Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
కీళ్ల నొప్పులా? ఈ మటన్ పెప్పర్ సూప్ తాగితే ఉపశమనం పక్కా..ఎలా చేసుకోవాలంటే..
శీతాకాలం వచ్చిందంటే చాలు.. చలి పులిలా మీద పడుతుంది. ఉష్ణోగ్రతలు తగ్గేకొద్దీ మన శరీరం వెచ్చదనాన్ని కోరుకుంటుంది. మరోవైపు జలుబు, జ్వరం, గొంతు నొప్పి వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, అలాగే వయసుతో సంబంధం లేకుండా వేధించే కీళ్ల నొప్పులు ఈ సీజన్ లో మరింత ఎక్కువవుతాయి.
వీటన్నింటికీ చెక్ పెడుతూ, శరీరానికి తక్షణ శక్తిని, వెచ్చదనాన్ని ఇచ్చే అద్భుతమైన పరిష్కారం..మటన్ పెప్పర్ సూప్. మాంసాహార ప్రియులకు ఇది కేవలం ఒక సూప్ మాత్రమే కాదు, ఒక దివ్యౌషధం. ఘాటైన మిరియాలు, బలవర్థకమైన మటన్ ఎముకల సారం కలిస్తే అది అమృతంలా పనిచేస్తుంది. మటన్ పెప్పర్ సూప్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావలసిన పదార్థాలు
మటన్ (ఎముకలతో సహా)- 300 గ్రాములు
తాజా మిరియాల పొడి - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయ - 1
పసుపు - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 1 టేబుల్ స్పూన్
నీళ్లు - 5 కప్పులు
కొత్తిమీర - గార్నిష్ కోసం
తయారీ విధానం
-ముందుగా ప్రెషర్ కుక్కర్ లో ఒక స్పూన్ నెయ్యి లేదా నూనె వేసి వేడి చేయండి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అవి బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి.
-ఇప్పుడు అందులో పసుపు, తాజాగా దంచుకున్న మిరియాల పొడిని వేసి ఒక నిమిషం పాటు వేయించండి.
-ఇప్పుడు శుభ్రం చేసిన మటన్ ముక్కలను కుక్కర్ లో వేసి 3-4 నిమిషాల పాటు పెద్ద మంట మీద బాగా వేయించాలి. ఇలా చేయడం వల్ల మటన్ లోని నీచు వాసన పోయి, సూప్‌కు మంచి రుచి వస్తుంది.
-ఇప్పుడు 4-5 కప్పుల నీళ్లు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. కుక్కర్ మూత పెట్టి, మీడియం మంట మీద 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. మటన్ ఎముకలలోని సారం నీటిలోకి దిగితేనే సూప్ బలవర్థకంగా మారుతుంది.
-ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూడండి. సూప్ మరీ పల్చగా అనిపిస్తే, చిక్కబడే వరకు కాసేపు మరిగించండి.
-చివరగా, కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేయండి. అవసరమైతే పైన ఇంకాస్త మిరియాల పొడి చల్లుకోవచ్చు.
-ఈ శీతాకాలంలో వారానికి రెండు, మూడు సార్లు ఈ వేడి వేడి మటన్ పెప్పర్ సూప్ తీసుకుంటే జలుబు, దగ్గు మీ దరిదాపుల్లోకి కూడా రావు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications