Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్‌వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి!
సాయంత్రం కాగానే వేడివేడిగా ఏదైనా స్నాక్ తినాలనిపించడం సహజం. వెంటనే మనకు గుర్తొచ్చేవి సమోసా, బజ్జీ, పకోడీ లేదా కచోరీలు. కానీ రోజూ నూనెలో డీప్ ఫ్రై చేసినవి తింటే ఆరోగ్యానికి ముప్పు తప్పదు. అలాగని స్నాక్స్ తినడం మానేయలేం. అందుకే, ఈసారి కాస్త భిన్నంగా, ఎంతో ఆరోగ్యకరమైన, రుచికరమైన బీరకాయ టిక్కీ ట్రై చేయండి.

సాధారణంగా బీరకాయ పేరు చెబితేనే పిల్లలు ముఖం తిప్పేసుకుంటారు. కానీ ఇలా కరకరలాడే టిక్కీలు చేసి పెడితే, అందులో ఉన్నది బీరకాయ అని కూడా కనిపెట్టలేరు.. లొట్టలేసుకుంటూ లాగించేస్తారు.
బీరకాయ టిక్కీ తయారీకి కావలసిన పదార్థాలు
లేత బీరకాయలు - 2
ఉడకబెట్టిన బంగాళదుంప - 1
శనగపిండి - అర కప్పు
బ్రెడ్ క్రంబ్స్ (బ్రెడ్ పొడి) - పావు కప్పు
ఉల్లిపాయ ముక్కలు - పావు కప్పు
కొత్తిమీర - పావు కప్పు
తురిమిన అల్లం - పావు టీస్పూన్
నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
ధనియాల పొడి - అర టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
తురిమిన చీజ్ - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - వేయించడానికి తగినంత
బీరకాయ టిక్కీ తయారీ విధానం
-ముందుగా బీరకాయలను శుభ్రంగా కడిగి, చెక్కు తీసి సన్నగా తురుముకోవాలి. అలాగే ఉడకబెట్టిన బంగాళదుంపను కూడా మెత్తగా తురిమి పక్కన పెట్టుకోవాలి.
-బీరకాయలో నీటి శాతం ఎక్కువ కాబట్టి, తురిమిన బీరకాయను చేత్తో గట్టిగా పిండి, అందులోని అదనపు నీటిని పూర్తిగా తీసేయాలి. ఇలా చేయకపోతే మిశ్రమం జారుగా మారిపోయి టిక్కీలు విరిగిపోతాయి.
-ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో నీరు పిండేసిన బీరకాయ, బంగాళదుంప తురుము, శనగపిండి, బ్రెడ్ క్రంబ్స్ వేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, కొత్తిమీర, అల్లం తురుము, నిమ్మరసం, జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా వేసి అన్ని పదార్థాలు కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఉప్పు, తురిమిన చీజ్‌ను టిక్కీలు చేసే ముందు (చివర్లో) మాత్రమే కలపాలి. ఉప్పు ముందే వేస్తే బీరకాయ మళ్లీ నీరు విడిచి, పిండి పలచబడుతుంది.
-మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, అరచేతిలో పెట్టి గుండ్రంగా, ఫ్లాట్ గా టిక్కీ ఆకారంలో ఒత్తుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి, కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక ఈ టిక్కీలను వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, రెండు వైపులా 3-4 నిమిషాల పాటు దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు కాల్చుకోవాలి.
-అంతే బీరకాయ టిక్కీ రెడీ.
ఆరోగ్య ప్రయోజనాలు
- బరువు తగ్గాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులోని పీచుపదార్థం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.
- బీరకాయలో నీటి శాతం చాలా ఎక్కువ. ఇది శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది.
-ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మ సౌందర్యానికి మేలు చేస్తాయి.
-రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో బీరకాయ అద్భుతంగా పనిచేస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications