Latest Updates
-
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.!
బంజారా స్పెషల్ సలోయ్.. ముక్క తింటే నోట్లో లాలాజలం ఊరాల్సిందే.. ఎలా చేసుకోవాలంటే?
మన దేశంలో ఎన్నో జాతులు, ఎన్నో మతాలు ఉన్నాయి. వారందరికీ ఎదో ఒక ప్రత్యేకమైన పద్ధతులు ఉంటాయి. అలాంటి జాతుల్లో ఒకటే బంజారా జాతి. వీరికి ప్రత్యేకమైన పద్ధతులు, ప్రత్యేకమైన వేషధారణ, ప్రత్యేకమైన వంటకాలు కూడా ఉంటాయి. వీరి వంటకాల్లో అత్యంత ప్రాచుర్యం పొందింది, అత్యంత రుచికరమైన సోలోయ్. దీనిని ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు లేదా పెళ్లిల్లో, విందుల్లో, ఇంట్లో చిన్న చిన్న పండగలు చేసుకునేటప్పుడు బంజారాలు ప్రధానంగా చేసుకుంటారు.
దీనిని మేక రక్తంతో చేస్తారు. తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. అదే విధంగా దీనిని వండుకోవడం కూడా చాలా సులభం. ఈ సోలోయ్ని ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనేది ఈ స్టోరీలో కూలంకూశంగా తెలుసుకుందాం.

సోలోయ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
- అర కిలో మేక మాంసం
- కొంచెం మేక రక్తం
- ఉప్పు
- పసుపు
- నూనె
- చింతపండు
సోలోయ్ తయారీ విధానం
ఈ సోలోయ్ తయారు చేయడానికి మేక కోసేటప్పుడే కొంత రక్తాన్ని ఒక గిన్నెలో పట్టుకోవాలి. ఆ రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు అందులో కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రక్తం గడ్డకట్టకుండా అలానే ఉంటుంది. దానిని తరువాత సోలోయ్లో వాడుకోవడానికి వీలు కలుగుతుంది.
ఈ సోలోయ్ తయారు చేసుకోవడానికి ఏది పడితే ఆ మాంసం తీసుకోకూడదు. ఈ సోలోయ్లో మేక బోటి, ఊపిరి తిత్తులు, కాలేయం, గుండె, మేక తలకాయ మాంసం, కొంచెం కంద భాగం తీసుకోవాల్సి ఉంటుంది. వీటిన్నంటినీ కలిగి ఒక అరకిలో మేక మాంసం తీసుకోవాలి. ఆ మాంసాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో మాంసం పరిమాణాన్ని బట్టి కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులోనే సోలోయ్ కోసం ముందుగానే కోసి పెట్టుకున్న మాంసాన్ని వేసుకోవాలి. అలానే అందులో కొంచెం ఉప్పు వేసుకొని కొద్దిసేపు మాంసాన్ని ఉడికించుకోవాలి.
మాంసంలో నుంచి కొంచెం నీరు ఊరాక అందులో పసుపు వేసుకోవాలి. అలాగే మాంసం పాత్రకు అంటకుండా ఉండేందుకు కొంచెం నీటిని కూడా పోసుకొని మాంసం బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మీడియం మంట మీద ఒక 15 నిమిషాల పాటు ఆ మాంసాన్ని బాగా ఉడకనివ్వాలి.
15 నిమిషాల తరువాత.. మాంసం బాగా ఉడికినట్లైతే అందులో మనం ముందుగా పట్టి ఉంచుకున్న మేక రక్తాన్ని కలపాలి. ఆ రక్తం మేక మాంసం మొత్తానికి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. అన్ని ముక్కలకు రక్తం పట్టినట్లు అనిపిస్తే ఒక్కసారి ఉప్పు రుచి చూసుకోవాలి. రుచి సరిగ్గా ఉంటే పర్వాలేదు, అదే కొంచెం ఉప్పు పడితే కొంచెం ఉప్పు వేసుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు మాంసాన్ని ఉడకనివ్వాలి. రక్తం పాత్రకు అంటకుండా అప్పుడప్పుడు తీసి కలుపుతూ ఉండాలి. అప్పుడే అన్ని ముక్కలు సమానంగా ఉడకడంతో పాటు సోలోయ్ కూడా రుచికరంగా వస్తుంది. 15 నిమిషాల తరువాత పాత్రను కిందకు దించి ఓసారి మొత్తం కలుపుకుంటే.. బంజారా స్పెషల్ సోలోయ్ సిద్ధమైనట్లే.
దీనిని ముక్కలుముక్కలుగానే తినేయొచ్చు. లేదా రొట్టెలో నంజుకొని కూడా తినొచ్చు. రుచి మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. మీ బంజారా స్నేహితుడు ఉంటే కచ్చితంగా ఓసారి వారి ఇంటికి వెళ్లి ఈ సోలోయ్ తినడానికి ప్రయత్నించండి. మన పట్టణాల్లో మాత్రం ఇది అందుబాటులో లేదు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
