Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది!
వేడి వేడి ఇడ్లీ అయినా, కరకరలాడే దోశ అయినా.. దానికి సరైన జోడీ చట్నీ ఉంటేనే ఆ మజా వస్తుంది. కానీ రోజువారీ చేసే రొటీన్ చట్నీలతో మీకు బోర్ కొట్టిందా? మీ ఇంట్లో వాళ్లకు పల్లీల చట్నీ అంటే మహా ఇష్టమా? అయితే ఈసారి కాస్త కొత్తగా, ఘాటుగా, రుచికరంగా ఉండే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ ట్రై చేసి చూడండి.
ఈ చట్నీ చేస్తే చాలు మీ ఇంట్లో వాళ్లు రోజూ తినేదాని కంటే మరో రెండు ఇడ్లీలు, దోశలు అదనంగా లాగించేస్తారు. నోరూరించే ఆంధ్రా స్టైల్ వేరుశనగ కారం చట్నీ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు
పచ్చి పల్లీలు (వేరుశెనగ గుళ్లు) - పావు కప్పు
నూనె - 4 టేబుల్ స్పూన్లు
సాధారణ ఎండు మిర్చి - 5
కాశ్మీరీ ఎండు మిర్చి - 2
పెద్ద ఉల్లిపాయ - 1
పెద్ద టమాటా - 1
చింతపండు - ఒక చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 3
ఉప్పు - రుచికి తగినంత
ఆవాలు - అర టీస్పూన్
కరివేపాకు - ఒక కట్ట
ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి. అందులో పావు కప్పు పచ్చి పల్లీలు వేసి, మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి దోరగా వేయించాలి. పల్లీలు మాడిపోకుండా కరకరలాడే వరకు వేయించుకుని, వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన చల్లారనివ్వాలి.
-ఇప్పుడు అదే పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె కాస్త వేడెక్కాక అందులో ఎండు మిర్చి, కాశ్మీరీ ఎండు మిర్చి వేసి కొన్ని సెకన్ల పాటు దోరగా వేయించాలి. అవి వేగుతున్నప్పుడే ఒక చిన్న చింతపండు ముక్క వేసి కలపాలి. ఆ తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
-ఉల్లిపాయలు కాస్త రంగు మారి పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, మూడు వెల్లుల్లి రెబ్బలు వేసి మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు పూర్తిగా మెత్తబడి, గుజ్జులా అయ్యేంత వరకు ఉడికించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాసేపు పూర్తిగా చల్లారనివ్వాలి.
-ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసి ఒకసారి పొడిలా మిక్సీ పట్టాలి. ఆ తర్వాత చల్లారిన ఉల్లి-టమాటా-మిర్చి మిశ్రమాన్ని జార్ లో వేయాలి. అవసరమైనన్ని నీళ్లు పోసుకుని, మెత్తని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
-చివరిగా చట్నీకి ప్రాణం పోసే పోపు పెట్టుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద చిన్న పాన్ పెట్టి మిగిలిన నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. చివరగా కరివేపాకు వేసి వేయించి, ఆ ఘుమఘుమలాడే పోపును తీసుకువెళ్లి చట్నీలో వేసి బాగా కలుపుకోవాలి.
-అంతే నోరూరించే, కమ్మటి, ఘాటైన ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ రెడీ. వేడి వేడి ఇడ్లీ మీద కొద్దిగా నెయ్యి వేసుకుని, ఈ చట్నీని అద్దుకుని తింటుంటే ఆ రుచి అమృతంలా ఉంటుంది. దోశ, వడ, ఉతప్పం.. ఇలా దేనితోనైనా ఇది సూపర్ కాంబినేషన్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications