Latest Updates
-
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ!
బీరకాయ అనగానే చాలా మంది పెదవి విరుస్తుంటారు. ముఖ్యంగా పిల్లలైతే బీరకాయ కూర చేస్తే తినడానికి అస్సలు ఆసక్తి చూపించరు. కానీ అదే బీరకాయతో అదిరిపోయే రుచితో కరకరలాడే గారెలు చేయొచ్చని మీకు తెలుసా? ఈ గారెలు ఎంత రుచిగా ఉంటాయంటే.. ఒక్కటి తింటే మరోటి అడగాల్సిందే. బిగినర్స్ కూడా చాలా సులభంగా చేసుకోగలిగే ఈ బీరకాయ గారెలు స్నాక్స్ సమయానికి పర్ఫెక్ట్ ఛాయిస్. బీరకాయ గారెలు మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
బీరకాయ గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు
లేత బీరకాయ - 1
మినపప్పు - 1 కప్పు
పచ్చిమిర్చి - 5
ఉల్లిపాయ - 1
నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు
అల్లం - ఒక అంగుళం ముక్క
కరివేపాకు - రెండు రెమ్మలు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

బీరకాయ గారెలు తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో కప్పు మినపప్పును తీసుకొని శుభ్రంగా రెండుసార్లు కడగాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి సుమారు 7 గంటల పాటు నానబెట్టుకోవాలి.
-పప్పు బాగా నానిన తర్వాత, మిక్సీ గిన్నెలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. గారెలు క్రిస్పీగా రావాలంటే పిండిని మరీ పలుచగా కాకుండా, కొద్దిగా నీళ్లు మాత్రమే చిలకరిస్తూ గట్టిగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు బీరకాయను శుభ్రంగా కడిగి, పైన చెక్కు తీసేసి సన్నగా తురుముకోవాలి. బీరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ తురుమును చేత్తో గట్టిగా పిండి నీరంతా తీసేయాలి.
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
-ఒక మిక్సింగ్ బౌల్ లో ముందుగా రుబ్బి పెట్టుకున్న మినప్పిండిని తీసుకోవాలి. అందులో నీరు పిండేసిన బీరకాయ తురుము, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు ముక్కలను వేయాలి. దీనిలోనే రుచికి సరిపడా ఉప్పు, రెండు స్పూన్ల నువ్వులు కూడా వేసి పిండిని బాగా కలుపుకోవాలి. నువ్వులు వేయడం వల్ల గారెలు మరింత రుచిగా వస్తాయి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని, డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి.
-చేతిని కొద్దిగా నీటితో తడి చేసుకుంటూ, కలుపుకున్న పిండిని కొద్దికొద్దిగా తీసుకుని గారెల్లా వత్తుకోవాలి. వీటిని నెమ్మదిగా కాగుతున్న నూనెలో వేయాలి. మీడియం మంట మీద రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ (బంగారు రంగు) వచ్చే వరకు గారెలను దోరగా వేయించుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన, కరకరలాడే బీరకాయ గారెలు రెడీ. వేడివేడిగా ఉన్నప్పుడే అల్లం చట్నీ లేదా కొబ్బరి పచ్చడితో అద్దుకుని తింటే ఆ మజాయే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications