Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఈ స్టైల్ లో టమాటా రసం పెడితే.. ఒక్క మెతుకు కూడా వదలకుండా లాగించేస్తారు!
రోజురోజుకీ భానుడు భగభగ మండిపోతున్నాడు. ఎండల తీవ్రతకు శరీరం త్వరగా అలసిపోతుంది. ఇలాంటి వాతావరణంలో కడుపుకు హాయినిచ్చేలా, శరీరాన్ని చల్లగా ఉంచే తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
అయితే ఈ వేసవికి అద్భుతంగా సరిపోయే ఒక కమ్మని వంటకం టమాటా రసం. వేడి వేడి అన్నంలోకి ఈ రసం, నంజుకోవడానికి ఏదైనా చిన్న అప్పడం లేదా వడియం ఉంటే చాలు.. కడుపు నిండా తృప్తిగా తినేయవచ్చు.

టమాటో రసం తయారీకి కావాల్సిన పదార్థాలు
చింతపండు - చిన్న ఉసిరికాయంత
మిరియాలు - ముప్పావు టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
మెంతులు - 2 చిటికెలు
ఆవాలు - పావు టీస్పూన్
కాశ్మీరీ ఎండుమిర్చి - 1
సాధారణ ఎండుమిర్చి - 1
కరివేపాకు - 1 రెబ్బ
పండిన టమాటాలు - 5
ఉప్పు - రుచికి సరిపడా
కరివేపాకు - ఒక రెబ్బ
కొత్తిమీర - కొద్దిగా
పచ్చిమిర్చి - 1
నీళ్లు - ఒకటిన్నర లీటర్లు
పసుపు - పావు టీస్పూన్
నూనె - ఒక టీస్పూన్
ఆవాలు - పావు టీస్పూన్
కరివేపాకు - 1 రెబ్బ
ఎండుమిర్చి - 1
వెల్లుల్లి - 6 రెబ్బలు
బెల్లం - అర టీస్పూన్
నెయ్యి - పావు టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా
టమాటో రసం తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో చింతపండును తీసుకుని, కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టండి. మెత్తబడిన తర్వాత చేత్తో బాగా పిసికి, పిప్పి తీసేసి చింతపండు రసాన్ని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు మిక్సీ జార్ లో మిరియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, కశ్మీరీ ఎండుమిర్చి, సాధారణ ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాల పొడి వేసి మెత్తని పొడిలా మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోండి.
-ఒక పెద్ద గిన్నెలో పండిన టమాటాలను తీసుకుని ముక్కలుగా కోయండి. అందులోనే ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసం, రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి వేయండి. ఇప్పుడు మీ చేత్తో ఈ మిశ్రమాన్ని బాగా మెత్తగా అయ్యేలా పిసకండి. ఆ టమాటా గుజ్జులో సుమారు ఒకటిన్నర లీటర్ల నీళ్లు పోయండి. అందులోనే పావు టీస్పూన్ పసుపు, మిక్సీ పట్టుకున్న రసం పొడిని వేసి గరిటెతో బాగా కలపండి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి, ఒక గిన్నె పెట్టుకోండి. అందులో కొద్దిగా నువ్వుల నూనె లేదా వంట నూనె వేయండి. నూనె వేడెక్కాక ఆవాలు, కరివేపాకు, గింజలు తీసిన ఎండుమిర్చి వేసి వేయించండి. ఆ తర్వాత కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి పచ్చివాసన పోయి, సువాసన వచ్చే వరకు వేయించండి.
-తాలింపు వేగిన తర్వాత, ముందుగా సిద్ధం చేసుకున్న టమాటా నీటి మిశ్రమాన్ని అందులో పోయండి. ఇందులోనే అర టీస్పూన్ బెల్లం వేయండి.
- రసం అంచుల వెంబడి కొద్దిగా నురుగు రావడం మొదలై, పచ్చి వాసన పోయిన వెంటనే స్టవ్ కట్టేయాలి. చివరగా పైన కొద్దిగా కొత్తిమీర చల్లి, పావు టీస్పూన్ నెయ్యి వేసి మూత పెట్టేయండి.
-అంతే నోరూరించే, కడుపుకు చలువ చేసే టమాటా రసం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications