చపాతీ పిండిలో ఈ రెండు కలిపి చూడండి.. కూర లేకపోయినా కడుపునిండా తినేస్తారు!

Posted By:

ఇంట్లో ఎప్పుడూ ఒకే రకమైన గోధుమ చపాతీలు తిని విసుగు వచ్చిందా? పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినేలా కొత్తగా, ఆరోగ్యకరంగా ఏదైనా చేయాలనిపిస్తోందా? అయితే ఈసారి బీట్‌ రూట్, నల్ల శనగలతో ఇలా రుచికరమైన చపాతీలు చేసి చూడండి. వీటికి ప్రత్యేకంగా కూర కూడా అవసరం లేదు. కానీ దీనితో పాటు ఘాటుగా ఉండే వెల్లుల్లి పచ్చిమిర్చి డిప్ జతచేస్తే ఆ రుచే అద్భుతం. ప్రోటీన్లు, ఐరన్ పుష్కలంగా ఉండే ఈ హెల్తీ కాంబో రెసిపీని ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

చపాతీకి కావలసిన పదార్థాలు

ఉడికించడానికి:

నల్ల శనగలు - 150 గ్రాములు (2 గంటలు నానబెట్టినవి)
బీట్‌ రూట్ ముక్కలు - 150 గ్రాములు
పెద్ద ఉల్లిపాయ - 1
వెల్లుల్లి రెబ్బలు - 10
అల్లం - చిన్న ముక్క
నీరు - 2 కప్పులు

పిండి కలపడానికి:

గోధుమ పిండి - 1 కప్పు
కొత్తిమీర - కొద్దిగా
సన్నగా తరిగిన పచ్చిమిర్చి - 1
కశ్మీరీ కారం - అర టీస్పూన్
జీలకర్ర పొడి - అర టీస్పూన్
పెరుగు - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నెయ్యి - కాల్చడానికి

వెల్లుల్లి పచ్చిమిర్చి డిప్ కోసం

ఆవాలు - 1 టేబుల్ స్పూన్
వేరుశెనగ నూనె - 2 టేబుల్ స్పూన్లు
సన్నగా తరిగిన వెల్లుల్లి - 2 టీస్పూన్లు
సన్నగా తరిగిన పచ్చిమిర్చి - 2 టేబుల్ స్పూన్లు
చిలికిన పెరుగు - 4 టేబుల్ స్పూన్లు + 50 మి.లీ
ఉప్పు - రుచికి తగినంత

Beetroot Black Chickpea Chapati with Spicy Garlic Chili Dip A Healthy Combo That Needs No Curry

చపాతీ తయారీ విధానం

-ముందుగా నానబెట్టిన నల్ల శనగలు, బీట్‌రూట్, ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, 2 కప్పుల నీరు కుక్కర్‌ లో వేసి 4 విజిల్స్ వచ్చేవరకు ఉడికించండి. ఆవిరి పోయాక నీటిని వడకట్టి, ఉడికించిన పదార్థాలను మిక్సీ జార్‌ లో వేసి మెత్తగా రుబ్బుకోండి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని కొత్తిమీర, పచ్చిమిర్చి, కాశ్మీరీ కారం, జీలకర్ర పొడి, ఉప్పు, గోధుమ పిండి వేసి బాగా కలపండి. చివరగా పెరుగు చేర్చి మృదువైన చపాతీ పిండిలా కలిపి, మూతపెట్టి 10 నిమిషాలు నాననివ్వండి.

-ఆ తర్వాత పిండిని ఉండలుగా చేసి చపాతీలా ఒత్తి, వేడెక్కిన పెనంపై రెండు వైపులా నెయ్యి రాస్తూ కాల్చుకుంటే మృదువైన, పోషకభరితమైన బీట్‌రూట్ శనగ చపాతీలు రెడీ.

చూస్తుంటేనే నోరూరిపోయే డబుల్ లేయర్ చాక్లెట్ బర్ఫీ.. ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా!

డిప్ తయారీ విధానం

-స్టవ్‌ పై పాన్ పెట్టి ఆవాలను దోరగా వేయించి, మిక్సీలో పొడి చేసి పక్కన పెట్టుకోండి. అదే పాన్‌ లో వేరుశెనగ నూనె వేడి చేసి, తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి రంగు మారేవరకు వేయించండి. అందులో ఉప్పు, ఆవాల పొడి వేసి కలపండి. ఆ తర్వాత 4 టేబుల్ స్పూన్ల చిలికిన పెరుగు పోసి బాగా ఉడికించండి.

-చివరగా స్టవ్ ఆపి మిగిలిన 50 మి.లీ చిలికిన పెరుగు వేసి బాగా కలిపితే నోరూరించే వెల్లుల్లి పచ్చిమిర్చి డిప్ రెడీ.

వేడివేడి బీట్‌ రూట్ చపాతీలను ఈ స్పైసీ డిప్‌ తో వడ్డించి చూడండి.. ఇంట్లో వాళ్లంతా ఖచ్చితంగా ఫిదా అవుతారు.

[ of 5 - Users]
Story first published: Sunday, November 15, 2026, 10:41 [IST]
Desktop Bottom Promotion