Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
వేడి వేడి ఇడ్లీ, కరకరలాడే దోశల్లోకి అదిరిపోయే టమాటా చట్నీ.. ఇలా చేస్తే రుచి అదుర్స్!
ఉదయం నిద్రలేవగానే బ్రేక్‌ఫాస్ట్ అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేవి వేడి వేడి ఇడ్లీలు, కరకరలాడే దోశలు. అయితే, టిఫిన్ ఎంత రుచిగా ఉన్నా సరే.. దానికి తగ్గ చట్నీ లేకపోతే ఆ బ్రేక్‌ఫాస్ట్ అసంపూర్ణంగానే అనిపిస్తుంది. సాధారణంగా అందరి ఇళ్లలో ఇడ్లీ, దోశల్లోకి కొబ్బరి చట్నీ లేదా పల్లీల చట్నీ చేస్తుంటారు. కానీ, ఆ ఆహార పదార్థాల రుచిని అమాంతం రెట్టింపు చేయాలంటే మాత్రం టమాటా చట్నీ ఖచ్చితంగా ఉండాల్సిందే.
దక్షిణ భారతదేశంలో టమాటా చట్నీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కొద్దిగా కారంగా, కాస్త పుల్లగా, మసాలాల కలయికతో నోరూరించే ఈ చట్నీ మీ బ్రేక్ ఫాస్ట్ ను మరింత ప్రత్యేకం చేస్తుంది. దీనికున్న మరో గొప్ప విషయం ఏమిటంటే, వంటరాని వారు కూడా చాలా తక్కువ సమయంలో, ఎంతో సులభంగా దీనిని తయారు చేసుకోవచ్చు.

టమాటా చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు
ఎర్రగా పండిన టమాటాలు - 3 లేదా 4
ఎండు మిరపకాయలు - 2
వెల్లుల్లి రెబ్బలు - 2 లేదా 3
ఉల్లిపాయ - 1
మినప పప్పు - 1 టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
కరివేపాకు - రెండు లేదా మూడు రెమ్మలు
నూనె - 1 టీస్పూన్
ఉప్పు - మీ రుచికి సరిపడాః
టమాటా చట్నీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ లేదా బాండీ పెట్టుకుని, అందులో ఒక టీస్పూన్ నూనె వేసి వేడి చేయండి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత అందులో మినపపప్పు, ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి పచ్చివాసన పోయేలా ఒక నిమిషం పాటు దోరగా వేయించండి.
-ఆ తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేయండి. ఉల్లిపాయలు లేత బంగారు రంగులోకి మారే వరకు మంటను మీడియంలో ఉంచి బాగా వేయించుకోవాలి.
-ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఎర్రటి టమాటా ముక్కలను పాన్‌లో వేసి బాగా కలపండి. టమాటాలు మెత్తబడి, గుజ్జులా మారే వరకు మూతపెట్టి ఉడికించాలి. చివరగా మీ రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి.
-ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. మిశ్రమం చల్లారిన తర్వాత, దానిని మిక్సీ జార్ లో వేసుకుని మెత్తటి పేస్ట్ లా రుబ్బుకోవాలి.
-ఇప్పుడు చట్నీకి ప్రాణం పోసే తాలింపు కోసం ఒక చిన్న కడాయిలో కొద్దిగా నూనె వేడి చేసి, అందులో ఆవాలు, తాజా కరివేపాకు వేసి వేయించండి. చిటపటలాడే ఈ పోపును ముందుగా రుబ్బి పెట్టుకున్న చట్నీపై వేసి కలపండి. అంతే, ఎంతో గుమగుమలాడే రుచికరమైన టమాటా చట్నీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
