Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ముక్క మెత్తగా..అన్నం పొడిపొడిగా..పర్ఫెక్ట్ రాజుల కోడి పులావ్
తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో అత్యంత ఆదరణ పొందిన వంటకం రాజుల కోడి పులావ్. దీని రుచి, సువాసన, తయారీ విధానం ఇతర బిర్యానీలు లేదా పులావ్ ల కంటే భిన్నంగా ఉంటుంది. దీనిని భీమవరం కోడి పులావ్ అని లేదా రాజు గారి పులావ్ అని కూడా పిలుస్తారు.
హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమస్సో, గోదావరి జిల్లాల్లో ఈ రాజుల పులావ్ అంత ప్రసిద్ధి. సాధారణంగా బిర్యానీలో బాస్మతి బియ్యం వాడితే ఇందులో చిట్టి ముత్యాల బియ్యం వాడటం దీని ప్రత్యేకత. రాజుల కోడి పులావ్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
చికెన్: 1 కేజీ
చిట్టి ముత్యాల బియ్యం: 1 కేజీ
నూనె లేదా నెయ్యి: 150 గ్రాములు
నీళ్లు: 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు.
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 స్పూన్లు
కారం: 2 స్పూన్లు
ఉప్పు: తగినంత
పెరుగు: అర కప్పు
పసుపు: అర స్పూన్
నిమ్మరసం: ఒక చెక్క
మసాలా దినుసులు:
యాలకులు: 4-5
లవంగాలు: 6-8
దాల్చిన చెక్క: 2 అంగుళాల ముక్కలు
బిర్యానీ ఆకు: 2-3
షాజీరా: 1 స్పూన్
మరాఠీ మొగ్గ, అనాస పువ్వు: తగినంత
పచ్చిమిర్చి: 10-12
ఉల్లిపాయలు: 3 పెద్దవి
పుదీనా: ఒక కట్ట
కొత్తిమీర: ఒక కట్ట
కరివేపాకు: 2 రెమ్మలు
జీడిపప్పు: 50 గ్రాములు
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కలు,పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్,పెరుగు నిమ్మరసం వేసి మొత్తం కలిసేలా బాగా కలిపి 1 గంట పాటు పక్కన పెట్టాలి.
-చిట్టి ముత్యాల బియ్యాన్ని శుభ్రంగా కడిగి సుమారు 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
-తర్వాత స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె లేదా కుక్కర్ పెట్టుకోవాలి. అందులో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేశాక బిర్యానీ ఆకు, షాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాక జీడిపప్పు వేసి దోరగా వేయించాలి.
-తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
-ఇప్పుడు అందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్నచికెన్ ను వేయాలి. పెద్ద మంట మీద 5 నిమిషాల పాటు చికెన్ ను బాగా వేయించాలి. తర్వాత మంటను తగ్గించి మూత పెట్టి చికెన్ ను ఆయిల్ పైకి తేలే వరకు సుమారు 15-20 నిమిషాలు ఉడికించాలి. చికెన్ 80శాతం వరకు ఇక్కడే ఉడికిపోవాలి.
-చికెన్ ఉడికిన తర్వాత అందులో బియ్యానికి సరిపడా నీళ్లు పోయాలి. చిట్టి ముత్యాల బియ్యం అయితే 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు, కుక్కర్ అయితే 1:1.5 సరిపోతుంది. నీళ్లు కొంచెం ఉప్పగా ఉంటేనే పులావ్ ఉడికిన తర్వాత సరిగ్గా సరిపోతుంది.
-నీళ్లు మరుగుతున్నప్పుడు న్నగా తరిగిన కొత్తిమీర, నానబెట్టిన బియ్యాన్ని అందులో వేయాలి. బియ్యం వేసాక ఒకసారి మెల్లగా కలిపి, మూత పెట్టాలి
-నీరు 90శాతం ఇగిరిపోయి, బియ్యంపై చిన్న చిన్న రంధ్రాలుగా కనిపిస్తున్నప్పుడు మంటను తగ్గించి గిన్నె కింద ఒక పాత పెనం పెట్టి గిన్నెపై బరువు పెట్టి దమ్ చేయాలి.
-సుమారు 15 నిమిషాలు సన్నని మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసాక వెంటనే మూత తీయకుండా మరో 20 నిమిషాలు అలాగే వదిలేయాలి. అంతే ఘాటైన రాజుల కోడి పులావ్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications






