Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ఇడ్లీ, దోశ, అన్నం దేనిలోకైనా అదుర్స్..ఈ బీహార్ స్పెషల్ చట్నీ ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదలరు
మనం రోజూ తినే అన్నం, కూరలు ఒక్కోసారి బోర్ కొడుతుంటాయి. ఆ సమయంలో నోటికి ఏదైనా కొత్తగా, రుచిగా తగలాలనిపిస్తుంటది?అలాంటప్పుడు బీహార్ ఫేమస్ టీసీ చట్నీ ట్రై చేయండి. ఒక్క ముద్దలో ఈ చట్నీని కలుపుకుని తింటే, ఆహారపు రుచి పదిరెట్లు పెరుగుతుందంటే అతిశయోక్తి కాదు.
బీహార్ వాసులు టీసీ అని పిలిచే ఈ గింజలను మన తెలుగులో అవిసె గింజలు అంటాము. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి బీహార్ ప్రజలు ఈ చట్నీని ఔషధంలా భావించి మరీ తింటారు. బీహార్ ఫేమస్ అవిసె గింజల చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
అవిసె గింజలు - అర కప్పు
ఎండు కొబ్బరి తురుము - అర కప్పు
వేరుశెనగ గుళ్లు (పల్లీలు)- 4 టేబుల్ స్పూన్లు
కరివేపాకు - అర కప్పు
ధనియాలు - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 2 టేబుల్ స్పూన్లు
ఎండుమిర్చి -5-6
తెల్ల నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు - 6
మిరియాలు - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
ఇంగువ - చిటికెడు
తయారీ విధానం
-ముందుగా అవిసె గింజలను శుభ్రం చేసుకుని, అందులో రాళ్లు లేదా మట్టి లేకుండా చూసుకోవాలి.
-స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, అవిసె గింజలను మీడియం మంటపై వేయించాలి. అవి చిటపటలాడుతూ, మంచి వాసన వచ్చే వరకు వేయించి పక్కన ప్లేట్ లో పెట్టుకోవాలి.
-అదే పాన్ లో కరివేపాకును వేసి, అందులోని తడి పోయి కరకరలాడే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు పాన్ లో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి వేసి దోరగా వేయించాలి. మంచి సువాసన వచ్చాక వీటిని కూడా ప్లేట్ లోకి తీసుకోవాలి.
-చివరగా అదే పాన్ లో ఎండు కొబ్బరి తురుము, వేరుశెనగ గుళ్లు, తెల్ల నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. వెల్లుల్లి పచ్చి వాసన పోయి, మిశ్రమం లేత గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించి స్టవ్ ఆపేయాలి.
-వేయించిన పదార్థాలన్నీ పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా నల్ల ఉప్పు, సాధారణ ఉప్పు, చిటికెడు ఇంగువ వేయాలి.
-ఈ మిశ్రమాన్ని మరీ మెత్తని పొడిలా కాకుండా, కాస్త బరకగా (ముతకగా) రుబ్బుకుంటే చట్నీ రుచి అద్భుతంగా ఉంటుంది.
-అంతే ఘుమఘుమలాడే బిహారీ స్టైల్ అవిసె గింజల చట్నీ రెడీ. దీనిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే చాలా రోజులు ఫ్రెష్ గా ఉంటుంది. ఇడ్లీ, దోశ, చపాతీలకు కూడా ఇది అదిరిపోయే కాంబినేషన్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications