి కాగిన తర్వాత కొద్దిగా ఇంగువ, సన్నగా గుండ్రంగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరిగిన అల్లం ముక్కలు వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి..

ఇప్పుడు పొడుగ్గా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి మెత్తగా ఉడికేవరకు వేయించుకోవాలి.
టమాటాలు ఉడికిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, నల్ల మిరియాల పొడి వేసి కలపాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి.
వరలక్ష్మీ వ్రతం రోజు అటుకులతో ఇలా కేసరి చేసి చూడండి.. శ్రమ తక్కువ, టేస్ట్ ఎక్కువ.!
ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఆలూ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి కారం, మసాలాలు అన్నీ పట్టే వరకు ఉడికించుకోవాలి. నూనె పైకి తేలుతున్నప్పుడు నీళ్లు పోసి కాసేపు ఉడికిన తర్వాత మొదట సిద్ధం చేసిన ధనియాలు, జీలకర్ర, సోంపు పొడి మిశ్రమాన్ని వేసి కలిపి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి.
ఇప్పుడు పక్కనే మరో ఫ్లేమ్‌పైన చిన్న తాలింపు బాణలి పెట్టుకుని అందులో మిగిలిన నెయ్యి వేసి కాగిన తర్వాత కసూరి మెంతి, కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసి కలిపి వెంటనే ఆలూ టమాటర్ కర్రీలో వేసి కలపాలి. చివరిలో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
అంతే మిరియాల ఘాటు, కారం స్పైసీతో నాన్‌వెజ్‌ని మరిపించే రుచి, మజాని ఇచ్చే ఆలూ టమాటర్ గ్రేవీ కర్రీ రెడీ..
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications