Latest Updates
-
దారుణమైన ఆచారం: పేరుకే కోడలు..ఇంట్లో ఎవరికి దొరికితే వాళ్లు కాపురం చేస్తారు..మామ,మరిది కూడా! -
రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ దొన్నె బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి -
మెనోపాజ్ తర్వాత మహిళల్లో అనారోగ్యానికి కారణాలివే.. ఈ భాగాలపైనే ఎక్కువ ఎఫెక్ట్.! -
దిశను మార్చుకోనున్న సూరీడు.. ఈ మూడు రాశుల వారికి నెలరోజుల పాటు గడ్డు కాలమే.! -
లంబోదరుడికి ప్రీతికరమైన బెల్లం పాల తాలికలు.. పర్ఫెక్ట్‌గా రావాలంటే ఈ కొలతలతో ట్రై చేయండి.! -
సెప్టెంబర్ 11 రాత్రి 7 గంటల తర్వాత..వృషభం, సింహం, వృశ్చిక రాశులకు లాటరీ తగిలినంత అదృష్టం! -
ఫ్రిజ్‌లో పెట్టినా నిమ్మకాయలు రంగు మారుతున్నాయా.. ఈ 3 టిప్స్‌తో ఎన్ని రోజులైనా తాజాగానే.! -
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్‌తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.! -
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా! -
లిప్‌స్టిక్‌తో పెదాలు డ్రై అవుతాయా.. అధర అందం విషయంలో అతివలు చేసే పొరపాట్లు ఇవే.!
మందులతో పనిలేని బెస్ట్ డిటాక్స్ డ్రింక్.. అల్సర్‌ను పోగొట్టే కమ్మనైన తమలపాకు రసం.!
ప్రకృతి సహజసిద్ధమైన ఔషధాల్లో తమలపాకు ఒకటి. దీనిని చాలా మంది తాంబూలంగా తీసుకుంటారు. తమలపాకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణక్రియ సమస్య ఉన్నవారు, అల్సర్‌తో బాధపడుతున్న వారు, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న వారికి మందులు అవసరం లేని సంజీవనిలా పనిచేస్తుంది. ఇలాంటి దివ్యమైన పదార్థంతో రసం చేసుకుని తాగడం లేదా వేడివేడి అన్నంలోకి తిన్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరి తమలపాకు సాంబార్ రసం ఎలా తయారుచేయాలో చూద్దాం..

తమలపాకు సాంబార్ రసం తయారీకి కావాల్సిన పదార్థాలు
కందిపప్పు- 50 గ్రాములు
లేత, తాజా తమలపాకులు- 20
పచ్చిమిర్చి- పది
జీలకర్ర- టీస్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
చింతపండు- నిమ్మకాయ సైజు
టమాటాలు- ఆరు
ఉల్లిపాయలు- రెండు
కరివేపాకు- రెండు రెబ్బలు
నూనె- మూడు టేబుల్ స్పూన్లు
పసుపు- అర టీస్పూన్
ధనియాల పొడి- టీస్పూన్
బెల్లం- చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు- ఐదు
కొత్తిమీర- గుప్పెడు
తమలపాకు సాంబార్ రసం తయారీ విధానం
లంబోదరుడికి ప్రీతికరమైన బెల్లం పాల తాలికలు.. పర్ఫెక్ట్‌గా రావాలంటే ఈ కొలతలతో ట్రై చేయండి.!
తమలపాకు సాంబార్ రసం తయారీ కోసం ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్‌లో వేసుకోవాలి. కొన్ని నీళ్లు పోసి పసుపు, నూనె వేసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ముద్దపప్పు మాదిరిగా ఉడికించుకోవాలి.
మరో స్టవ్‌పైన టమాటాలను కడిగి పొడుగ్గా కట్ చేసి నీళ్లు పోసి ఉడికించుకోవాలి. మరో గిన్నెలో చింతపండు నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు తాజా తమలపాకులను తీసుకుని వాటి కాడలు తీసేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో నాలుగు పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

పప్పు ఉడికిన తర్వాత మూత తీసి చల్లారనివ్వాలి. ఉడికించిన టమాటా ముక్కలను పైన పొట్టు తీసి మెత్తగా చేసుకుని రసం మాదిరిగా పిండుకోవాలి. చింతపండు నుంచి రసం తీసి పక్కన పెట్టుకోవాలి.
స్టవ్‌పైన బాణలి పెట్టుకుని అందులో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, టీస్పూన్ శనగపప్పు వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకోవాలి.
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్‌గా చేసుకునే పంచకజ్జాయ.!
ఉల్లిపాయలు దోరగా వేగాల్సిన అవసరం లేదు. మెత్తగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు పసుపుతో పాటు చింతపండు రసం వేసి మరిగించాలి. మూడు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత టమాటా రసం పోసి పొంగు వచ్చేంతవరకు ఉడికించుకోవాలి. తర్వాత తమలపాకు ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకు ఉడకనివ్వాలి.
ఇప్పుడు ముద్దపప్పు వేసి కలుపుకొని రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకుని బాగా మరిగించాలి. ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మరికాసేపు మరిగించుకోవాలి. చివర్లో కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత దించి పక్కన పెట్టుకోవాలి.
చిన్న పాన్‌లో టీస్పూన్ నూనె వేసి కచ్చాపచ్చాగ దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేగాక తమలపాకు సాంబార్ రసంలో కలుపుకోవాలి. ఆరోగ్యకరమైన రసం రెడీ. వేడివేడిగా అన్నంలోకి తినవచ్చు. లేదా గ్లాసులో పోసుకుని ఉట్టిగా తాగేయవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
