Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
తొక్కలో పచ్చడి ఎప్పుడైనా తిన్నారా? సూపర్ టేస్ట్,ఎలా చేసుకోవాలంటే
సాధారణంగా వంట చేసేటప్పుడు కూరగాయల తొక్కలు తీసేసి కట్ చేసి వండుకుంటాం. అలాగే సొరకాయ వండేటప్పుడు కూడా తొక్క తీసి పడేస్తుంటాం. అయితే తోక్కే కదా అని పడేయకుండి. దాని వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి. సొరకాయ తొక్కతో సూపర్ టేస్టీ పచ్చడి చేసుకోవచ్చు. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
సొరకాయ తొక్క పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
-సొరకాయ తొక్కలు
-సొరకాయ మధ్యలో భాగం
-జీలకర్ర
-శనగపప్పు
-ఆవాలు
-నూనె
-చింతపండు
-ఇంగువ
-పసుపు
-ఉప్పు
-పచ్చి మిరపకాయలు
-వెల్లులి
టమాటోలు
-కొత్తిమీర
-కరివేపాకు

తొక్క పచ్చడి తయారీ విధానం
-ముందుగా ఓ పాన్ లో ఆయిల్ వేడి చేసుకోవాలి.
-తర్వాత శనగపప్పు వేసి ఎర్రగా వేగాక జీలకర్ర వేయాలి.
-ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసి మెత్తబడిన తర్వాత టమాటా ముక్కలు, చింతపండు వేసి కొద్దిసేపు ఉడికించి ఈ మిశ్రమాన్ని మిక్సీ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు అదే పాన్ లో నూనె వేడి చేసి వెల్లుల్లి రెబ్బలు, సొరకాయ తొక్క, మధ్యలో ఉండే భాగం వేసి మెత్తగా మగ్గించుకోవాలి.
-తర్వాత ఈ మిశ్రమాన్ని అదే మిక్సీ గిన్నెలో వేసి కొంచెం ఉప్పు వేసి
కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు తాళింపు వేయాలి. ఇందుకోసం స్టౌ ఆన్ చేసి ఆయిల్ వేడి చేసి ఎండు
మిరపకాయ, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, పసుపు,
ఇంగువా వేసి వేయించుకోవాలి.
-తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చడి మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలపాలి. చివర్లో కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేయడమే. తొక్కలో పచ్చడి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
