Latest Updates
-
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ!
శృంగార సమస్యల సంజీవని.. ఈ హల్వాను కప్పు తిన్నారంటే వీర్య పుష్టి మీ సొంతం.!
ఈ రోజుల్లో మగవారిలో సంతాన సామర్థ్యం, శక్తి క్రమంగా తగ్గిపోతోంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు, పని ఒత్తిడితో క్రమంగా వారిలో వీర్య కణాల సంఖ్య పడిపోతుంది. అంతేకాకుండా శృంగార సామర్థ్యంపైనా ప్రభావం చూపిస్తుంది. ఈ సమస్యకు ఆయుర్వేద పరంగా చూస్తే బూడిద గుమ్మడికాయ సరైన పరిష్కారంగా నిపుణులు చెబుతుంటారు. దీంతో హల్వా చేసుకున్నట్లయితే కొద్ది రోజుల్లోనే వారిలో వీర్య పుష్టి మెరుగవుతుంది.

బూడిద గుమ్మడికాయ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు
బూడిద గుమ్మడికాయ- ఒకటి
నిమ్మకాయ రసం- టీస్పూన్
కుంకుమపువ్వు- పావు టీస్పూన్
అర టీస్పూన్- యాలకుల పొడి
నెయ్యి- రెండు టేబుల్ స్పూన్లు
పచ్చకర్పూరం- కొద్దిగా
జలుబు, దగ్గుని ఒక్కరోజులో మాయం చేసే పాతకాలంనాటి ఘాటైన రసం.. ఐదే నిమిషాల్లో రెడీ
బూడిద గుమ్మడికాయ హల్వాలో గార్నిష్ కోసం
నెయ్యి- 3 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు- పావు కప్పు
బూడిద గుమ్మడికాయ హల్వా తయారీ విధానం
ముందుగా బూడిద గుమ్మడికాయను చెక్కు తీసి లోపలి గింజలు తీసి కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మీడియం రంధ్రాలున్న క్రషర్ ద్వారా తురుముకోవాలి.
ఈ మొత్తాన్ని శుభ్రమైన క్లాత్‌లో పెట్టి గట్టిగా నీరు మొత్తం పోయేలాగా ఒక గిన్నెలోకి పిండుకోవాలి. మిగిలిన పిప్పి దాదాపు 600 గ్రాములు ఉండేలా చూసుకోవాలి.

స్టవ్‌పైన పాన్ పెట్టుకుని ఈ నీటిని పోసుకుని కాస్త కాగనివ్వాలి. ఇప్పుడు ఇందులో బూడిద గుమ్మడికాయ పిప్పిని వేసి కలిపి నీరు దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి.
ఇప్పుడు అంతే మొత్తంలో పంచదార తీసుకుని బూడిద గుమ్మడికాయ చూర్ణంలో కలుపుకోవాలి. చక్కెర మొత్తం కరిగి చూర్ణం చిక్కగా అవుతుంది.
కీళ్ల నొప్పులకు చెక్,ఎముకలకు బలాన్నిచ్చే రుచికరమైన మటన్ పాయా కర్రీ..ఇంట్లోనే ఈజీగా వండేయండిలా..
ఈ చూర్ణాన్ని చేతితో తాకినట్లుగా జిగురుగా తాకుతుంటుంది. ఇప్పుడు ఇందులో నిమ్మరసం, కుంకుమ పువ్వు, నెయ్యి, పచ్చ కర్పూరం వేసి కలుపుకుని చిన్న మంటపైన పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
చిన్న తాలింపు కడాయి తీసుకుని అందులో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు వేసి దోరగా వేగనివ్వాలి. దీనిని హల్వాలో కలుపుకొని కాసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
మగవారిలో సంతాన, శృంగార సమస్యలకు సరైన ఆయుర్వేద పరిష్కారం బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ. కాస్త చల్లారాక సర్వ్ చేసుకుని తినవచ్చు. బూడిద గుమ్మడికాయలో నీటి శాతం ఎక్కువగా ఉన్న కారణంగా శరీరంలో వేడిని తగ్గించడమే కాకుండా, బరువును అదుపులో ఉంచుతుంది.
బూడిద గుమ్మడికాయతో హల్వానే కాకుండా జ్యూస్ కూడా చేసుకోవచ్చు. పరగడుపున తీసుకోవడం ద్వారా పొట్టలోని వ్యర్థాలను సులభంగా బయటకు పంపిస్తుంది. మలబద్ధకం, గ్యాస్, అసిడిటీని తగ్గిస్తుంది. కేవలం దిష్టి నివారణకే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలతో ఆయుర్వేదంలో కీలకంగా ఉంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
