Latest Updates
-
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక
సుగంధ ద్రవ్యాల మేళవింపుతో.. మర్చిపోలేని రుచినిచ్చే ఆలూ యఖ్ని పులావ్
యఖ్ని పులావ్ అనేది కాశ్మీరీ వంటకాలలో ఒక ప్రత్యేకమైన వంటకం. సాధారణంగా మాంసంతో చేసే ఈ పులావ్ ను, మనం బంగాళదుంపలతో అంతే రుచిగా శాఖాహార పద్ధతిలో తయారుచేసుకోవచ్చు. యఖ్ని అంటే సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన చిక్కటి ద్రవం.
ఈ యఖ్నితో ఉడికించడం వలనే ఈ పులావ్ కు ఒక ప్రత్యేకమైన సువాసన, రుచి వస్తాయి. ఇది సాధారణ పులావ్ లా కాకుండా, పెరుగు,మసాలా దినుసుల మేళవింపుతో ఎంతో రుచిగా ఉంటుంది.

కావాల్సిన పదార్థాలు
బాస్మతి బియ్యం - 2 కప్పులు
బంగాళదుంపలు - 3 పెద్దవి
ఉల్లిపాయలు - 2
నెయ్యి లేదా నూనె - 4 టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 3
షాజీరా - 1 టీస్పూన్
బిర్యానీ ఆకు - 2
ఉప్పు - రుచికి సరిపడా
పెరుగు - 1 కప్పు
సోంపు గింజలు - 2 టీస్పూన్లు
ధనియాలు - 1 టేబుల్ స్పూన్
దాల్చిన చెక్క - 1 అంగుళం ముక్క
నల్ల యాలకులు - 1
పచ్చి యాలకులు - 4
లవంగాలు - 5
నల్ల మిరియాలు - 10
నీళ్లు - 4 కప్పులు
గార్నిష్ కోసం:
వేయించిన ఉల్లిపాయలు- కొద్దిగా
కొత్తిమీర, పుదీనా తరుగు - కొద్దిగా

తయారీ విధానం
-ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి, కనీసం 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి.
-తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో నూనె వేడి చేసి, పెద్దగా కోసుకున్న బంగాళదుంప ముక్కలను బంగారు గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు సోంపు, ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు ఒక శుభ్రమైన కాటన్ వస్త్రంలో వేసి, గట్టిగా ఒక మూట కట్టాలి.
-ఒక గిన్నెలో గట్టి పెరుగును ఉండలు లేకుండా బాగా గిలకొట్టాలి. దానికి 4 కప్పుల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
-ఈ పెరుగు మిశ్రమంలో మనం తయారు చేసుకున్న మసాలా మూటను వేసి, గిన్నెను పొయ్యి మీద పెట్టాలి. చిన్న మంట మీద సుమారు 15-20 నిమిషాల పాటు మరిగించాలి. మసాలాల సువాసన అంతా ఆ నీటిలోకి దిగి, రుచికరమైన యఖ్ని తయారవుతుంది. తర్వాత మసాలా మూటను తీసి పక్కన పెట్టేయాలి.
-ఇప్పుడు ఒక మందపాటి గిన్నె లేదా ప్రెషర్ కుక్కర్ లో నెయ్యి వేడి చేయాలి. నెయ్యి కరిగాక, షాజీరా, బిర్యానీ ఆకులు వేసి చిటపటలాడనిచ్చి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి బంగారు రంగులోకి మారేవరకు బాగా వేయించాలి.
-తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి చీలికలు వేసి పచ్చి వాసన పోయేవరకు ఒక నిమిషం పాటు వేయించాలి.
-ఇప్పుడు నానబెట్టిన బియ్యంలోని నీటిని పూర్తిగా వంపేసి ఆ బియ్యాన్ని గిన్నెలో వేసి, గరిటతో మెల్లగా కలుపుతూ రెండు నిమిషాల పాటు వేయించాలి.
-ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసి కలపాలి.
-చివరగా మనం సిద్ధం చేసుకున్న యఖ్ని నీటిని ఇందులో పోయాలి. ఒకసారి ఉప్పు సరిచూసుకొని, అవసరమైతే కొద్దిగా వేసి, బాగా కలపాలి.
-గిన్నెపై మూత పెట్టి, ముందుగా అధిక మంటపై ఒక పొంగు రానివ్వాలి. తర్వాత మంటను సిమ్ లో పెట్టి, అన్నం పూర్తిగా ఉడికి, నీరంతా ఇగిరిపోయే వరకు సుమారు 15-20 నిమిషాలు ఉడికించాలి. కుక్కర్ వాడితే, 2 విజిల్స్ వచ్చేవరకు ఉడికిస్తే సరిపోతుంది.
-స్టవ్ ఆఫ్ చేశాక, మూత తీయకుండా మరో 10 నిమిషాల పాటు అన్నాన్ని దమ్‌లో వదిలేయాలి. దీనివల్ల ఫ్లేవర్స్ అన్నీ అన్నానికి బాగా పడతాయి. 10 నిమిషాల తర్వాత మూత తీసి, ఒక ఫోర్క్‌తో మెల్లగా అన్నాన్ని కదిపితే పొడిపొడిగా వస్తుంది.
-పైన వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా తరుగుతో అలంకరించి, వేడివేడిగా రైతాతో వడ్డించండి. అంతే నోరూరించే ఆలూ యఖ్ని పులావ్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications