Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
కోయంబత్తూర్ అన్నపూర్ణ హోటల్ స్టైల్ వెజ్ కుర్మా..పూరీ,ఇడ్లీ,చపాతీ,పలావ్ లోకి కేక!
తమిళానాడులోని కోయంబత్తూర్ వంటకాలకు చాలా ఫేమస్. కోయంబత్తూర్ అనగానే చాలామందికి ఈషా ఫౌండేషన్, అక్కడి ప్రశాంత వాతావరణం గుర్తుకువస్తుంది, కానీ కోయంబత్తూర్ వంటకాలు కూడా చాలా చాలా ఫేమస్. అలాంటివాటిల్లో కోయంబత్తూర్ ఫేమస్ అన్నపూర్ణ హోటల్ స్టైల్ వెజ్ కుర్మా ఒకటి. ఈ కుర్మా సీక్రెట్ అంతా అందులో వేసే ఓ స్పెషల్ మసాలా పేస్ట్ లోనే దాగి ఉంది.

కోయంబత్తూరు అన్నపూర్ణ హోటల్ స్టైల్ వెజ్ కుర్మా తయారీకి కావాల్సినవి
తురిమిన పచ్చి కొబ్బరి - పావు కప్పు
జీడిపప్పు - 6
గసగసాలు - 1 టీస్పూన్
నీళ్లు - పావు కప్పు
బంగాళదుంప - 1
క్యారెట్ - 1
బీన్స్ - 5
పచ్చి బఠానీలు - పావు కప్పు
పసుపు - చిటికెడు
ఉప్పు - కొద్దిగా
నీళ్లు - 1 కప్పు
నూనె - 1 టేబుల్ స్పూన్
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
బిర్యానీ ఆకు - 1
యాలకులు - 2
లవంగాలు - 3
దాల్చిన చెక్క - 1 అంగుళం
పచ్చిమిర్చి - 2
పెద్ద ఉల్లిపాయలు - 2
టమాటాలు - 3
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
కారం - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
పెరుగు - పావు కప్పు
పాలు - అర కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - గుప్పెడు

కోయంబత్తూరు అన్నపూర్ణ హోటల్ స్టైల్ వెజ్ కుర్మా తయారీ విధానం
-ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో తురిమిన కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు వేయాలి. పావు కప్పు నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పేస్ట్ వల్లే కుర్మాకు కమ్మటి రుచి వస్తుంది.
-ప్రెషర్ కుక్కర్ లో కట్ చేసుకున్న బంగాళదుంప, క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీలు వేయాలి. అందులో ఒక కప్పు నీళ్లు, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి మీడియం మంట మీద రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
-స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉన్న పాన్ పెట్టుకోవాలి. అందులో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగాక బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి పది సెకన్ల పాటు వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు వేసి పచ్చివాసన పోయి, టమాటాలు మెత్తగా మగ్గేవరకు ఉడికించాలి.
-టమాటా మిశ్రమం మగ్గాక, ముందుగా గ్రైండ్ చేసిన కొబ్బరి-జీడిపప్పు పేస్ట్ ను వేసి కాసేపు ఉడికించాలి. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న కూరగాయల ముక్కలను ఇందులో వేసి బాగా కలపాలి.
-ఇప్పుడు గ్రేవీలో కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. మసాలాల పచ్చివాసన పోయిన తర్వాత, మంటను సిమ్ లో ఉంచి తాజా పెరుగు, గోరువెచ్చని పాలు పోసి నిదానంగా కలపాలి. ఈ మిశ్రమాన్ని 5 నిమిషాల పాటు సన్నని మంటపై బాగా మరగనివ్వాలి.
-కుర్మా నుండి అద్భుతమైన సువాసన వస్తూ, గ్రేవీ చిక్కబడుతున్నప్పుడు.. పైన సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి.
-అంతే ఘుమఘుమలాడే వేడి వేడి కోయంబత్తూర్ అన్నపూర్ణ స్టైల్ వెజ్ కుర్మా రెడీ. చపాతీ, పూరీ, ఇడ్లీ, దోశ, వెజ్ పలావ్ లోకి కూడా ఇది సూపర్ కాంబినేషన్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
