Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
తెలంగాణ స్టైల్ మటన్ పచ్చడి..వేడి వేడి అన్నంతో తింటే స్వర్గమే!
తెలంగాణ ప్రాంతంలో నాన్ వెజ్ వంటకాలకు ఒక ప్రత్యేకమైన, ఘాటైన రుచి ఉంటుంది. ఇక్కడ మటన్ పచ్చడిని చాలా ఇష్టంగా చేసుకుంటారు. ముఖ్యంగా విదేశాల్లో ఉండే తమ పిల్లలకు, హాస్టల్స్ లో ఉండే విద్యార్థులకు ఇక్కడి తల్లులు ప్రేమతో చేసి పంపించే వంటకాల్లో మటన్ పచ్చడి ప్రధానమైనది.
ఇది కేవలం రుచిని మాత్రమే కాదు, కొన్ని నెలల పాటు నిల్వ ఉండే గుణాన్ని కలిగి ఉంటుంది. తెలంగాణ స్టైల్ లో మటన్ పచ్చడి ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
మటన్ (బోన్ లెస్): 1 కేజీ
పల్లీ నూనె: అర లీటర్
అల్లం వెల్లుల్లి పేస్ట్: 150 - 200 గ్రాములు
కారం పొడి: 100 - 150 గ్రాములు
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు: 1 టీస్పూన్
ధనియాల పొడి: 50 గ్రాములు
లవంగాలు: 2 టీస్పూన్లు
యాలకులు: 2 టీస్పూన్లు
దాల్చిన చెక్క పొడి: 2 టీస్పూన్లు
వేయించిన జీలకర్ర మెంతుల పొడి: 1 టీస్పూన్
నిమ్మరసం: 5 పెద్ద నిమ్మకాయల రసం
కరివేపాకు: 4 రెమ్మలు
తయారీ విధానం
-ముందుగా మటన్‌ను చిన్న చిన్న ముక్కలుగా (Cubical shape) కట్ చేసుకోవాలి. మాంసాన్ని శుభ్రంగా కడిగి, నీరు మొత్తం వారిపోయేలా జాలి గిన్నెలో ఉంచాలి.
-ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో లేదా కుక్కర్ లో మటన్ ముక్కలు వేసి, అందులో పసుపు, కొద్దిగా ఉప్పు, ఒక స్పూన్ నూనె వేసి కలపాలి. నీరు పోయకూడదు. సన్నని మంటపై ఉడికించాలి.
-మటన్‌లో నుండే నీరు ఊరుతుంది. ఆ నీరు మొత్తం ఇగిరిపోయి, ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి. ముక్కలో తడి అస్సలు ఉండకూడదు.
-స్టవ్ మీద కళాయి పెట్టి అందులో పల్లీ నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలను వేసి దోరగా వేయించాలి. ముక్కలు మరీ గట్టిగా రాకూడదు, అలాగని మెత్తగా ఉండకూడదు. గోల్డెన్ బ్రౌన్ కలర్ (బంగారు వర్ణం) వచ్చే వరకు వేయించి పక్కన ఒక గిన్నెలో తీసుకోవాలి.
-మటన్ వేయించగా మిగిలిన నూనెలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయి, మంచి సువాసన వచ్చే వరకు వేయించాక అందులో కరివేపాకు వేసి వేయించి స్టవ్ ఆపేయాలి.
-నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో కారం పొడి, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, వేయించిన జీలకర్ర-మెంతుల పొడి వేసి బాగా కలపాలి. ఈ మసాలా మిశ్రమంలో ముందుగా వేయించి పెట్టుకున్న మటన్ ముక్కలను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాతే నిమ్మరసం కలపాలి. వేడి మీద నిమ్మరసం పోస్తే పచ్చడి చేదు వస్తుంది. దీనిని ఒక శుభ్రమైన గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.
-పచ్చడి 2 లేదా 3 రోజుల తర్వాత తింటే ముక్కలకు ఉప్పు, కారం, పులుపు బాగా పట్టి రుచి అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications