రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ దొన్నె బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి

Posted By:

బిర్యానీ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది చికెన్ లేదా మటన్ బిర్యానీ. కానీ ఎప్పుడూ ఒకే రకమైన బిర్యానీలు తిని బోర్ కొట్టిందా? అయితే ఈ సారి కాస్త వెరైటీగా, ఎంతో రుచికరమైన మష్రూమ్ దొన్నె బిర్యానీ ట్రై చేయండి.

మాంసాహారానికి ఏమాత్రం తీసిపోని ఈ బిర్యానీ రుచికి పిల్లల నుండి పెద్దల వరకు ఫిదా అవ్వాల్సిందే. మష్రూమ్ దొన్నె బిర్యానీ మీ ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Authentic Mushroom Donne Biryani Recipe A Perfect Treat for Kids and Adults

మష్రూమ్ దొన్నె బిర్యానీ కావలసిన పదార్థాలు

జీలకర్ర సంబా బియ్యం - 1 కప్పు
పుట్టగొడుగులు - 200 గ్రాములు
పెరుగు - పావు కప్పు
కారం - అర టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
ధనియాల పొడి - అర టీస్పూన్
వేరుశెనగ నూనె - అర టీస్పూన్
లవంగాలు - 2
దాల్చిన చెక్క - 1 అంగుళం ముక్క
మిరియాల పొడి - పావు టీస్పూన్
పచ్చిమిర్చి - 2
తరిగిన ఉల్లిపాయ - అర కప్పు
వెల్లుల్లి రెబ్బలు - 5
అల్లం - చిన్న ముక్క
కొత్తిమీర - 1 కప్పు
పుదీనా ఆకులు - 1 కప్పు
జీలకర్ర -అర టీస్పూన్
వేరుశెనగ నూనె - 1 టీస్పూన్
నెయ్యి - 1 టీస్పూన్
గరం మసాలా దినుసులు (యాలకులు, మరాఠీ మొగ్గ, ఆకు)
తరిగిన ఉల్లిపాయ - అర కప్పు
నీళ్లు - 2 కప్పులు,
ఉప్పు - రుచికి సరిపడా

లంబోదరుడికి ప్రీతికరమైన బెల్లం పాల తాలికలు.. పర్ఫెక్ట్‌గా రావాలంటే ఈ కొలతలతో ట్రై చేయండి.!

మష్రూమ్ దొన్నె బిర్యానీ తయారీ విధానం

-ముందుగా జీలకర్ర సంబా బియ్యాన్ని శుభ్రంగా రెండుసార్లు కడిగి,10 నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకోవాలి.

-మరోవైపు పుట్టగొడుగులను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఒక గిన్నెలో పుట్టగొడుగుల ముక్కలు, పెరుగు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపి 10 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, ఒక పాన్‌ లో కొద్దిగా నూనె వేడి చేయండి. అందులో లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాల పొడి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, జీలకర్ర వేసి కాస్త వేయించి చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం చల్లారాక మిక్సీ పట్టి మెత్తని పేస్ట్‌ లా చేసుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి మందంగా ఉండే గిన్నె పెట్టి అందులో నూనె వేడి చేయండి. ఇందులో గరం మసాలా దినుసులు వేసి వేయించాక, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.

-ఆ తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, మ్యారినేట్ చేసుకున్న పుట్టగొడుగులను వేసి పచ్చివాసన పోయేలా రెండు నిమిషాలు ఉడికించాలి.

-ఇప్పుడు రెండు కప్పుల నీళ్లు పోసి మరగనివ్వాలి. నీరు బాగా మరుగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యం, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలపాలి. పాత్రపై మూతపెట్టి ఓ 5 నిమిషాలు ఉడికించాలి. ఆపై మూత తీసి నెయ్యి వేసి, అన్నం విరగకుండా నిదానంగా కలపాలి.

-ఇప్పుడు బిర్యానీకి దమ్ ఇవ్వడానికి పాత్రపై మూతపెట్టి, ఆవిరి బయటకు పోకుండా పైన ఒక బరువైన వస్తువును ఉంచాలి. మంటను మీడియంలో పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ కట్టేయాలి.

-అంతే మష్రూమ్ దొన్నె బిర్యానీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Friday, September 11, 2026, 10:27 [IST]
Desktop Bottom Promotion