Latest Updates
-
దిశను మార్చుకోనున్న సూరీడు.. ఈ మూడు రాశుల వారికి నెలరోజుల పాటు గడ్డు కాలమే.! -
లంబోదరుడికి ప్రీతికరమైన బెల్లం పాల తాలికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ కొలతలతో ట్రై చేయండి.! -
సెప్టెంబర్ 11 రాత్రి 7 గంటల తర్వాత..వృషభం, సింహం, వృశ్చిక రాశులకు లాటరీ తగిలినంత అదృష్టం! -
ఫ్రిజ్‌లో పెట్టినా నిమ్మకాయలు రంగు మారుతున్నాయా.. ఈ 3 టిప్స్‌తో ఎన్ని రోజులైనా తాజాగానే.! -
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్‌తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.! -
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా! -
లిప్‌స్టిక్‌తో పెదాలు డ్రై అవుతాయా.. అధర అందం విషయంలో అతివలు చేసే పొరపాట్లు ఇవే.! -
చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు? -
గణేశ్ చతుర్థి స్పెషల్.. తమిళనాడు స్టైల్లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.! -
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే!
మెనోపాజ్ తర్వాత మహిళల్లో అనారోగ్యానికి కారణాలివే.. ఈ భాగాలపైనే ఎక్కువ ఎఫెక్ట్.!
స్త్రీలలో శాశ్వతంగా రుతుచక్రం ఆగిపోయే ప్రక్రియను మెనోపాజ్ అంటారు. మన దేశంలో మహిళల్లో 45- 50 ఏళ్ల మధ్య వయసు నుంచి ఈ మెనోపాజ్ దశ మొదలవుతుంది. స్త్రీలలో జరిగే ఈ ప్రధాన మార్పుతో వారిలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఆగిపోతుంది. అయితే నెలసరి ఆగిపోవడంతోనే అయిపోదు.. ఈ దశ తర్వాత వారి శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ స్థాయిలు తగ్గిపోవడంతో వారిలో వివిధ వ్యాధులకి తలుపులు తెరుచుకుంటాయి. దీంతో తరచూ వివిధ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.

ముఖ్యంగా మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు, ఆ స్టేజ్‌కు సమీపంలో ఉన్న మహిళలు వారి శరీరంలో జరిగే మార్పులు, ప్రభావమయ్యే భాగాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. గైనకాలజిస్టుల అభిప్రాయం మేరకు రుతువిరతి తర్వాత మహిళలు ఎక్కువగా ఎముకల బలహీనత, గుండె జబ్బుల ప్రమాదం, బాడీలో కొవ్వు పెరగడం, అలసట, ఆయాసం వంటి వాటిని ఎదుర్కొంటారు. అందుకే ఈ దశను మహిళలు తేలికగా తీసుకోవద్దని నిపుణులు అంటున్నారు.

నిద్ర లేమి
మెనోపాజ్ దశలో మహిళలు తరచూ కొన్ని శారీరక మార్పులు ఎదుర్కొంటారని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఒక్కసారి శరీరం వేడిగా అనిపించడం, ఎక్కువగా చెమట పట్టడం లాంటి హాట్ ఫ్లాషెస్‌ను అనుభిస్తారు. ఇది వారిలో కొన్ని నిమిషాల వరకు ఉండొచ్చు. రాత్రి సమయంలో వస్తే వారికి నిద్ర లేమి సమస్య కూడా సంభవిస్తుంది.

ఎముకల బలహీనత
రుతువిరతి తర్వాత మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గిపోవడంతో ఎముకల బలహీనత, సాంద్రత తగ్గిపోవడం ఏర్పడుతుంది. ఎముకలు క్షీణించడంతో పాటు కొత్త ఎముకలు ఏర్పడే అవకాశాలు తగ్గిపోతాయి. ఈ ప్రభావం కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది. ఇది ఆస్టియోపొరోసిస్‌కు దారితీస్తుంది. బోన్స్ బలహీనపడి విరిగిపోయే ప్రమాదమూ ఉంది. అందుకే ఈ దశలో ఎముకల ఆరోగ్యంపై మహిళలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం, కాల్షియంను సరైన మోతాదులో తీసుకోవడం, విటమిన్ డి తీసుకోవడం చాలా ముఖ్యం.
యూరిన్ సమస్యలు
మెనోపాజ్‌తో హార్మోన్ల అసమతుల్యత కారణంగా యోని చర్మంతో సంబంధిత భాగాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. ఫలితంగా యోని పొడిబారడం జరుగుతుంది. దురద ఏర్పడవచ్చు. శారీరకంగా కలిసినప్పుడు నొప్పిని అనుభవించవచ్చు. ఇది వారి జీవనవిధానంపై ప్రభావం చూపిస్తుంది. వీటితో పాటు తరచూ యూరిన్‌కి వెళ్లాల్సి రావడం, మూత్రాన్ని నియంత్రించలేకపోవడం, యూరిన్ ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం తలెత్తే అవకాశాలు ఉన్నాయి.

గుండె ఆరోగ్యం

ఈ దశలో మహిళల శరీర భాగాల్లో ఎక్కువగా కొవ్వు పేరుకుపోతుంది. దీంతో నడుము చుట్టూ కొవ్వు పెరుగుతుంది. దీంతో కండరాలు క్షీణించిపోతాయి. అంతేకాకుండా విపరీతంగా బరువు పెరుగుతారు. హార్మోన్ల అసమతుల్యతతో మానసికంగా మార్పులు చూస్తారు. చిరాకు వస్తుంది. ఏకాగ్రత తగ్గిపోతుంది, జ్ఞాపకశక్తిపై ప్రభావం పడవచ్చు. వీటితో పాటు గుండె జబ్బులు, పక్షవాతం వంటి ప్రభావాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మెనోపాజ్ తర్వాత మహిళలు ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే హెల్తీ లైఫ్‌స్టైల్‌ను అలవాటు చేసుకోవాలి. రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం మంచిది. బ్యాలెన్స్‌డ్ డైట్ మేలు చేస్తుంది. బరువును అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
