Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
తమిళనాడు స్పెషల్ గ్రేవీతో గుత్తి వంకాయ కర్రీ..తింటే నోట్లో బ్లాస్ట్!
ఎప్పుడూ చేసుకునే వంకాయ కూర, వేపుడు కాకుండా, తమిళనాడు సంప్రదాయ రుచులతో ఘుమఘుమలాడే గుత్తి వంకాయ కూరతో మీ భోజనాన్ని ఒక పండుగలా మార్చేయవచ్చు.
ఈ కూర ప్రత్యేకత..ఇంట్లోనే అప్పటికప్పుడు వేయించి నూరుకున్న ఒక మసాలా పొడి. ఈ పొడి సువాసన, రుచి ఈ కూరకి ప్రాణం పోస్తుంది. దీని రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు.

కావలసిన పదార్థాలు
లేత వంకాయలు - పావు కిలో
సాంబార్ ఉల్లిపాయలు- 100 గ్రాములు
వెల్లుల్లి రెబ్బలు - 10
చింతపండు - పెద్ద నిమ్మకాయంత
పసుపు - అర టీస్పూన్
ఇంగువ - పావు టీస్పూన్
కరివేపాకు - రెండు రెమ్మలు
బియ్యప్పిండి - 1 టీస్పూన్
నువ్వుల నూనె- 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
ఆవాలు - 1 టీస్పూన్
మినపప్పు - 1 టీస్పూన్
శనగపప్పు - 1 టీస్పూన్
ఎండు మిరపకాయలు - 7
ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
కందిపప్పు - 1 టీస్పూన్
మెంతులు - అర టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్

తయారీ విధానం
-ముందుగా మసాలా పొడిని రెడీ చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద బాండీ పెట్టి అందులో ఎండు మిరపకాయలు, ధనియాలు, శనగపప్పు, కందిపప్పు, మెంతులు, జీలకర్ర వేసి నూనె లేకుండానే మంచి సువాసన వచ్చేదాకా దోరగా వేయించి స్టవ్ ఆపేయాలి.
-వేయించినవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఒక గిన్నెలో చింతపండు వేసి, ఒక కప్పు గోరువెచ్చని నీళ్లు పోసి పది నిమిషాలు నానబెట్టండి. తర్వాత బాగా పిసికి, చిక్కటి రసాన్ని తీసి, పిప్పిని పడేయండి.
-ఇప్పుడు వంకాయలను కడిగి, తొడిమలు తీయకుండా నాలుగు భాగాలుగా గాట్లు పెట్టండి. చిన్న ఉల్లిపాయలను పొట్టు తీసి సిద్ధంగా ఉంచుకోండి. వెల్లుల్లిని కొద్దిగా దంచుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ లేదా మందపాటి గిన్నె పెట్టి అందులో నూనె వేయండి. నూనె వేడెక్కాక ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించండి.
-ఇప్పుడు అందులో వెల్లుల్లి, కరివేపాకు, చిన్న ఉల్లిపాయలు వేసి, ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి. ఆ తర్వాత పసుపు, ఇంగువ వేసి ఒకసారి కలపండి.
-ఇప్పుడు గాట్లు పెట్టిన వంకాయలను అందులో వేసి అవి కొద్దిగా మగ్గేవరకు ఐదు నిమిషాల పాటు మీడియం మంట మీద వేయించండి.
-వంకాయలు కొద్దిగా రంగు మారిన తర్వాత చింతపండు రసం, రుచికి సరిపడా ఉప్పు, తయారు చేసుకున్న మసాలా పొడి వేసి బాగా కలపండి. మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు 10-15 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించండి. పచ్చి వాసన పోయి, కూర చిక్కబడుతుంది.
-చివరగా ఒక చిన్న గిన్నెలో బియ్యప్పిండి తీసుకుని, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి ఆ మిశ్రమాన్ని ఉడుకుతున్న కూరలో పోసి కలపి మరో రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి.
-అంతే ఘుమఘుమలాడే, కమ్మనైన గుత్తి వంకాయ కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications